మన దగ్గరే డబ్బు రాజకీయాలు..

16 Nov, 2023 06:00 IST|Sakshi

నేను సర్వీస్‌లో ఉండగా 12 రాష్ట్రాలకు ఎన్నికల్లో జనరల్‌ అబ్జర్వర్‌గా వెళ్లాను. అన్నిటి కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే డబ్బు రాజకీయం ఎక్కువ. అక్రమ సంపాదకులు కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నారు. 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నికల్లో డబ్బు రాజకీయాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంది. తమిళనాడులో మాత్రం డబ్బు ప్రభావం చాలా తక్కువ. ఈశాన్య రాష్ట్రాల్లో డబ్బు ప్రభావం దాదాపు ఉండదు. కేరళలో కూడా డబ్బు రాజకీయాలు కనిపించవు. ఆ రాష్ట్రంలో 90 శాతం అక్షరాస్యత ఉంది. వాళ్లకు డబ్బు కాదు.. సేవ చేసే నాయకులనే ఎన్నుకుంటారు.

మరిన్ని వార్తలు