నేనున్నానని...

4 Dec, 2023 00:34 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు మహంతి

సంజన. ఈమెది నెల్లిమర్ల మండలం గరికిపేట.

సంజనకు ప్రతి నెల రక్తం తగ్గిపోతుండడంతో కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించడంతో సికిల్‌సెల్‌ ఎనీమియా అని

నిర్ధారణ అయింది. ఈమెకు కూడా ప్రభుత్వం ప్రతి నెల రూ.10 వేలు అందజేస్తోంది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు మహంతి కూర్మారావు. ఇతనిది నెల్లిమర్ల మండలం గరికిపేట. సంజన, కూర్మారావులు అక్కాతమ్ముళ్లు. కూర్మారావుకు కూడా సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్ధారణ కావడంతో ఇతనికి కూడా ప్రభుత్వం రూ.10 వేలు పింఛన్‌ అందజేస్తోంది.

నాలుగున్నరేళ్లలో రూ.47.53 కోట్లు అందజేత

2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ నిమిత్తం రూ.47.53 కోట్లు అందించింది. ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు రూ.2.10 కోట్లు, క్రా నిక్‌ కిడ్నీ రోగులకు రూ. 23.76 కోట్లు, కిడ్నీ, లివర్‌ మార్పిడి చేయించుకున్న వారికి రూ.93 లక్షలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ. 5.16 కోట్లు, పక్షవాతం రోగులకు రూ.9.21 కోట్లు, హిమోఫిలియో రోగులకు రూ.1.38 కోట్లు, మంచానికే పరిమితం అయినవారికి రూ.1.80 కోట్లు, సికిల్‌సెల్‌ ఎనీమియా రూ.97.20 లక్షలు, తలసేమి యా రూ.2.22 కోట్లు అందించారు.

మరిన్ని వార్తలు