బహుజనులు ఏకం కాలేరా?

18 Nov, 2023 01:14 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌లోని జెడ్పీ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇక్కడి రెడ్డీలంతా ఒక్కటై ఆయన స్థానానికి ఎవరినీ పోటీ చేయించకపోవడం వారికున్న ఐక్యతను సూచిస్తుందని, అలాంటప్పుడు అత్యధిక జనాభా కలిగిన బహుజనులు ఒక్కటి కాలేమా అని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. రెడ్డీలు, దొరలు ఒక్కటేనని తెలంగాణలో దొరల పాలనతో అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఎస్పీ అంటే కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో చెందిన పార్టీ కాదని, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను బహుజనులకే కేటాయించామని గుర్తు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒక స్థానాన్ని బుడగ జంగాలకు, ఒక స్థానాన్ని దివ్యాంగులకు, ఒక స్థానాన్ని ఆరె కటికెలకు కేటాయించామని రాష్ట్ర వ్యాప్తంగా అదే పద్ధతిలో సీట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లాలోని బీఎస్పీ అభ్యర్థులు అతికుర్‌ రహమాన్‌, మైబూస్‌ వాల్మీకి, సంతోష్‌రెడ్డి, గగనం శేఖరయ్య, శ్రీనివాస్‌యాదవ్‌, శివకుమార్‌, స్వప్న, వెంకటేశ్‌ చౌహాన్‌, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కేశవరావు, పృథ్వీ, నాయకులు దయానందరావు, విజయ్‌కుమార్‌, మహేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు