Sakshi News home page

Angry Rantman Death: ప్ర‌ముఖ యూట్యూబర్ కన్నుమూత.. గుండె పగిలిందంటున్న ఫ్యాన్స్‌

Published Wed, Apr 17 2024 4:20 PM

YouTuber Abhradeep Saha aka Angry Rantman dies at 27 - Sakshi

#Angry Rantman ప్ర‌ముఖ‌ సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్‌,యూట్యూబ‌ర్ అబ్రదీప్ సాహా (Abhradeep Saha) అలియాస్ యాంగ్రీ రాంట్‌మ్యాన్‌ (Angry Rantman)కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతున్న రాంట్‌మ్యాన్‌ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో అభిమానుల సంతాప సందేశాలు  వెల్లువెత్తాయి. చిన్న  వయసులోనే వెళ్లి పోయాడంటూ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

క‌ర్ణాట‌కు చెందిన అబ్రదీప్ సాహా సోష‌ల్ మీడియాలో రాంట్ మ్యాన్  పేరుతో చాలా పాపుల‌ర్. స‌మాజంలో ప్ర‌తి రోజూ జ‌రిగే అంశాల‌పై త‌న‌దైన‌ శైలిలో వీడియోలు చేస్తూ ఫాలోయర్లు ఆకట్టుకునేవాడు.  అతికొద్ది స‌మ‌యంలోనే దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన   క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇటీవలి అతని యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్‌ ప్రకారం యాంగ్రీ రాంట్‌మ్యాన్‌ గత నెలలో పెద్ద ఆపరేషన్  జరిగింది. లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్‌మీద ఉన్నాడని, తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరుతూ ఆ తరువాతి అప్‌డేట్  ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు తెలుస్తోంది. 

 2017, ఆగస్టు 18 లో అబ్రదీప్ తన YouTube ఛానెల్‌ని  “నేను అన్నాబెల్లె మూవీని ఎందుకు చూడను!!!!!!” , అలాగే ‘ది కన్జూరింగ్’ చూసిన తర్వాత ఇకపై హారర్ చిత్రాలను చూడడానికి చాలా భయపడ్డానంటూ రివ్యూ  వీడియోలు చేశాడు. తనదైన హావభావాలతో ఫన్నీ రివ్యూలతో  నెట్టింట్‌ హల్‌ చల్‌ చేసేవాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో కేజీఎఫ్ సినిమా రివ్యూతో మరింత ట్రెండింగ్‌లోకి వచ్చాడు. కేవలం 27 ఏళ్ల వయసులో అకాల మరణంతో మరోసారి ట్రెండింగ్‌లో నిలవడం విషాదం. యాంగ్రీ రాంట్ మ్యాన్ హ్యాష్‌ ట్యాగ్‌ వైరలవుతోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement