రామడుగు వాసికి ఆలిండియా ర్యాంకు

2 Oct, 2023 01:22 IST|Sakshi
కిశోర్‌కుమార్‌కు శాంతి పురస్కారం అందజేస్తున్న శిఖరం ఆర్ట్స్‌ థియేటర్స్‌ సభ్యులు

హాలియా: ఇటీవల విడుదలైన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌–2023(ఐసీఏఆర్‌) పరీక్ష ఫలితాల్లో అనుముల మండలంలోని రామడుగు గ్రామానికి చెందిన ఆడెపు శివకుమార్‌, రామేశ్వరీ దంపతుల మొదటి కుమార్తె ప్రియదర్శిని ఎస్సీ కేటగిరీలో ఆలిండియా 3వ ర్యాంకు, జాతీయస్థాయిలో 12వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రారష్ట్‌ర అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన ప్రియదర్శిని 2021–22లో జార్ఖండ్‌లోని రాంచీలో ఎంఎస్సీ పూర్తిచేసింది. ప్రియదర్శినిని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుడు యడవెల్లి రాంబాబు అభినందించారు.

పల్లె కిశోర్‌కుమార్‌కు

గాంధీ శాంతి పురస్కారం

నల్లగొండ టౌన్‌: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న పల్లె కిశోర్‌కుమార్‌కు శిఖరం ఆర్ట్స్‌ ఽథియేటర్స్‌ వారు మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు పద్మరాజు, శివనర్సింహస్వామి, డాక్టర్‌ ముద్దాలి మాధవరావు, వంశీకృష్ణ, మాగంటి ప్రసాదబాబు, జి. కృష్ణ, డాక్టర్‌ చలమల హైమావతి, విద్యారెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ మరిచిపోలేని జ్ఞాపకం.. గద్దరన్న

కోదాడ: భూమి, ఆకాశం ఉన్నంత వరకు తెలంగాణ సమాజం మరిచిపోలేని జ్ఞాపకం ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అని, ఆట పాట రూపంలో గద్దరన్న సజీవంగా ఉంటాడని పలువురు తెలంగాణ ఉద్యమకారులు అన్నారు. ఆదివారం రాత్రి కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు, శ్రీకాంత్‌యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన గద్దరన్న యాది కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. గద్దర్‌ పాటతోనే తెలంగాణ సమాజంలో మార్పు వచ్చి రాష్ట్రసాధనకు ముందుకు వచ్చి పోరాటం చేశారని అన్నారు. ప్రజా గాయకురాలు వేముల పుష్ప, నల్లగొండ గద్దర్‌ నర్సన్న గద్దర్‌ పాటలను పాడి ఆయన పాటతో తెలంగాణ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న తెలంగాణ ఉద్యమకారులను ఆదరించాలని, సంక్షేమ పథకాలలో, నామినేటెడ్‌ పదవులలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గద్దర్‌ కొడుకు సూర్యం మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం తన తండ్రిని గుర్తుపెట్టుకొని సంస్మరణ సభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మళిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ.. గద్దరన్న పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని, తెలంగాణ అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కందుల మధు, గన్నా శ్యాం, ఎన్‌.ఎం. శ్రీకాంత్‌యాదవ్‌, పోలంపల్లి బాబు, మామిడి భాస్కర్‌, సైదులు, సినీ నిర్మాత అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు