సర్వజన ఆస్పత్రిలో కార్నియా సేకరణ

4 Dec, 2023 00:34 IST|Sakshi
జలాసనంలో ప్రముఖ జలాసన నిపుణుడు సుబ్బారావు, యోగా గురువు విజయలక్ష్మి

విజయనగరం ఫోర్ట్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి నుంచి రెడ్‌క్రాస్‌ సొసైటీ ఐ డోనేషన్‌ సెంటర్‌ సిబ్బంది కార్నియాను సేకరించా రు. వివరాల్లోకి వెళ్తే.. గంట్యాడ గ్రామానికి చెందిన బి.గణపతిరావు(24) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆది వారం మృతి చెందాడు. అతని కార్నియాను సేకరించాలని రెడ్‌క్రాస్‌ ఐ డోనేషన్‌ సెంటర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేర కు ఐ డోనేషన్‌ సెంటర్‌ ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్‌ ఎ.శ్రీను సర్వజన ఆస్పత్రి మార్చురీలో కార్నియాను సేకరించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి కేఆర్‌డీ ప్రసాదరావు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా నేత్ర దానం గొప్పది అన్నారు. ఒక వ్యక్తి నేత్ర దానం ఇద్దరి కి చూపునిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రూ మరణాంతరం నేత్ర దానానికి ముందుకు రావాలని కోరారు.

ప్రశాంతంగా జాతీయ ఉపకార వేతన పరీక్ష

19 పరీక్ష కేంద్రాల్లో 4,210 మంది హాజరు

విజయనగరం అర్బన్‌: 2023–24 విద్యా సంవత్సరానికిగాను జాతీయ ఉపకార వేతన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 4,338 మందిలో 4,210 మంది పరీక్షకు హాజరయ్యారని డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా డీఈఓ, ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించాయి.

ట్రైసైకిళ్ల పంపిణీ

రేగిడి: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో విభిన్న ప్రతిభావంతులకు ప్రభు త్వం మంజూరు చేసిన ట్రై సైకిళ్లు, పలు ఉపకరణాలను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, శాసనమండలి విప్‌ పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దార అప్పలనరసమ్మ, వైస్‌ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, వైఎస్సార్‌సీపీ మండల అధ్య క్షుడు వావిలపల్లి జగన్మోహనరావు, జిల్లా వ్యవ సాయ సలహా మండలి అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు, విప్‌ శ్రీనివాసరావు, ఎంపీడీఓ శ్యామలాకుమారి తదితరులు పాల్గొన్నారు.

జలాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం

శృంగవరపుకోట: జలాసనాలతో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని ప్రముఖ జలాసన నిపుణుడు సుబ్బారావు, యోగా గురువు విజయలక్ష్మి అన్నారు. ఇందుకూరి రిసార్ట్‌లో 150 మందికి నీటిపై తేలియాడే విద్యపై ఆదివారం శిక్షణ ఇచ్చారు. పలువురికి అవగాహన కల్పించారు. నీటిలో జలాసనం వల్ల కలిగే ఆరోగ్య అంశాలను వివరించారు. అనంతరం కృష్ణ మహాంతిపురం పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఇందుకూరు రామరాజు, పీఆర్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు అశోక్‌రాజు తదితరులు సుబ్బారావు, విజయలక్ష్మిలను సత్కరించారు. పలువురు జలాసనాలను ఆసక్తిగా తిలకించారు.

మరిన్ని వార్తలు