మహిళల ‘కన్యాశుల్కం’

3 Dec, 2023 01:08 IST|Sakshi
గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని రిహార్సల్స్‌ చేస్తున్న నటీమణులు

● నాటకంలోని పాత్రలకు జీవంపోస్తున్న

మహిళలు

● ప్రధాన పాత్రధారులంతా వయోవృద్ధులే..

● నేడు ఆనందగజపతి కళాక్షేత్రంలో ప్రదర్శన

● గురజాడ విశిష్ట పురస్కారం అందుకోనున్న సినీ గేయరచయిత చంద్రబోస్‌

విజయనగరం టౌన్‌: సీ్త్ర అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు, వెయ్యేళ్లుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి మరో వెయ్యేళ్ల ముందు చూపుతో రచనలు చేసిన సంఘసంస్కర్త మహాకవి గురజాడ వెంకట అప్పారావు. ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యేలా వ్యవహారిక భాషలో కన్యాశుల్కం నాటకాన్ని రచించారు. నాటకంలో ప్రతి పాత్రకీ ఓ శైలి ఉంటుంది. ప్రతీ పదం ఓ ఆలోచనాత్మకం. ప్రతి అంశం ప్రజలను మేల్కొలిపేలా ఉంటుంది. మహాకవి రచించిన కన్యాశుల్కం నాటకాన్ని కొందరు మహిళలు ప్రదర్శిస్తూ.. అందులోని పాత్రలకు జీవం పోస్తున్నారు. ఈపు విజయకుమార్‌ దర్శకత్వంలో భోగరాజు సూర్యలక్ష్మి ఆర్గనైజర్‌గా, గిరీశం పాత్రఽలో చూపరులను ఆకట్టుకుంటున్నారు. వెంకటేశం పాత్రలో కుమారి వాకా దేదీప్య, అగ్నిహోత్రవధానులుగా కుమారి సామవేదుల గీతారాణి, కరటకశాస్త్రిగా ముళ్లపూడి సుభద్రాదేవి, బుచ్చమ్మగా కుమారి సామవేదుల సత్యలత, వెంకమ్మగా ఉదయగిరి నీలిమలు కలిసి కన్యాశుల్కం నాటకంలో సన్నివేశాలను రక్తికట్టిస్తున్నారు. గురజాడ 108వ వర్ధంతిని పురస్కరించుకుని ఆనందగజపతి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సినీగేయ రచయిత, ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత కె.ఎస్‌.చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారాన్ని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదానం చేయనున్నారు. సభా కార్యక్రమానికి ముందు మహిళలతో గురజాడ కన్యాశుల్కంలోని కొన్నిసన్నివేశాలను ప్రదర్శించనున్నారు. కార్యక్రమానికిఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, మాజీ ఎంపీ డాక్టర్‌ బొత్స ఝాన్సీలక్ష్మి, నవసాహితీ సంస్థ (చైన్నె) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.వి.సూర్యప్రకాశరావు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు