బాలల సంరక్షణ అందరి బాధ్యత

25 Feb, 2023 11:32 IST|Sakshi

బీబీనగర్‌ : బాలల సంరక్షణ, వారి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతంగా భావించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. భువనగిరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్నేహిత రెండవ విడత అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాలల హక్కులు కాపాడడం, వారి సంరక్షణ, బాధ్యతల పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు స్నేహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలి విడతలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో 26 బృందాలను ఏర్పాటు చేసి 271 పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతుల విద్యార్థులు 43వేల మందికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు.

రెండో విడుతలో 42 బృందాల ద్వారా 251 పాఠశాలల్లో 17,058మంది విద్యార్థులకు స్పర్శ, చెడు స్పర్శ, విద్య ప్రాముఖ్యం, ఇంటర్‌నెట్‌ దుర్వినియోగం, ఆరోగ్య అలవాట్లు, స్వీయ రక్షణ తదితర అంశాలపై అవగహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. డీసీపీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ.. ఎమైనా సమస్యలు వస్తే 1098, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, జెడ్పీటీసీ ప్రణీతాపింగళ్‌రెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి అన్నపూర్ణ, ఏంపీడీఓ శ్రీవాణి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మీశ్రీనివాస్‌, ఏంఈఓ నాగవర్దన్‌రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ నాగలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు