కరోనా: బాక్టీరియాను చంపే మాస్క్‌

13 Nov, 2020 13:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మానవాళిని అతలాకుతలం చేసింది. వైరస్‌ ప్రభావం కోట్లాది ప్రజలపై పడింది. అంతేకాకుండా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కరోనావ్యాక్సిన్‌ తయారికి మరింత సమయం పడుతుండటంతో ప్రజలు కరోనా నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్త చర్యలను పాటిస్తున్నారు. అందులో ముఖ్యమైనది మాస్క్‌. వైరస్‌ నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుండటంతో మాస్క్‌ వాడకంతో కరోనాను సంక్రమించకుండా చూడవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల మాస్కులు లభ్యమవుతున్నాయి. అయితే ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన కొత్త మాస్కు కరోనాని ఎదురిస్తుంది. పరిశోధకులు తయారుచేసిన ఈ మాస్కు ఒక గంట పాటు ఎండలో ఉపయోగిస్తే 99.99 శాతం బాక్టీరియాను చంపేస్తుందని చెబుతున్నారు.

వీరు తయారు చేసిన మాస్కు తిరిగి వాడుకునేందుకు అనుకూలంగా ఉండేలా తయారుచేశారు. అయినప్పటికీ, మాస్కుపైన బాక్టిరీయా, వైరస్‌ ఉండే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ జర్నల్‌ చేసిన అధ్యయనంలో తెలిపింది. పరిశోధకులు తెలిపిన ప్రకారం ఈ మాస్కు 10 సార్లు ఉతికి ఎండలో ఉంచినప్పటికీ దాని సహజ స్వభావాన్ని కోల్పొలేదు.  ఈ మాస్క్‌లో వివిధ రకాల క్లాత్‌ మెటీరియల్స్‌ వాడటం వల్ల దీని ఉపయోగించిన వారు వైరస్‌ లక్షణాలు ఉన్న వారు ..తుమ్మినా, దగ్గినా చాలా తక్కువ మొత్తంలో బ్యాక్టీరియాను బయటకు విడుదల చెయ్యదన్నారు. 

మాస్క్‌ ఎలా తయారుచేశారంటే..
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చెందిన పరిశోదన బృందం, డేవిస్‌ ఈ మాస్క్‌ను తయారిచేశారని, మాస్క్‌ని సూర్యరశ్మిలో ఉంచినప్పుడు మాస్క్‌లోని కాటన్‌ మేటిరియల్‌ రియాక్టివ్‌ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని ఇందులోని సూక్ష్మకణాలను చంపుతుందన్నారు. మాస్క్‌లో 2-డైఇతైల్‌ అమైనో క్లోరైడ్‌ వాడారని అన్నారు. ఇది వైరస్‌ని ఎదుర్కొనే గుణం ఉంటుదన్నారు. ఈ మాస్క్‌ను వాడే వారు అందులోని సూక్క్ష్మకణాలను చంపే గుణం పోకుండా ఉండటం కోసం రోజు పది సార్లు నీటిలో తడిపి, ఎండకు ఉంచాలన్నారు. ఇలా 7 రోజుల పాటు చెయ్యాలని తెలిపారు.

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు