విషణ్ణవదనాలతో అక్టోపస్‌ కానిస్టేబుల్‌ అంత్యక్రియలు

4 Dec, 2023 00:34 IST|Sakshi
సోమేశ్వరరావుకు సెల్యూట్‌ చేస్తున్న డీఎస్పీ

సంతకవిటి: మండలంలోని వాల్తేరు గ్రామానికి చెందిన అక్టోపస్‌ కానిస్టేబుల్‌ గురుగుబెల్లి సోమేశ్వరరావు(33) అంత్యక్రియలు విషణ్ణవదనాలతో ఆదివారం జరిగాయి. 16వ బెటాలియన్‌కు చెందిన ఆయన డిప్యుటేషన్‌పై అక్టోపస్‌ కానిస్టేబుల్‌గా విజయవాడలో పనిచేస్తున్నారు. శనివారం అక్కడ జరిగిన 10కే రన్‌లో పాల్గొని గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే మృతిచెందారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న తల్లి లక్ష్మి, భార్య వెంకటలక్ష్మి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆయనకు 2 సంవత్సరాల కుమార్తె శరణ్య ఉంది. ఆయన తండ్రి చంద్రినాయుడు గతంలోనే చనిపోయారు. కానిస్టేబుల్‌ మృతదేహాన్ని ఆదివారం వాల్తేరు తీసుకురాగా, 16వ బెటాలియన్‌ పోలీసులు గ్రామానికి చేరుకుని గౌరవవందనం సమర్పించారు. డీఎస్‌పీ శ్రీనివాసచక్రవర్తి, రాజాం సీఐ రవికుమార్‌, సంతకవిటి ఎస్సై లోకేశ్వరరావు, తదితరులు సోమేశ్వరరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు