Sakshi News home page

పచ్చవన్నె మేధావులు

Published Thu, Apr 18 2024 4:16 AM

Retired IAS and IPS are constantly accusing CM YS Jagan - Sakshi

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ముసుగులో చంద్రబాబుకుకొందరు రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ల ఊడిగం

వారికున్నది రాష్ట్రంపై ప్రేమ కాదు.. సీఎం జగన్‌పై కక్ష

ముఖ్యమంత్రిపై బురద జల్లడమే వారి ఎజెండా

సర్వీసులో ఉన్నప్పుడే చంద్రబాబు కోసం పరితపించిన ‘నిమ్మగడ్డ’

చట్ట పరిధిని దాటి స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గులాంగిరి

సీబీఐ డైరెక్టర్‌గా పనికిరాడని సుప్రీంకోర్టు తేల్చిన వ్యక్తి నాగేశ్వరరావు

సర్వీసు పొడిగించలేదనే అక్కసుతో విషం కక్కుతున్న మరో మేధావి పీవీ రమేష్‌

ఇప్పుడు వీళ్లంతా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షకుల అవతారం

∙సొంత ప్రయోజనాలు, రాజకీయ ఎజెండాతో ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు

ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో కొందరు రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లు నిత్యం సీఎం వైఎస్‌ జగన్‌ పైనా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా కక్ష పూరితమైన ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య భక్షకులుగా మారడం మేధావులను నివ్వెరపరుస్తోంది. వీళ్లు నిజంగా సివిల్‌ సర్వీసుల్లో పనిచేసిన అధికారులేనా అని అనుమానం వచ్చేలా వారి వ్యవహారశైలి ఉంటోంది.

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా, వైఎస్‌ జగన్‌పై మితిమీరిన అక్కసుతో వారు చేస్తున్న ఆరోపణలు సమాజాన్నే తప్పుదోవ పట్టించడానికేనన్నది స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులు, గల్లీ లీడర్ల మాదిరిగా ఎల్లో మీడియాలో వారు చేస్తున్న రచ్చను చూసిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇంతకాలం తాము కలిసి పనిచేసింది ఇంతలా దిగజారిన మనుషులతోనా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతున్న వీరి నిజస్వరూపం తెలుసుకోండి.  – సాక్షి, అమరావతి 

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌
సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ 2021 వరకు మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బాధ్యతలకు సిఫార్స్‌ చేశారు. అప్పట్లో పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనని నిమ్మగడ్డ అప్పట్లో వాటిని నిర్వహించలేదు.

ఇక 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఒకే విడతలో నిర్వహించాలని 2020 ఫిబ్రవరి–మార్చి నెలల్లో నోటిఫికేషన్‌ జారీచేయగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి అధికారిక వైఎస్సార్‌సీపీకే దాదాపు సగం స్థానాలు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వానికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కరోనా పేరుతో వాటిని అర్ధంతరంగా వాయిదా వేసి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.

ఇక జగన్‌  ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్లు–గ్రామ సచివాలయాల వ్యవస్థల ద్వారా నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే తీసుకొస్తే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ పేరున వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేశారు. ఈయన ఫిర్యాదు కారణంగా అవ్వాతాతల పింఛన్లను ఇంటివద్దే పంపిణీ చేసే ప్రక్రియకు బేకులు పడ్డాయి. 

మన్నెం నాగేశ్వరరావు
ఈయన అత్యంత అవినీతిపరుడు..  వాదాస్పద రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా చేసిన ఈయన యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. బీహార్‌లో ఓ ప్రభుత్వ వసతి గృహంలో బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడం ద్వారా నిందితులకు ఈయన కొమ్ముకాశారన్నది తేలింది.

ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ఈయన దర్యాప్తు అధికారిని బదిలీ చేయడం గమనార్హం. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించి ఫైర్‌ సర్వీసెస్, హోంగార్డు విభాగానికి బదిలీ చేసింది. నిజానికి..

♦  నాగేశ్వరరావు ఎక్కడ ఏ పోస్టులో ఉన్నా యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 
 ప్రముఖ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌ ‘ద వైర్‌’తోపాటు జాతీయ మీడియా ఆయన అవినీతి బాగోతాలను ఎన్నోసార్లు బయటపెట్టింది. 
  అప్పట్లో సీబీఐ డీజీగా ఉన్న అలోక్‌ శర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్‌ ఆస్తానా మధ్య విభేదాలు ఏర్పడటంతో మధ్యేమార్గంగా ఎం.నాగేశ్వరరా­వును సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు. అప్పట్లో చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ)గా ఉన్న కేవీ చౌదరి అండదండలతోనే ఈయనకు ఆ పదవి దక్కిందని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. 
 ఇక ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా ఉన్నప్పటి నుంచే ఈయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. 

పీవీ రమేష్‌
తాను ఆశించిన విధంగా సర్వీసు పొడిగింపు ఇవ్వలేదని అక్కసుతో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ సీఎం జగన్‌పై కక్ష పెంచుకుని నిమ్మగడ్డ బృందంతో చేతులు కలిపారు. తనను తాను మేధావిగా ఊహించుకునే ఈయన రిటైరైన వెంటనే సిగ్గూఎగ్గూ లేకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే ఒక కార్పొరేట్‌ కంపెనీలో చేరాడు. తన పలుకుబడిని ఆ కంపెనీ కోసం ఉపయోగిస్తానని చెప్పి ఉద్యోగం దక్కించుకున్న ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చిలక పలుకులు చెబుతున్నారు.

 అలాగే, 2018లో సీబీఐ చెన్నై జోన్‌ డైరెక్టర్‌గా ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న 70మంది ఐఆర్‌ఎస్‌ అధికారుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరించారనే తీవ్రమైన ఆరోపణలు ఈయనపై వచ్చాయి. దీంతో ఆయన్ని అప్పట్లోనే హఠాత్తుగా బదిలీచేశారు. 
  ఇక నాగేశ్వరరావు తన భార్య పేరుతో ఏకంగా ఓ షెల్‌ కంపెనీలో భాగస్వామిగా భారీగా అక్రమ నిధులు తరలించారు. వాటితో ఆమె గుంటూరు జిల్లాలో భూములు కొనుగోలు చేశారన్నది వెలుగులోకి రావడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆమె ఆ షెల్‌ కంపెనీలోని 100 షేర్లను కేవలం రూ.వెయ్యికి కొనుగోలు చేసి వాటిని వెంటనే భారీ విలువకు విక్రయించడం గమనార్హం. ఆ షెల్‌ కంపెనీ షేర్ల ముసుగులోనే భారీ అవినీతికి పాల్పడినట్టు వెల్లడైంది. 
 అంతేకాదు.. ఒడిశాలోని ఖుర్దాలో ఫోర్జరీ పత్రాలతో ఓ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు చూపించి భూకబ్జాకు తెగబడ్డారు.
 బెంగాల్‌లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో కూడా నిందితులకు అనుకూలంగా నాగేశ్వరరావు వ్యవహరించడంతోనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 
  సీబీఐ డైరెక్టర్‌ పోస్టుకు నాగేశ్వరరావు అనర్హుడని కోర్టు తేల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించింది. 
 ఇలా తన పదవిని దుర్వినియోగం చేశాడని కోర్టు ఛీవాట్లు పెట్టిన ఆ అధికారి రిటైర్‌ అయ్యాక  ప్రజాస్వామ్య పరిక్షరణ ఉద్ధారకుడి అవతారమెత్తి వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తుండడం, అది కూడా చంద్రబాబుకి మద్దతుగా చేస్తుండడాన్ని ఎలా చూడాలి? వీళ్ల నినాదం సేవ్‌ ఫర్‌ డెమోక్రసీ.. కానీ, వీరు సేవ్‌ ఫర్‌ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement