తల్లిదండ్రులతో గొడవ.. సొరంగం తవ్విన యువకుడు

6 Jun, 2021 16:36 IST|Sakshi

మాడ్రిడ్​: సాధారణంగా తల్లిదండ్రులు..  తమ పిల్లలు అల్లరి చేసినప్పుడు తిట్టడమో.. కొట్టడమో చేస్తూంటారు.  దానికి.. పిల్లలు మహ అయితే, కాసేపు అలగడం, భోజనం మానేయడమో చేస్తుంటారు. మరికొంత మంది అల్లరి పిల్లలు ఇంట్లో చెప్పకుండా..  పక్కింట్లో లేదా తెలిసిన వారింటికో వెళ్లిపోతారు. అలాంటి వారంతా, కోపం తగ్గగానే తిరిగి తమ ఇంటికి చేరుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే, స్పెయిన్ కు చెందిన ఒక కుర్రాడు చేసిన పని ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​గా మారింది. 

వివరాలు.. ఈ సంఘటన 2015లో చోటుచేసుకుంది. స్పెయిన్ కు చెందిన 14 ఏళ్ల ఆండ్రెస్​​ కాంటోకు ట్రాస్​ సూట్​ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో సూట్​ ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ, తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేదు. బయటకు వెళ్లవద్దని కోప్పడ్డారు. దీంతో అలిగిన ఆ బాలుడు ఇంటి వెనకాల ఉన్న పేరడును తవ్వడం మొదలుపెట్టాడు.

ప్రతి రోజు స్కూల్​ నుంచి రావడం.. ఇంటి వెనుక వెళ్లి సొరంగం తవ్వడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఆ బాలుడు ప్రతిరోజు దాదాపు 14 గంటలపాటు పాటు నేలను తవ్వేవాడు. ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ఆరు సంవత్సరాలు పాటు తవ్వాడు. ఈ క్రమంలో  3 మీటర్ల లోతులో ఒక గుహలాగా  ఏర్పడింది. ఈ సొరంగం తవ్వడంలో అతనికి ఒక మిత్రుడు కూడా సహకారం అందించాడు.  

ఈ గుహలో,  ఉండటానికి గదిని.. దాంట్లో ఒక బెడ్​, కుర్చీని ఏర్పాటు చేసుకున్నాడు.  బాత్రూంను కూడా నిర్మించుకున్నాడు. అంతటితో ఆగకుండా వైఫైను సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సొరంగం పూర్తయ్యే నాటికి ఆండ్రెస్​కు 2‌‌0 ఏళ్లు.  అయితే, ఈవీడియోను ఆండ్రెస్ కాంటో ఇన్​స్టాగ్రామ్​ లో షేర్​ చేశాడు.

ప్రస్తుతం ఇది సోషల్​ మీడియాలో తెగ వైరల్​ గా మారింది.  దీన్ని చూసిన నెటిజన్లు ‘ భలే.. ఉంది బాసు నీ ఐడియా ’, ‘ వర్ష కాలంలో జాగ్రత్త’, ‘ నీ అలకకు.. హ్యాట్సాఫ్​.’ ‘ మేము చిన్నప్పుడు అలిగాం.. కానీ ఇలాంటి ఆలోచన మాకు రాలేదు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు