చేపల వేటకు వెళ్లవద్దు..

4 Dec, 2023 00:34 IST|Sakshi
చింతపల్లిలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్న తహసీల్దార్‌ తదితరులు

పూసపాటిరేగ: తీరప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తహసీల్దార్‌ ఇ.భాస్కరరావు సూ చించారు. మండలంలోని చింతపల్లిరేవును ఆదివా రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాన్‌ నేపథ్యంలో వేట తగదన్నారు. అనంతరం పతివాడబర్రిపేట, తిప్ప లవలస రేవులో మత్స్యకారులకు అవగాహన కల్పి ంచారు. ఆయనతో పాటు చింతపపల్లి మైరెన్‌ సీఐ వైకుంఠరావు, భోగాపురం సీఐ విజయ్‌కుమార్‌, తదితరులున్నారు.

ఆందోళనలో అన్నదాత

డెంకాడ: వరుసుగా వస్తున్న అల్పపీడనాలు, తుఫాన్‌లు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంట కోత దశలో ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులను దాటుకుని పండి న పంటను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కోత కోసిన పంటను పొలా ల్లోనే కుప్పలుగా పెడుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల కోతలు పూర్తి చేయలేదు. తుఫాన్‌ ప్రభావంతో వర్షా లు పడితే తమ పరిస్థితి ఏమిటని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే వరి పంటను ఎలా కాపాడుకోవాలో వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు