Top Stories
ప్రధాన వార్తలు
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడమే ఎక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్)
May 17th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 17th AP Elections 2024 News Political Updates11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్ అభ్యర్థులుజాయింట్ కలెక్టర్ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్ఎస్2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్ జగన్6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్2019కి మించి 2024లో వైఎస్సార్సీపీ ప్రభంజనంజూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్ ప్రతినిధులతో సమావేశం
ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా ఉండే విశాఖలో ఎప్పుడు ఏదో ఒక అలజడి రేపాలని ఎల్లో బ్యాచ్ కుట్రలు చేస్తూనే ఉంటుంది. తాజాగా కంచర్లపాలెం పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎల్లో బ్యాచ్ రంగంలోకి దిగింది.కుటుంబ కలహాలను పోలింగ్ ఘర్షణలకు లింకు పెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలు డ్రామాలకు తెరతీశారు. పరామర్శ ప్రక్రియ పూర్తయ్యాక.. మభ్య పెట్టే మాటలు చెప్పి.. ఎల్లో మీడియాలో గొడవకు సంబంధించి కట్టుకథను వండివర్చారు. దీనికి మసాలా యాడ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. టీడీపీకి ఓటు వేసినందుకు హింసిస్తున్నారంటూ.. తన నక్క తెలివి తేటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. కల్పిత కథనాలను పదేపదే ప్రచారం చేస్తూ విశాఖలో ఏదో జరిగిపోయిందంటూ గగ్గొలు పెట్టింది ఎల్లో మీడియా. వారికి సోషల్ మీడియాలో పచ్చబ్యాచ్ కూడా తోడైంది. టీడీపీ నీచ రాజకీయాలను గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో మరోసారి ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా పడింది.అసలు జరిగింది ఇదే..కంచరపాలెం పరిధిలో బుధవారం రాత్రి ఓ కుటుంబంపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవల వల్లే తప్ప.. రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేక సత్తిబాబు తెలిపారు. ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక బర్మా క్యాంప్, నూకాలమ్మ ఆలయం సమీపంలో సుంకర నూకరత్నం(నిరీష) కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి సమీపంలో ఆశ కుటుంబంతో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి చిన్నపాటి వివాదానికి ముందుగా నూకరత్నం, ఆమె కుటుంబ సభ్యులు ఆశ ఇంటిపై గొడవకు దిగి, వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారు. ఇంటికి సమీపంలో ఉన్న ఆశ బంధువైన లోకేష్‌కు విషయం తెలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న నూకరత్నం, ఆమె తల్లి ధనలక్ష్మి, కుమారుడు మణికంఠపై కర్రతో దాడి చేశాడు. గాయాలపాలైన వారంతా కేజీహెచ్ వెళ్లి అత్యవసర విభాగంలో చేరారు. అక్కడ బాధితులిచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారం పోలీసులు దాడికి పాల్పడిన లోకేష్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. లోకేష్‌ను రిమాండ్‌కి తరలించారు.టీడీపీ నేతలు తప్పుడు ప్రచారంరెండు కుటుంబాల మధ్య వివాదానికి టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమి దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటేయలేదని ఆ నేతలే దాడి చేశారని పరామర్శ పేరుతో బాధితుల ఇంటికి వెళ్లి డ్రామాలు చేశారు. బాధితులతో ఆ విషయం చెప్పించారు. వాస్తవంగా పాత గొడవలు నేపథ్యంలోనే తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ దాడి అంటూ టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్‌బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్‌లల్లాను టెంట్‌కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్‌గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
సాక్షి, అనంతపురం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్‌పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్సీపీ లీగల్ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు.
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.
అలాంటి పదబంధాలను ఉపయోగించొద్దు! నటి పద్మాలక్ష్మి
ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!చాలామంది 'చాయ్ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు. అలాగే చాలామంది 'గీ బట్టర్' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్ చాలామంది ఏటీఎం మిషన్ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం. ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్). అలాంటప్పుడు మళ్లా మిషన్ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మరో నెటిజన్ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్‌లోని స్టార్‌బక్స్ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్ పెట్టాడు. (చదవండి: బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!)
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, సాక్షి: టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ఒక ప్లాట్‌ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే,ఆ ల్యాండ్‌పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీత లక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీత లక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ను ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్‌గా తారక్ ఉన్నారు.అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్ లాయర్ తెలిపారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
తప్పక చదవండి
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- బదిలీల తర్వాతే హింస!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
సినిమా
అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే దీని గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్. మరోవైపు ఈ మూవీ మొదలవడానికి ముందే బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఒక దానిపై నిర్మాతలే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏంటది?(ఇదీ చదవండి: వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా)మహేశ్‌తో మూవీ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే రాజమౌళి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కానీ హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండోనేసియా నటిని హీరోయిన్ గా తీసుకున్నారని, ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నటించబోతుందని అన్నారు. అలానే నాగార్జున కీలక పాత్ర చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.అయితే పైన వచ్చిన రూమర్స్ వేటికి స్పందించని నిర్మాణ సంస్థ.. వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ తమతో కలిసి పనిచేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ రూమర్స్ ఎప్పుడొచ్చాయా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా విషయాల కంటే పర్టిక్యూలర్‌గా ఈ విషయం కోసం ఎందుకు నోట్ రిలీజ్ చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. చేస్తే చేశారు గానీ అలానే మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే అప్డేట్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ అయిన ఖుషీ అయ్యేవారు!(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్)
చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కేన్స్‌లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్ కార్పెట్‌పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య తన గ్లామర్‌ను జోడించింది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్‌ను ఆమె ధరించారు. గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు.Breathtaking Beauty ✨ Her Walk 🔥#AishwaryaRai #AishwaryaRaiBachchan #AishwaryaAtCannes #Cannes2024 #CannesQueenAishwarya #Cannes pic.twitter.com/KxgxW1GyQs— Aishwarya Rai Fan (@Ram_TamilNadu_) May 16, 2024
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, సాక్షి: టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ఒక ప్లాట్‌ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే,ఆ ల్యాండ్‌పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీత లక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీత లక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ను ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్‌గా తారక్ ఉన్నారు.అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్ లాయర్ తెలిపారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. 'స్కామ్ 2010' వచ్చేస్తుంది
ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్‌ల గురించి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హన్సల్ మెహతా నిర్మించిన ఈ సిరీస్‌లను తుషార్ దర్శకత్వం వహించారు. భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్‌సిరీస్ 'స్కామ్ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్‌లో విడుదలైంది. కానీ, ఈ వెబ్ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో 'స్కామ్ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ఈ రెండింటికీ సోనీ లివ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్‌ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్‌కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్‌పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్‌లో దాగివున్న నిజాలను ఈ సిరీస్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది.
ఫొటోలు
Aishwarya Rajesh: సోయగంతో కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
డార్లింగ్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
Manisha Rani: స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న మనీషా రాణి (ఫొటోలు)
సీఎం జగన్ గెలుపు ధీమా.. కింగ్ ఆఫ్ ఏపీ అంటూ అభిమానం (ఫొటోలు)
ఛార్మీ కౌర్ 37వ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
క్రీడలు
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్
ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
ఐపీఎల్- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.కొత్త కెప్టెన్ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్ కాంబినేషన్ కుదిరింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. వెరసి లీగ్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్ ఆర్మీ గురించే ఇదంతా! సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2020లో టాప్-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీకి తోడు హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్‌కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.. కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.సమిష్టి కృషితో టాప్-4 వరకుఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్-4 వరకు చేరింది సన్‌రైజర్స్.గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో రైజర్స్ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.పట్టరాని సంతోషంలో కావ్యా మారన్దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.కేన్ మామను హత్తుకున్న సన్‌రైజర్స్ ఓనర్ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అతడు మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్. అదేనండీ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్ మామగా పిలుచుకునే న్యూజిలాండ్ కెప్టెన్. 2021, 2022లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్. పాత ఓనర్‌ను కలుసుకునిఅయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేయగా.. 2023 వేలంలో గుజరాత్ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్‌ను విలియమ్సన్ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ 🧡 pic.twitter.com/QVyGH6KdNP— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
ఫైనల్లో నిఖత్ జరీన్
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ నిఖత్ జరీన్ (52 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ నిఖత్ 5–0తో తొమిరిస్ మిర్జాకుల్ (కజకిస్తాన్)పై ఘన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో మీనాక్షి 5–0తో గుల్నాజ్ బురిబయేవా (కజకిస్తాన్)పై, మనీషా 5–0తో టాంగటార్ అసెమ్ (కజకిస్తాన్)పై గెలిచారు. మరోవైపు సోనూ (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సొయిబమ్ సింగ్ (48 కేజీలు), అభిషేక్ యాదవ్ (67 కేజీలు), విశాల్ (86 కేజీలు), గౌరవ్ చౌహాన్ (ప్లస్ 92 కేజీలు) నేడు సెమీఫైనల్స్‌లో పోటీపడనున్నారు.
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబు ల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–11తో జి సావో నాన్–జెంగ్ వె హాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మైస్నం మిరాబా లువాంగ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మణిపూర్ ఆటగాడు 21–14, 22–20తో మాడ్స్ క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అశ్విని–తనీషా ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–19, 21–17తో హంగ్ ఎన్ జు–లిన్ యు పె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అష్మిత (భారత్) 15–21, 21–12, 12–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది.
బిజినెస్
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి.
గుడ్‌న్యూస్.. రెండున్నర నెలలపాటు భారీ క్యాష్ బ్యాక్
రూపే (RuPay) క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారికి శుభవార్త. తమ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక స్కీమ్ కింద రూపే ఇటీవల భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలలపాటు ఈ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై భారీగా క్యాష్ బ్యాక్ పొందే వీలు కల్పించింది."ఆఫర్ వ్యవధిలో డిస్కవర్ నెట్వర్క్ లేదా కెనడా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, యూఎస్ఏలోని డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో కార్డులను అంగీకరించే వ్యాపారుల వద్ద చేసిన పాయింట్-ఆఫ్-సేల్ కొనుగోళ్లపై క్వాలిఫైడ్ రూపే కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్లు 25 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు" అని రూపే సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ మే 15 నుంచి జూలై 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫర్ వ్యవధిలో ఒక కార్డ్‌కి ఒక లావాదేవీకి గరిష్ట క్యాష్‌బ్యాక్‌గా రూ. 2,500 లభిస్తుంది. రూపే అనేది డెబిట్, క్రెడిట్, ఇంటర్నేషనల్, ప్రీపెయిడ్, కాంటాక్ట్‌లెస్ కార్డ్. భారతీయులందరికీ దేశీయ చెల్లింపు కార్డులను అందించాలనే ఆర్బీఐ దృష్టిని నెరవేర్చడానికి ఎన్పీసీఐ వీటిని ప్రారంభించింది.
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది.
సెమీకండక్టర్స్ తయారీలోకి జోహో
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో తాజాగా సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కంపెనీ ప్రోత్సాహకాలు కోరుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జోహో ప్రతిపాదనను ఐటీ శాఖ కమిటీ పరిశీలిస్తోందని, వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టతనివ్వాలని కంపెనీని కోరిందని వివరించాయి. జోహో ఇప్పటికే టెక్నాలజీ భాగస్వామిని కూడా ఎంచుకున్నట్లు తెలిపాయి. 1996లో ఏర్పాటైన జోహో .. గత ఆర్థిక సంవత్సరం 1 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసింది. తమిళనాడులో చిప్ డిజైన్ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు మార్చిలో వెల్లడించిన నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్, సీజీ పవర్ తదితర సంస్థలకు కేంద్రం ఫిబ్రవరిలో గ్రీన్ సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్ 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
వీడియోలు
గులాబీ పార్టీ బలం పెరిగిందా ?..తగ్గిందా ?
ఏపీ బీజేపీని వెంటాడుతున్న ఓటమి భయం..
వైఎస్ జగన్ విస్పష్ట సందేశం
గాడ్ ఆఫ్ మాసెస్.. రీఎంట్రీ
వైభవంగా గంగమ్మ జాతర..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ ఫుల్ క్లారిటీ
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
తాడిపత్రి ఘటనలకు పోలీసులు బాధ్యత వహించాలి- YSRCP నేతలు
ఆగిపోయిన సూర్య & సుధా కొంగర కొత్త సినిమా
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
ఫ్యామిలీ
అలాంటి పదబంధాలను ఉపయోగించొద్దు! నటి పద్మాలక్ష్మి
ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!చాలామంది 'చాయ్ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు. అలాగే చాలామంది 'గీ బట్టర్' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్ చాలామంది ఏటీఎం మిషన్ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం. ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్). అలాంటప్పుడు మళ్లా మిషన్ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మరో నెటిజన్ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్‌లోని స్టార్‌బక్స్ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్ పెట్టాడు. (చదవండి: బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!)
కొంగే.. సింగారమాయెనా!
వస్త్రాలంకరణలో ప్రతీ అంశం అందంగా రూపుకట్టాల్సిందే అనే ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే కొంగు డిజైన్. చీరకట్టులో కుచ్చిళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పల్లూ డిజైనింగ్కీ అంతే ప్రత్యేకత ఉంటుంది. దారాల అల్లికలైనా.. అద్దాల అమరిక అయినా పూసల పనితనమైనా, ప్రింట్ల మెరుపు అయినా కొంగు కొత్తగా సింగారించుకుని వేడుకలలో బంగారంలా మెరిసి΄ోతుంది.రంగు రంగుల ఫ్యాబ్రిక్చీరలోని రంగులతోపోటీ పడుతూ ఉండేలా ఫ్యాబ్రిక్‌తో చేసిన టాజిల్స్ కొంగుకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది.దారపు పోగులతో..ఊలు, సిల్క్, జరీ దారాలతో అల్లిన టాజిల్స్ కాటన్ చీరలకూ, పట్టు చీరల కొంగులకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తున్నాయి.పూసల కొంగు..చీర రంగు కాంబినేషన్లో పూసలతో కొంగును డిజైన్ చేస్తే ఆ ప్రత్యేకత గురించి చెప్పడానికి మాటలు చాలవు. అలా డిజైనర్లు తమదైన సృజనకు మెరుగుపెడుతున్నారు. వాటిని ధరించిన వారు వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్నారు.గవ్వలు, అద్దాలుగిరిజన అలంకరణను ఆధునికపు హంగుగా మార్చడానికి గవ్వలు, అద్దాలు, ఊలు దారాల డిజైన్లను కొంగుకు అందంగా సింగారిస్తున్నారు. ఇవి ఎక్కువగా కాటన్ శారీస్ అలంకరణలో చూడవచ్చు. క్యాజవల్ వేర్‌గా నప్పే చీరలు ఈ డిజైన్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.కుచ్చుల కొంగుచందేరీ, నెటెడ్ మెటీరియల్‌తో చీరకు జత చేసిన కొంగు కుచ్చుల అమరికతో వెస్ట్రన్ ΄ార్టీ వేర్‌గా అలరిస్తుంది. అమ్మాయిలను అమితంగా ఈ తరహా డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి.రెడీమేడ్..సాదా సీదాగా కనిపించే చీర కొంగు డిజైన్‌ను మార్చాలనుకుంటే మార్కెట్లో రెడీమేడ్ పల్లూ డిజైన్స్ లభిస్తున్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పూసలు, దారాల అల్లికలతో ఉన్న పల్లూ డిజైన్స్‌ని తెచ్చి చిన్న కుట్టుతో కొంగును కొత్తగా మెరిపించవచ్చు.ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..!
‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..!
‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ముగ్గురు గాయకులు... నతనియ లాల్వాని, సుభి, షల్మాలి ఖోల్గాడేలు ‘వావ్’ అనుకునేపాటను తీసుకువచ్చారు. ఈ కొత్త సాంగ్ ‘ముంబై మ్యాజిక్’ నిజంగానే మ్యాజిక్ చేసింది.హెరిటేజ్, హాసల్, హోప్ అనే మాటలతో రూపుదిద్దుకున్నపాట ఇది. ‘ముంబైవాసిగా ఈపాట నన్ను ఎన్నో జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లింది’ అంటుంది నతనియ. ‘దేశీ ఎట్ హార్ట్’ అని తన గురించి పరిచయం చేసుకునే సుభి న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిల్స్లాంటి ఎన్నో ్ర΄ాంతాలలో నివసించింది. అయినప్పటికీ స్వదేశీ మూలాలకు ఎప్పుడూ దూరం కాలేదు.బ్రాడ్వే, జాజ్లాంటి డిఫరెంట్ మ్యూజిక్ జానర్స్‌కు దేశీ టచ్ ఇచ్చింది.‘ఎన్నో విలువైన జ్ఞాపకాలకుపాట రూపం ఇచ్చే అవకాశం దక్కింది’ అంటుంది ‘ముంబై మ్యాజిక్’ గురించి. ‘ముంబై మహానగరంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యేపాట ఇది. ముంబై నగర ముఖచిత్రాన్ని వివిధ వర్ణాలలో అందంగా చూపినపాట. నగరంలోని వేగాన్ని, నిశ్శబ్దాన్ని, వెలుగు, నీడలను పట్టించేపాట ఇది’ అంటుంది షల్మాలి.ఇవి చదవండి: ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...
ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'...
‘30 అండర్ 30 ఆసియా’ తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ విభాగంలో మన దేశం నుంచి ఈవీ చార్జింగ్ కంపెనీ ‘స్టాటిక్’ ఫౌండర్స్ అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోర, ‘ది డిస్పోజల్ కంపెనీ’ ఫౌండర్ భాగ్యశ్రీ జైన్లు చోటు సాధించారు..బాల్యస్నేహితులైన అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరాలు పట్టణ వాయు కాలుష్యం గురించి ఎన్నోసార్లు మాట్లాడుకునేవారు. కాలుష్య స్థాయిలను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ప్రధానపాత్రపోషించడంపై కూడా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)కి సంబంధించిన మౌలిక చార్జింగ్ సదు΄ాయాలపై దృష్టి పెట్టారు. తమ పొదుపు మొత్తాలను ఉపయోగించి 2019లో ఇంట్లో తొలి ఈవీ చార్జర్‌ను తయారుచేయడంతో ‘స్టాటిక్’ ప్రయాణంప్రారంభమైంది.వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడానికి సమీపంలోని చార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడానికి ‘స్టాటిక్’ యాప్ ఉపయోగపడుతుంది. అగ్రశ్రేçణి ఈవీ చార్జర్లు, అడ్వాన్స్డ్ మొబైల్ అప్లికేషన్లను కూడా ‘స్టాటిక్’ డెవలప్ చేసింది. ఈ స్టార్టప్ కార్పొరేట్ ఆఫీసులు, రెసిడెన్సెస్, హోటల్స్, సినిమా హాలు...మొదలైన వాటికి సంబంధించిన యజమానులతో టై అప్ అయింది. ఈప్రాపర్టీ వోనర్స్ను ‘చార్జర్ హోస్ట్స్’గా వ్యవహరిస్తారు.హరియాణాలోని హిసార్‌లో పుట్టి పెరిగిన అక్షిత్ బన్సాల్ మణి΄ాల్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో 2018లో ‘డెలాయిట్‌లో’ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్నేహితుడు రాఘవ్ అరోర అతడికి వెయ్యి ఏనుగుల బలం అయ్యాడు. ‘వి్ర΄ో’లో డేటా సైంటిస్ట్‌గా పనిచేసిన రాఘవ్ బాల్య స్నేహితుడికి తోడుగా నిలిచాడు. ఇద్దరి కృషి ‘స్టాటిక్’కు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.‘స్టాటిక్’ యూఎస్పీలలో ఒకటి...సింగిల్ రెవెన్యూ మోడల్‌పై మాత్రమే కంపెనీ దృష్టి పెట్టక΄ోవడం. సొంతంగా చార్జర్స్‌ను ఇన్స్టాల్ చేయడంతోపాటు. హెచ్‌పీసీఎల్, షెల్లాంటి పెద్ద కంపెనీల కోసం చార్జర్లను బిల్డ్ చేయడం, ఇన్స్టాల్, మెయింటెయిన్ చేయడం లాంటివి చేస్తోంది స్టాటిక్.వివిధ బ్రాండ్లు ‘ప్లాస్టిక్ న్యూట్రల్’గా మారడానికి తన స్టార్టప్ ‘ది డిస్పోజల్ కంపెనీ’తో సహాయపడుతోంది దిల్లీకి చెందిన భాగ్యశ్రీ జైన్. ఈ స్టార్టప్ ద్వారా ఏడాదికి 750 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేస్తున్నారు. నోయిడా యూనివర్శిటీలో బిబిఏ చేసిన భాగ్యశ్రీ కొన్ని సంవత్సరాలు వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసింది. వివాహానంతరం రాజస్థాన్‌కు మకాం మార్చింది. వేస్ట్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఒక్క రీసైక్లింగ్ యూనిట్ లేదనే విషయం గ్రహించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి పెట్టి ‘ది డిస్పోజల్ కంపెనీ’ అనే రీసైకిలింగ్ కంపెనీ మొదలుపెట్టింది.ఏదైనా బ్రాండ్ తమ కంపెనీలో క్లయింట్‌గా సంతకం చేసిన తరువాత ఆ బ్రాండ్‌కు సంబంధించిన ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్‌ను అంచనా వేయడానికి వన్–టైమ్ వేస్ట్ ఆడిట్ నిర్వహిస్తారు. ‘ది డిస్పోజల్ కంపెనీ’కి దేశవ్యాప్తంగా రీసైక్లర్పాట్నర్స్, రాగ్‌పికర్స్, ఆగ్రిగేటర్స్ ఉన్నారు. 75 లక్షల రూ΄ాయల పెట్టుబడితో ఈ రీసైక్లింగ్ యూనిట్నుప్రారంభించారు. ఎక్సెంచర్, సస్టైనబిలిటీ, యాక్సిలరేటర్ ్ర΄ోగ్రామ్కు ఎంపికైన ఈ స్టార్టప్‌కు 60 లక్షల రూ΄ాయల సీడ్ ఫండ్ లభించింది.పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం చూపుతున్న ప్రభావం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకునే పద్ధతుల గురించి రచనలు, ఉపన్యాసాల రూపంలో ప్రజలకు అవగాహన కలిగిస్తోంది భాగ్యశ్రీ జైన్.
న్యూస్ పాడ్‌కాస్ట్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
క్రైమ్
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు.
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
పోలీసు కాల్పుల్లో రౌడీ షీటర్ మృతి
దొడ్డబళ్లాపురం: హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ పోలసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు రౌడీషీటర్ నరసింహమూర్తి ఈనెల 10వ తేదీన హేమంత్ గౌడ అనే యువకుడిని చర్చలకు పిలిచాడు. అనంతరం అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం దొడ్డ పట్టణ శివారులో ఒక చోట నిందితుడు నరసింహమూర్తి దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిందితుడు పోలీసులపై దాడికి యతి్నంచాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నరసింహమమూర్తికి తగలడంతో మృతి చెందాడు. కేసు దర్యాపులో ఉంది.