Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా?

15 Nov, 2021 18:26 IST|Sakshi

కరోనా మహమ్మారికి చైనాలోనే మూలాలున్నాయని.. చైనా ప్రజల అడ్డమైన ఆహారపు అలవాట్ల వల్లనే కరోనా వ్యాధికి మూలమని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. పాముల నుంచి మొదలు తేళ్లు, గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు.. ఇలా ఒకటా రెండా భూమిపై ఉండే ప్రతి జీవినీ చైనీయులు లాగించేస్తారు. కొన్నింటిని ఉడికించి, మరికొన్నింటినైతే పచ్చిగా ఆ జీవి ప్రాణాలతో ఉండగానే కరకరమని నమిలేస్తారు. దీని వల్లనే కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయని చైనాపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తన ఇంటి టెర్రస్‌పై ఏకంగా తేళ్లను సాగు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. సాధారణంగా ఇంట్లో కోళ్లను, కుక్కలను పెంచుతున్నట్లు ఆ యువతి తన ఇంటిపై ఎర్ర తేళ్లను పెంచుతోంది. ఒకటో రెండో ఉంటే ఒకవేళ సరదా కోసం అనుకుంటాం. కానీ తన ఇంటి టెర్రస్‌పై వేల సంఖ్యలో తేళ్లు సాగవుతున్నాయి.

ఈ తేళ్ల సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోపై.. చైనీయులు మరో కొత్త వైరస్‌కు పునాది వేస్తున్నారని కొందరు, ఎందుకు చైనీయులు అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇవి తేళ్లేనా? అని ఇంకొంత మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

A post shared by Nature | Travel | animal (@naturelovers_ok)

ఈ వీడియోను చూసిన నెటిజెన్లు నోరెళ్లబెడుతున్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుంటే మరో కొత్త వ్యాధి తప్పదని అభిప్రాయపడుతున్నారు. కరోనా మళ్లీ విరుచుకుపడే అవకాశముందని వాపోతున్నారు. తాజాగా వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న యువతి చైనాకు చెందినదిగా ఇంకా ధృవీకరణ కాలేదు. తను చైనా యువతి అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు.

కానీ చాలా మంది నెటిజన్లు మాత్రం తను ఖచ్చితంగా చైనా యువతే అని అభిప్రాయపడున్నారు. ఇలాంటి పనులు చైనాలో కాకుంటే ఇంకెక్కడ జరుగుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచం ఇంకెన్ని భయంకరమైన కొత్త వ్యాధులను చూడాల్సి వస్తుందోనని సోషల్ మీడియా వేదికగా విమర్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు