మత్స్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

18 Mar, 2023 00:22 IST|Sakshi

ఉంగుటూరు: బాదంపూడి మత్స్య శిక్షణా కేంద్రంలో 3 నెలల సర్టిఫికెట్టు కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్‌వీఎస్‌వీ ప్రసాద్‌ చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీలోగా ‘మత్స్య శాఖ సహాయ సంచాలకులు, మత్స్య శిక్షణ కేంద్రం, బాదంపూడి, ఏలూరు జిల్లా’ అనే చిరునామాకు దరఖాస్తులు పంపాలని కోరారు. మొత్తం 20 సీట్లు ఉన్నాయని, కోస్తా జిల్లాలలోని మత్స్యకారులు, యువకులు, జాలర్లు, సహకార సంఘాల సభ్యులు, చేపలు పెంపకంపై ఆసక్తి కలిగిన ఇతరులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శిక్షణ పొందేందుకు అర్హులన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి బాదంపూడి మత్స్య శిక్షణ కేంద్రం కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎంపికై న అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కనీసం ఐదో తరగతి చదివి ఉండాలని, 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.

మరిన్ని వార్తలు