జిల్లాలో రెండు కొత్త పోలీస్‌ సర్కిల్స్‌

3 Dec, 2023 01:06 IST|Sakshi
కొత్త సర్కిల్‌గా ఏర్పాటు కానున్న ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌

శృంగవరపుకోట: రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తసర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీఓం 192ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీచేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా జిల్లాలో ఎస్‌.కోట, భోగాపురంలలో రెండు కొత్తసర్కిళ్లను ఏర్పాటు చేస్తూ అధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఎస్‌.కోట మండలం ఒక సర్కిల్‌గా, భోగాపురం మండలం ఒక సర్కిల్‌గా ఏర్పాటు కానుంది. ఆయా సర్కిల్స్‌లో ఇక నుంచి సీఐ స్థాయి అధికారి ఎస్‌హెచ్‌ఓగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా ఎస్‌.కోట ఎస్‌ఐగా పనిచేస్తున్న తారకేశ్వరరావును విజయనగరం వన్‌టౌన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఎస్‌.కోట సర్కిల్‌ పరిధిలో జామి, ఎల్‌.కోట, వేపాడ, ఎస్‌.కోట మండలాలు ఉన్నాయి. పెరిగిన పనిఒత్తిడి, కేసుల సంఖ్య తదితర అంశాల ఆధారంగా ఎస్‌.కోటను కొత్త సర్కిల్‌గా ఏర్పాటు చేశారు. మరింత కచ్చితమైన నిఘా, పర్యవేక్షణతో పాటు సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

సీఐ స్థాయి అధికారికి ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు

అందుబాటులో పోలీస్‌ సేవలు

మరిన్ని వార్తలు