37 కిలోల గంజాయి స్వాధీనం

4 Dec, 2023 00:34 IST|Sakshi
గంజాయి నిందితులతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు

విజయనగరం క్రైమ్‌: పశ్చిమబెంగాల్‌కు చెందిన మాజిబర్‌ రెహమాన్‌, సర్దార్‌లు గంజాయి తరలిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది అరెస్ట్‌ చేసి 37కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఈబీ విజయనగరం–1 బి.మధుకుమార్‌ మాట్లాడుతూ ఆదివారం రాత్రి సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్‌ రోడ్డులో పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని పట్టుకుని, విచారణ చేశామని చెప్పారు. ఈ క్రమంలో వారి దగ్గర ఉన్న నాలుగు బ్యాగ్‌లలో 37 కిలోల బరువు కలిగిన 21 గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిద్దరి మొబైల్స్‌ సీజ్‌ చేసి, అరెస్ట్‌ చేశామని చెప్పారు. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్‌ ప్రకారం సుమారు రూ. 2 లక్షల ఉంటుందని తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి తమిళనాడుకు తీసుకుని వెళ్తుండగా నిందితులు విచారణలో అంగీకరించారన్నారు. దాడుల్లో ఎస్సై జాన్‌ప్రసాద్‌, హెచ్‌సీ ధనరాజు, వెంకటరమణ, గంగాధర్‌, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరి అరెస్ట్‌

మరిన్ని వార్తలు