నర్సరీల నిర్వహణపై అలసత్వం వీడాలి

18 Mar, 2023 01:38 IST|Sakshi
ఈర్లదిన్నెలో నర్సరీని పరిశీలిస్తున్న డీపీఓ సురేష్‌కుమార్‌

అమరచింత: గ్రామాల్లోని నర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వీడాలని.. మొక్కలు ఎదిగేలా చర్యలు తీసుకోవాలని డీపీఓ సురేష్‌కుమార్‌ అన్నారు. చెట్టు చెట్టుకు నీరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఈర్లదిన్నె, కిష్టంపల్లి, మస్తీపురంలోని నర్సరీలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కలకు నిత్యం నీటిని అందించాలని, మొలకెత్తని విత్తన సంచులను గుర్తించి కొత్త విత్తనాలు నాటాలని సూచించారు. ఆయా గ్రామాల్లో నాటిన హరిత మొక్కల సంరక్షణపై సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

కంటి పరీక్షలు తప్పనిసరి..

గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని డీపీఓ సురేష్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని ఈర్లదిన్నెలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటివెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చుక్క లక్ష్మమ్మ, ఎంపీడీఓ జ్యోతి, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ బాలయ్య పాల్గొన్నారు.

డీపీఓ సురేష్‌కుమార్‌

మరిన్ని వార్తలు