‘కోహినూర్‌ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్‌కి నవ్వకుండా ఉండలేరు!

26 Oct, 2022 12:16 IST|Sakshi

రిషి సునాక్‌(Rishi Sunak).. గత రెండు రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బ్రిటన్‌ ప్రధాని పీఠంపై చిన్న వయసులో..అది కూడా తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్‌ పగ్గాలు అందుకుని సంచలనం సృష్టించారు. ఆయన భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడం, పైగా మన దేశపు అల్లుడు కావడంతో భారత్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, మరోవైపు రిషి సునాక్‌పై మీమ్స్‌ వడ్డన కూడా మామూలుగా లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

బ్రిటన్ ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికైన సంగతి తెలిసిందే . ఇక అప్పటి నుంచి కోహినూర్ వజ్రం అంశం మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి. తాజాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సైతం ఈ అంశంపై ఫన్నీగా స్పందించారు. బ్రిటన్ నుంచి కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే ఇలా ట్రై చేయండంటూ ట్వీట్‌ ద్వారా తెలిపారు. 

ఆ ట్వీట్‌లో ఏముందంటే..
'కోహినూర్‌ను తిరిగి పొందాలంటే నా స్నేహితుడి ఆలోచన ఇదే... రిషి సునాక్‌ను భారతదేశానికి ఆహ్వానించండి. ఆయన అత్తమామల ఇంటికి వెళ్లేటప్పుడు బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో కిడ్నాప్ చేయండి. రిషి సునాక్‌ స్థానంలో ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానమంత్రిగా పంపండి, అలా చేసినా ఎవరూ గుర్తుపట్టరు. వెంటనే కోహినూర్‌ను తిరిగి ఇచ్చే బిల్‌ను నెహ్రా పాస్‌ చేయిస్తాడని’ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రసుత్త ఇది నెట్టింట హల్‌ చేస్తోంది. కాగా రిషి సునాక్, ఆశిష్ నెహ్రా చూడటానికి ఒకేలా కన్పించడంతో నెటిజన్లు క్రేజీగా మీమ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్‌ ప్రధాని ఏమన్నారంటే!

మరిన్ని వార్తలు