పారాది వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం

4 Dec, 2023 00:34 IST|Sakshi
పారాది వంతెన వద్ద అప్రోచ్‌ నిర్మించేందుకు సిద్ధం చేసిన మెటీరియల్‌, యంత్రాలు

వారం రోజుల్లో అప్రోచ్‌ రోడ్డు పనులు ప్రారంభించనున్న అధికారులు

● రూ.10.90 కోట్ల నుంచి రూ.13.80 కోట్లకు అంచనాలు పెంచి ప్రతిపాదనలు

బొబ్బిలి: పారాది వంతెన నిర్మాణానికి ముంద స్తు పనులు ప్రారంభించనున్నారు. ఇందు కోసం ముందుగా నది గుండా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే మెటీరియల్‌ను కాంట్రాక్టర్‌ ద్వారా వేయించారు. మరో వారం రోజుల్లో దాని నిర్మాణం ప్రారంభించనున్నారు. పారాది వంతెనకు ఇప్పటికే రూ.10.90 కోట్లు మంజూరు చేశారు. పాత వంతెనపై రాకపోకలు సాగిస్తూ నిర్మాణం చేద్దామనుకున్నారు. అయితే వంతెన హఠాత్తుగా పాడవడంతో మరమ్మతులు చేయించి లైట్‌ వెహికల్స్‌కు మాత్రమే అనుమతిస్తూ మిగతా వాటిని బాడంగి, తెర్లాం మీదుగా ప్రస్తుతం డైవర్ట్‌ చేస్తున్నా రు. దీంతో ప్రస్తుతం వంతెన నిర్మాణాన్ని ప్రారంభి స్తే అప్రోచ్‌ రోడ్డు తప్పనిసరిగా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ అప్రోచ్‌ రోడ్డును గతంలో వంతెన మరమ్మతులప్పుడు వేసినట్టు కాకుండా ధృడంగా వేసి పెద్ద వెహికల్స్‌ను కూడా అనుమతించాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ధృడమయిన అప్రోచ్‌ రో డ్డును పారాది వేగావతి నదికి అడ్డంగా నిర్మించను న్నారు. రెండు రోజులుగా వాహనాలు, యంత్ర సామగ్రి, మెటీరియల్‌ను చేరవేశారు. వాహనాలన్నింటినీ అనుమతించేందుకు అప్రో చ్‌ రోడ్డును ధృడంగా నిర్మించనున్నామని, వచ్చే వారం నుంచి అప్రోచ్‌ రోడ్డును వేగావతి నదిలో నిర్మిస్తామని ఆర్‌అండ్‌బీ బొబ్బిలి ఏఈ బీఏకే రాజు ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు