రోవర్‌ ల్యాండింగ్‌ సైటు పేరెంటో తెలుసా..

11 Mar, 2021 14:18 IST|Sakshi
పర్సెవరన్స్ రోవర్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశం (చిత్రం : నాసా)

లాస్‌ఎంజిల్స్‌: అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరన్స్‌ రోవర్‌ దిగిన స్థలానికి నాసా పేరుపెట్టింది. రోవర్‌ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై  రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ల్యాండ్‌ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సెవరన్స్‌ విధి.

గతంలో మార్స్‌పై దిగిన క్యూరియాసిటి రోవర్‌ ల్యాండింగ్‌ స్థలానికి ‘రే బ్రాడ్‌బరీ’ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గత ఏడాది జూలై 30 న ఈ రోవర్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే . ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అంగారక గ్రహానికి చేరింది. (చదవండి:మార్స్‌పై రోవర్‌ అడుగులు షురూ!)

మరిన్ని వార్తలు