సొంత కారు కలకు షాకిచ్చిన మారుతి

17 Apr, 2021 08:06 IST|Sakshi

మారుతీ కార్ల ధరలకు మరోసారి రెక్కలు

 రూ. 22,500 వరకు పెంపు

స్విఫ్ట్‌,సెలెరియా  మోడళ్లకు మినహాయింపు

సాక్షి, ముంబై: సొంత కారు  కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్న వినియోగదారులకు  దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ  షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కార్ల ధరలను మరోసారి పెంచింది. కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.  సవరించిన కొత్త ధరలు తక్షణం (శుక్రవారం) అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగడంతో ధరల్ని పెంచక తప్పలేదని కంపెనీ వివరణ ఇచ్చింది.

ధరల పెంపు నిర్ణయంతో స్విఫ్ట్, సెలెరియా మినహా అన్ని మోడళ్లకు చెందిన వాహన ధరలు రూ.22,500 వరకు పెరిగే అవకాశం ఉంది.మోడల్‌ను బట్టి 1.6 శాతం మేర ధరల పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది జనవరి 18న ధరలు పెంచిన కంపెనీ... కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. 

Read latest News News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు