Bengaluru: ఐటీ దాడులు.. రూ.16 కోట్ల నగదు, బంగారం సీజ్‌ | Sakshi
Sakshi News home page

Bengaluru: ఐటీ దాడులు.. రూ.16 కోట్ల నగదు, బంగారం సీజ్‌

Published Fri, Apr 26 2024 1:06 PM

IT dept raids 16 Crores in Bengaluru - Sakshi

కర్ణాటక: ఎన్నికల్లో పంపిణీకి డబ్బును నిల్వ చేశారని తెలిసి ఐటీ అధికారులు దాడులు నిర్వహించి గత రెండు రోజుల్లో రూ.16 కోట్ల సొత్తును    స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో 22 కిలోల  బంగారం, రూ.1.33 కోట్ల నగదు ఉన్నాయి. బెంగళూరు దక్షిణ లోక్‌సభ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు శంకరపురలో రూ.3.10 కోట్లకు పైగా విలువచేసే 4 కిలోల 400 గ్రాములు బంగారు నగలు, జయనగర మూడోబ్లాక్‌లో రూ.5.33 కోట్ల విలువచేసే 7 కిలోల 598 గ్రాముల బంగారు నగలను పట్టుకున్నారు.

 చామరాజపేటెలోని సారస్వత్‌ బ్యాంక్‌ వద్ద రూ.84.31 లక్షల విలువచేసే కిలో 200 గ్రాముల బంగారం, మాతా «శారదాదేవి రోడ్డులో రూ.3.14 లక్షలు విలువచేసే వజ్రాలు, జయనగరలో రూ.6.40 కోటి విలువచేసే 202 క్యారెట్ల వజ్రం స్వాదీనం చేసుకున్కారు. బసవనగుడి  పోస్టాఫీస్‌ దగ్గర రూ.18 లక్షల నగదు, శంకరపురం మూడోక్రాస్‌లో రూ.55 లక్షల నగదు, మాతా శారాదా దేవి రోడ్డు వద్ద రూ.16 లక్షలు, వీవీ.పురం వాణివిలాస్‌ రోడ్డు వద్ద రూ.37 లక్షల నగదు తదితరాలను  సీజ్‌  చేశారు.

Advertisement
Advertisement