విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

4 Dec, 2023 00:34 IST|Sakshi
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఎల్‌ఓలకు వివరాలు అడుగుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి
● కలెక్టర్‌ నాగలక్ష్మి

రాజాం సిటీ: బీఎల్‌ఓలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ నాగలక్ష్మి హెచ్చరించారు. ఓటర్ల నమోదు స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా రాజాంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ ల వద్ద చేర్పులు, మార్పులు, మరణించిన వారి ఓ ట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బీఎల్‌ఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నాయకులు ఫిర్యాదు చేసినంత వరకు బీఎల్‌ఓలు ఏం చేస్తున్నారని, నెల రోజులైనా నిర్లక్ష్యం వహించడంపై అసహ నం వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో ఓటర్ల చేర్పులు, వలసలు వెళ్లిన వారు, మరణించిన వారి ఓట్ల తొలగింపు, డబుల్‌ ఎంట్రీలపై దృష్టి సారించాలని సూచించారు. బీఎల్‌ఓలంతా లక్ష్యాల ను పూర్తి చేసి ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఎస్‌కే రాజును ఆదేశించారు. ఎవరి నుంచైనా ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. రాజాం నియోజకవర్గంలోనే బీఎల్‌ఓలు వెనుకంజ లో ఉన్నారని, వారంతా లక్ష్యాలు చేరుకునేలా చూడాలని ఆర్‌ఓ సుధారాణిని ఆదేశించారు. జూనియర్‌ కళాశాలలో నాడు – నేడు కింద పనులు త్వర గా పూర్తి చేసి పోలింగ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఉరిటి జగదీశ్వరరావుకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఈడీటీ ప్రకాష్‌రాజు, ఆర్‌ఐ విద్యాసాగర్‌ ఉన్నారు.

నూర్చిన ధాన్యం వెంటనే కొనుగోలు : కలెక్టర్‌

విజయనగరం అర్బన్‌: తుపాను పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి కోతలు వాయిదా వేయాలని, నూర్చిన ధాన్యం వెంటనే కొనుగోలు కోసం సమీప ఆర్‌బీకేలను సంప్రదించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి రైతులకు ఆదివారం విజ్ఞప్తి చేశారు. చేను కోత కోసిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా కుప్పలుగా వేసుకోవాలని సూచించారు. వీలున్నంత వరకు ప్లాస్టిక్‌ ఫీట్‌లో లేదా టార్పాలిన్లతో కప్పి ఉంచుకోవాలని కూడా సూచించారు. జిల్లాలో సాగు చేసిన 2.31 లక్షల ఎకరాల వరి సాగులో 66 శాతం 1.53 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయని వివరించారు. ఈ ఏడాది 2,817 ఎకరాల మేరకు పంట మార్పిడి జరిగిందని దీనిని వెంటనే ఆర్‌బీకే ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు తమ దగ్గర ఉన్న నూర్పిడి చేసిన ధాన్యాన్ని సంబంధిత రైతు భరోసా కేంద్రం అసిస్టెంట్‌కి తెలియజేసి ధాన్యం కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లాలో ఒక మోస్తరు వర్షపాతం అలాగే ఐదు, ఆరు తేదీల్లో అధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. ఈ పరిస్థితిలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. ఎలాంటి సమస్యలైనా.. రైతులు కంట్రోల్‌ రూం 89789 75284 నంబరుకు సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు