వరి పొలం దగ్ధం

14 Nov, 2023 01:50 IST|Sakshi

గుండాల : గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఎకరంన్నర పొలంతో పాటు కుప్ప పోసిన వడ్లు, గడ్డి దగ్ధమైంది. ఈ ఘటన గుండాల మండలంలోని వస్తాకొండూర్‌ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్వరం ప్రభాకర్‌రెడ్డి, మహేశ్వరం జిలుకమ్మల వరి పొలం పక్కన గ్రామానికి చెందిన కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డిల వరి గడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేశారు. అది కాలుకుంటూ రైతులు మహేశ్వరం చిలుకమ్మ, ప్రభాకర్‌రెడ్డిల ఎకరంన్నర వరి పొలం తగులబడినట్లు చెప్పారు. అదే రైతుల వరి కోసి కుప్ప పోసిన వడ్లు కాలిపోయినట్లు తెలిపారు. సుమారుగా రూ. లక్ష నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.

మరిన్ని వార్తలు