ట్రంప్‌ చర్యలతో మరింత ప్రాణనష్టం: బైడెన్‌

17 Nov, 2020 11:48 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి సరైన సహకారం అందకపోతే చాలా మంది అమెరికన్లు చనిపోయే అవకాశముందని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. ట్రంప్‌ అధ‍్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తిరస్కరించిన విషయం తెలిసిందే. కొత్త ఉపశమన చట్టాన్ని ఆమోదించాలని  యుఎస్ కాంగ్రెస్‌ను జో బైడెన్‌ కోరారు. కోవిడ్ -19 మహమ్మారి తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి వ్యాపారవేత్తలు ,కార్మిక నాయకులు కలిసి పనిచేయాలన్నారు. ‘మనము డార్క్‌ వింటర్‌లోకి  వెళ్తున్నాము. కొన్ని విషయాలు సులభతరం అయ్యే ముందు కఠినంగానే ఉంటాయి’ అని బైడెన్‌ అన్నాడు.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మిలియన్ల కొద్దీ ఉద్యోగ నష్టాలను చవిచూసిన ఆర్థిక వ్యవస్థను జో బైడన్  రాబో​యే కాలంలో వాటి భారాన్నిమోయనున్నారు.ఇప్పటికే అమెరికాలో 2,46,000 మందికి పైగా మరణించారు. రోజువారీగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి 20 న  బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

మరోవైపు ట్రంప్‌ తన మొండి వైఖరిని వీడడంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానని ట్వీట్లు వేస్తున్నారు. మోడెర్నా వ్యాక్సిన్ ప్రకటన తరువాత,‘మరొక టీకా ఇప్పుడే ప్రకటించారు. ఈసారి మోడెర్నా95% ప్రభావవంతంగా పనిచేస్తుంది. చరిత్రకారులారా గుర్తుంచుకోండి.. చైనా మహమ్మారిని అంతం చేసే ఈ గొప్ప ఆవిష్కరణలు అన్నీ నా పాలనలోనే బయటకు వచ్చాయి. ’ అని ట్రంప్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు