భవనంపై నుంచి పడి ఒకరి మృతి

29 Nov, 2023 01:22 IST|Sakshi
మోత్యా (ఫైల్‌)

నర్సంపేట రూరల్‌ : భవనంపై నుంచి పడి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలైన ఘటన నర్సంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన జర్పుల మోత్యా (65) కొడుకు వైద్యుడు కాగా పట్టణంలోని నర్సంపేట–వరంగల్‌ ప్రధాన రహదారి సమీపంలోని అతడి ఆస్పత్రి భవనంపై ఇటీవల మరో రెండు అంతస్తులు నిర్మించాడు. ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతుండగా మోత్యా, కూలీకి వచ్చిన ధరావత్‌ చక్రు రెండో అంతస్తు కూలి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మోత్యా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఛక్రును మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మోత్యా మృతితో మహేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.

మరిన్ని వార్తలు