మెట్టుగుట్టపై ప్రత్యేక పూజలు

17 Jul, 2023 01:24 IST|Sakshi
రుద్రాక్షమాల అలంకరణలో మెట్టు రామలింగేశ్వరుడు

మడికొండ: మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం యాగశాలలో గణపతి హోమం, రుద్రహోమాలు చేశారు. ఆరుద్ర నక్షత్రంతో కూడిన మాస శివరాత్రి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి, చైర్మన్‌ దువ్వ నవీన్‌, అర్చకులు రాగిచేడు అభిలాష్‌శర్మ, పరాశరం విష్ణువర్ధనచార్యులు, సత్యనారాయణ శర్మ, ధర్మకర్తలు చింతకుంట్ల భూపాల్‌రెడ్డి, కుమారస్వామి, ఓర్సు రాజు, బుర్ర సంధ్యారాణి, పెద్ది ప్రభాకర్‌, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు