రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు 40 మంది ఎంపిక

4 Dec, 2023 00:34 IST|Sakshi
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. ఈ మేరకు జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని విజ్జి స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి సబ్‌ జూనియర్‌, క్యాడెట్‌ విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమప్రతిభ కనబరిచిన 40 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న వారిలో సబ్‌ జూనియర్‌ విభాగంలో 18 మంది, క్యాడెట్‌ విభాగంలో 22 మంది క్రీడాకారులు ఉన్నట్లు జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ముఖ్య శిక్షకుడు డీవీ చారి ప్రసాద్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 8 9 10వ తేదీలలో విజయనగరంలోని ఇండోర్‌ స్టేడియంలో 10వ సబ్‌ జూనియర్‌, 9వ క్యాడెట్‌ విభాగాల్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్‌ఆర్‌సీపీ విజయనగరం పార్లమెంట్‌ జిల్లా సెక్రటరీ ముద్దాడ మధు, బీసీ సంఘం అధ్యక్షురాలు గదుల సత్యలత మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర , జాతీయస్థాయిలో పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు కోచ్‌లు, ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ నెల 8 నుంచి జిల్లాలో నిర్వహణ

మరిన్ని వార్తలు