సంక్షేమ పాలనకు అండగా ఉందాం

3 Dec, 2023 01:08 IST|Sakshi

తెర్లాం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి నాలుగున్నరేళ్లుగా పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా ఉందామని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పిలుపునిచ్చారు. మండలంలోని కూనాయవలస గ్రామంలో రూ.కోటి50లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలను బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి శనివారం ప్రారంభించారు. బొబ్బిలి ఏఎంసీ చైర్మన్‌ బొమ్మి శ్రీనివాసరావు, సర్పంచ్‌ బోడెల విజయబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో జెడ్పీ చైర్మన్‌ మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ 100 శాతం అమలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచేశారన్నారు. కూనాయవలస సచివాలయం పరిధిలోని జన్నివలస, కూనాయవలస గ్రామాల ప్రజలకు డీబీటీ విధానంలో వివిధ సంక్షేమ పథకాల కింద రూ.17కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పించారన్నారు.

● బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాట్లాడుతూ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బొబ్బిలి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని, రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

● పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోని చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.27కోట్లు ఇప్పించిన ఘనత శంబంగికే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గంలో తోటపల్లి ప్రాజెక్ట్‌ ద్వారా 20వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు శంబంగి వేణుగోపాలనాయుడు, తెర్లాం ఎంపీపీ ఉమాలక్ష్మి, జెడ్పీటీసీ ప్రతినిధి రామారావు, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, రమాదేవి అప్పలరాజు, వైఎస్సార్‌ సీపీ మండలాధ్యక్షుడు టి.సత్యంనాయుడు, నాయకులు బాబ్జీరావు, అప్పలనాయుడు, జగన్నాథ, ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్‌ రత్నకుమార్‌, బొబ్బిలి డీఎల్‌డీఓ రవీంద్ర, మండల ప్రత్యేకాధికారి లక్ష్మణరావు, పీఆర్‌ డీఈ అప్పా రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పీఎంకె రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

కూనాయవలసలో ఆర్బీకే, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్‌, బొబ్బిలి, పార్వతీపురం ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు