Diabetes Patients: మీరు మధుమేహ బాధితులా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..

26 Sep, 2021 10:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హూస్టన్‌: మీరు టైప్‌ 1 డయాబెటిస్‌ (మధుమేహం) బాధితులా? వయసు 40 ఏళ్లు దాటిందా? అయితే, జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే మీరు కోవిడ్‌–19 మహమ్మారి బారినపడితే తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరే అవకాశాలు పిల్లలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉంటాయట. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనం ఈ విషయం వెల్లడించింది.

ఈ అధ్యయనం వివరాలను ఎండోక్రైన్‌ సొసైటీకి చెందిన క్లినికల్‌ ఎండోక్రైనాలజీ, మెటాబాలిజం జర్నల్‌లో ప్రచురించారు. పిల్లలకు కరోనా సోకితే లక్షణాలు బయటపడవు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా స్వల్పమే. కానీ, డయాబెటిస్‌తో బాధపడు తున్న పెద్దల్లో కరోనా మహమ్మారి ప్రాణాం తకంగా పరిణమిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు, యువత కంటే టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్న పెద్దలకు(40 ఏళ్లు దాటినవారు) కరోఓనా సోకితే తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

చదవండి: Vice President Venkaiah Naidu: వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి

మరిన్ని వార్తలు