ధాన్యం కొనుగోలు పరిశీలన

3 Dec, 2023 01:06 IST|Sakshi
ధాన్యం రకాలను పరిశీలిస్తున్న జేసీ గోవిందరావు

సీతానగరం: ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జేసీ రోణంకి గోవిందరావు స్పష్టం చేశారు. మండలంలోని పెదభోగిలి రైతు భరోసా కేంద్రం పరిధిలో రైతు కొల్ల శ్రీనివాసరావు కల్లాం నుంచే ధాన్యం కొనుగోలులో భాగంగా నాణ్యతను, తేమశాతాన్ని పరిశీలించారు. తుపాను దృష్ట్యా వరి చేనును భద్రపరుచుకోవాలని సూచించారు. కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ చొరవతో పార్వతీపురం మన్యం జిల్లాలో ముందుగానే ధాన్యం కొనుగోలు ప్రారంభించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్‌ రాబర్ట్‌పాల్‌, పౌరసరఫరాల అధికారి నాయక్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.శ్రీరాములునాయుడు, జెడ్పీటీసీ సభ్యులు ఎం.బాబ్జీ, ఏఓ ఎస్‌.అవినాష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు