ధర్మప్రచార మాసోత్సవాలకు సర్వం సిద్ధం

10 Nov, 2023 01:08 IST|Sakshi
ఉత్సవాలకు ముస్తాబైన శ్రీవారి ధర్మప్రచార రథం

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధర్మప్రచార మాసోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఆలయ అనివేటి మండపంలో ధార్మిక సభ నిర్వహణకు వేదికను ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారి ధర్మప్రచార రథాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 9న ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం ఆలయ జంటగోపురాల ప్రాంతంలో ఈ ఉత్సవాలను మంత్రి ప్రారంభిస్తారని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే అనివేటి మండపంలో ధార్మిక సభను నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత కొండపై నూతనంగా నిర్మించిన 1 మెగావాట్‌ సోలార్‌ ప్లాంట్‌ను, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో నిర్మించనున్న అనివేటి మండపం ఫేజ్‌–2 శిలాఫలకాన్ని, శివాలయం వద్ద చేపట్టనున్న 5 అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి, టెన్‌సైల్‌ రూఫ్‌ షెడ్‌ నిర్మాణానికి శంకుస్థాపనలు జరుపనున్నట్టు ఈఓ తెలిపారు.

మరిన్ని వార్తలు