Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Tollywood Celebrities Caught At Bengaluru Rave Party Details
రేవ్‌పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్‌ ప్రముఖులు!

బెంగళూరు, సాక్షి: ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ కలకలం రేగింది. ఆదివారం అర్ధరాత్రి బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించగా.. పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.సదరు జీఆర్‌ ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌‌ కాన్‌కార్డ్‌ సంస్థకు గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్‌ చేశారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సీసీబీ పోలీసులు. ఆ కథనాల్ని ఖండించిన కాకాణిరేవ్‌పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్‌ రేవ్‌ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్‌ ​ఒరిజినాలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్‌ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.నాకు సంబంధం లేదు: సినీ నటి హేమ‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు.

Ksr Comments On BJP Leader Narendra Modi's Double Game Behaviour
ఇలా.. అన్నింటిలోనూ డబుల్ గేమ్ నిపుణులే..!

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని శ్రీరాముడు మళ్లీ టెంట్ కిందకు వస్తాడు.. ఆలయంపై బుల్డోజర్ పంపుతారు.. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక వ్యాఖ్య. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఇంత మాట ఎలా అన్నారో అర్దం కాదు. ఈ మాట విన్నప్పుడు ఒక్కసారిగా దేశ ప్రజలంతా ఆశ్చర్యం చెందారు. మోదీనేనా ఇలా మాట్లాడుతుంది.. అని అంతా విస్తుపోయారు. దాంతో మోదీ ఈసారి ఎందుకో తడబడుతున్నారన్న భావన ఏర్పడింది. గత రెండు ఎన్నికలలో మోదీ ఇంత ఘోరంగా మాట్లాడారన్న విమర్శలు రాలేదు. ఈ ఒక్కటే కాదు. కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ సంతోషిస్తుందని, ముస్లింలను అప్పీజ్ చేస్తోందని, ముస్లింలకు రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.⇒ అంటే ఈ విమర్శల ద్వారా హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు మోదీ, ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు ప్రయత్నించారు. ఇక్కడ కూడా వారు డబుల్ గేమ్ ఆడారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. గతంలో కర్నాటకలో కూడా అలాగే చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాన్ని నిలబెటుకోలేకపోయారు. తెలంగాణలో ఆ పాయింట్ పైన కూడా గట్టి ఉపన్యాసాలు చేశారు. కానీ ఏపీకి వెళ్లేసరికి అక్కడ మళ్లీ టీడీపీ, జనసేనల కూటమితో కలిసి ఉండడంతో, ముస్లిం రిజర్వేషన్ల గురించి ప్రసంగాలలో ప్రస్తావించకపోవడం కూడా అందరూ గమనించారు.⇒ 2014 ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన వ్యూహాత్మకంగా దేశం అంతటా గుజరాత్‌లో జరిగిన అబివృద్ది అంటూ టీవీలలో, పత్రికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తద్వారా ఒక ఇమేజీని తెచ్చుకున్నారు. నిజానికి అప్పటికి ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్దిగా కూడా నిర్ణయం కాలేదు. కానీ తన ప్రచార వ్యూహం ద్వారా బీజేపీని కూడా ఆయన ప్రభావితం చేయగలిగారు. దేశ ప్రజలంతా మోదీ అంటే అభివృద్ది అని నమ్మారు. గుజరాత్‌లో ఆయన బాగా చేశారన్న భావన బాగా బలపడింది. ఆ రోజుల్లో టీవీలలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే జనం నుంచి నిరసన వచ్చేది. నేను లైవ్ షో చేస్తున్నప్పుడు సైతం ఈ అనుభవం చూశాను. ఎక్కడైనా మోదీని ఒక్క మాట అంటే జనం ఊరుకునేవారుకారు. అలాంటిది దశాబ్దం తర్వాత మోదీని లైవ్ షోలలో ఫోన్ చేసి ప్రజలే విమర్శిస్తున్నారు.⇒ అంతమాత్రాన ఆయనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని కాదు. కానీ ఒక నేత ఎలా ఉండాలని అనుకుంటారో ఆయన అలా లేరన్న భావన పెరుగుతోందన్నమాట. ప్రత్యేకించి రామాలయంపై బుల్డోజర్‌ నడుపుతారన్న ఆయన ఆరోపణను ఎవరూ జీర్ణించుకోలేదు. ఆయనను సమర్ధించేవారు సైతం మోదీ అలాంటి విమర్శ చేసి ఉండాల్సింది కాదనే అనుకుంటున్నారు. ప్రధాని మోదీ వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసి, రెండువేల రూపాయల నోట్లు తెచ్చినప్పుడు చాలామందికి అంత ఇష్టం లేదు. దానివల్ల సామాన్యులు చాలా కష్టపడ్డారు. అయినా మోదీ చిత్తశుద్దిని జనం శంకించలేదు. దేశం కోసం, నల్లధనం నిర్మూలనకోసమే ఆయన ఇలా చేసి ఉండవచ్చులే అని సర్దుకున్నారు.⇒ జీఎస్‌టీ వంటివాటిపై కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పట్లో బీజేపీ గెలవదన్న అంచనాకు వచ్చిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు వంటివారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగారు. ఆ తరుణంలో జరిగిన పుల్వమా ఘటనతో దేశం మూడ్ మారిపోయింది. పాక్ ఉగ్రవాదులు మన సైనికులు ఉన్న బస్‌ను పేల్చడంతో, మోదీ ధైర్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వైమానిక దళాన్ని పంపించి ఉగ్రవాద శిబిరాలను ద్వంసం చేయించారు. అప్పుడు ఇండియా పైలట్ ఒకరు పాక్‌కు పట్టుబడగా, జాగ్రత్తగా హాండిల్ చేసి ఆయనను భద్రంగా ఇండియాకు తీసుకు రాగలిగారు. దాంతో మోదీపై విశ్వాసం పెరిగింది. మళ్లీ మోదీ వేవ్ వీచి ఎన్‌డీఏ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.⇒ 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని టెర్రరిస్తు అని విమర్శించారు. భార్యను ఏలుకోలేని వ్యక్తి దేశాన్ని ఏమి ఏలతారని అన్నారు, ముస్లింలను బతకనివ్వరని, మంచివాడు కాదని.. అవినీతిపరుడని.. ఇలా ఏవేవో పిచ్చి విమర్శలు చేశారు. దానికి ప్రతిగా చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ మాదిరి వాడుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. లోకేష్ తండ్రి అంటూ చాలా వ్యంగ్యంగా చంద్రబాబు సీనియారిటీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ 2024 నాటికి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీతో జతకట్టడం ప్రజలందరిని ఆశ్చర్యపరిచింది. మోదీ ఎంతో వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం ఉన్న నేత అని భావిస్తున్న సపోర్టర్లకు ఆయన షాక్ ఇచ్చారని చెప్పాలి.⇒ అలాగే టెర్రరిస్టు అన్న నోటితోనే చంద్రబాబు నాయుడు విశ్వగురు అంటూ మోదీని పొగిడారు. మరి వీళ్లిద్దరూ గతంలో దూషించుకున్న విషయాలను నమ్మిన ప్రజలు ఏమైపోవాలి. వీరు మారితే ప్రజలంతా మారిపోవాలా? అన్న చర్చ జరిగింది. దేశ ప్రధాని అయిన తర్వాత రాజకీయ నేతగా కాకుండా రాజనీతిజ్ఞుడుగా మారాలని అంతా ఆశిస్తారు. గతంలో చేసిన పలువురు ప్రధాన మంత్రులు చాలావరకు అలాగే వ్యవహరించారు. ప్రతిదానిలోను రాజకీయం చూడలేదు. రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేసినా చాలా హుందాగా ఉండేవి. వ్యక్తిగత ఆరోపణలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ మోదీ రాష్ట్రస్థాయి నాయకులతో పోటీపడినట్లుగా, ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి వెనుకాడలేదు.⇒ ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. అవినీతిపరులను జైలులోనే ఉంచుతామని తాజాగా ఆయన చేసిన ప్రకటనను కూడా జనం సీరియస్‌గా తీసుకోవడం లేదు. డిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఒకదానిని తీసుకుని ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను, ఆయన మంత్రులు కొందరిని జైలులో పెట్టి కక్ష తీర్చుకుంటున్నారన్న విమర్శ వచ్చింది. అదే టైమ్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసిన వారిని, వందల కోట్ల మోసాలు చేసినవారిని బీజేపీలో చేర్చుకుని వారికి ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చి, వారికోసం ప్రచారానికి స్వయంగా వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. నిజంగా మోదీకి అవినీతిని అంతం చేయాలన్న చిత్తశుద్ది ఉందా అన్న సందేహం కలుగుతుంది.⇒ గతంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో పలు ఆరోపణలు వచ్చినా జనం పట్టించుకోలేదు. కానీ మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదన్న భావన ప్రజలలో ప్రబలితే అది వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అసలు మోదీ బుల్డోజర్ విమర్శలు చేయగానే అందరికి గుర్తుకు వచ్చింది యూపీ ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ తోనే ప్రభుత్వం నడిపారన్న వ్యాఖ్య ఉంది. రౌడీ షీటర్లు, అల్లర్లకు పాల్పడిన వారిని చట్టం ప్రకారం శిక్షించడం కాకుండా బుల్డోజర్‌లతో వారి ఇళ్లు కూల్పించారు. ఇప్పుడు ఆరోపణ మోదీ కాంగ్రెస్ పై చేస్తున్నారు. అంతేకాదు, అయోధ్యలో వివాదాస్పద బాబ్రి మసీదును కూల్చింది కూడా బీజేపీనే అన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మత రాజకీయాలు చేయడంలో బీజేపీదే అగ్రస్థానంగా ఉందన్నది వాస్తవం. అయినా మోదీ కాంగ్రెస్‌పై మతపరమైన ఆరోపణలు చేస్తుంటారు. అలా అని కాంగ్రెస్ ఏదో పత్తిత్తు అనడం లేదు.⇒ తెలంగాణలో ఆర్ఆర్‌టాక్స్ అంటూ మోదీ విమర్శలు చేశారు. బాగానే ఉంది. మరి గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును అవినీతిపరుడని విమర్శించారు కదా.. ఇప్పుడు ఎలా కలిశారంటే అందుకు జవాబుదొరకదు. చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు కేంద్రం ప్రకటన చేసింది కదా.. అదేమైంది అని ఎవరైనా అడిగితే బదులు ఉండదు. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చిన విషయంలో ఏమి తేల్చారో ఎవరూ చెప్పరు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పలు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆయన తమ పార్టీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చి మరీ ఆదరించింది. దీనిని ఏ విధంగా చూడాలి. ఇలా అన్నిటిలొను డబుల్ గేమ్ ఆడుతున్న నేతలలో మోదీ చేరడం ఆయనను అభిమానించేవారికి కాస్త బాధ కలిగించే విషయమే కదా!⇒ మరో విషయం మాట్లాడుకోవాలి. ఒకవైపు బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. ఇంకోవైపు ఆయా రాష్ట్రాలలో రకరకాల ఉచిత వాగ్దానాలు చేస్తుంటారు. ఉదాహరణకు ఒడిషాలో శాసనసభ ఎన్నికలలో ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల ఓచర్ ఇస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందట. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవులు అధికంగా ఉంటారు కనుక అక్కడ ఉచితంగా జెరుసలెం యాత్రకు హామీ ఇస్తుంటారు.ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రకటించిన మానిఫెస్టోతో తమకు సంబంధం లేదని చెబుతారు. అదే టైమ్ లో వారి మానిఫెస్టోకి మద్దతు ఇస్తున్నామని అంటారు. దీని అర్ధం ఏమిటో ఎవరికి తెలియదు. బీజేపీలో ఇతర పార్టీ అభ్యర్ధులను తీసుకుని టిక్కెట్లు ఇస్తుంటారు. దేశ వ్యాప్తంగా 108 మంది ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం అభ్యర్ధులలో నాలుగో వంతు ఇతర పార్టీలకు చెందినవారే అన్నమాట.⇒ అంతదాకా ఎందుకు ఏపీలో ఆరుగురు అభ్యర్ధులలో ఐదుగురు వేరే పార్టీల నుంచి వచ్చి చేరినవారే. వారిలో కొందరు టీడీపీ కోవర్టులుగా ముద్రపడ్డవారు. తెలంగాణలో సైతం పదిమందికి పైగానే ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. ఇలాంటి పరిస‍్థితిలో గతంలో కాంగ్రెస్ పార్టీ తీరుకు, ఇప్పుడు బీజేపీ తీరుకు పెద్ద తేడా ఉన్నట్లు అనిపించదు. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పెట్టి ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టారు. ఇప్పుడు ఎమర్జన్సీ లేకుండానే ఏదో కేసులో పెట్టి తమకు గిట్టనివారిని జైలుకు పంపుతున్నారన్న విమర్శలను మోదీ ఎదుర్కుంటున్నారు. అదే టైమ్‌లో బీజేపీలో చేరగానే కేసులు ఏవీ ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాయన్న బావన ఏర్పడింది. అందుకే ఆయా రాష్ట్రాలలో కొంతమంది తాము ఎన్ని అవినీతి పనులు చేసినా బీజేపీ గొడుగు కిందకు చేరి రక్షణ పొందుతున్నారన్న అబిప్రాయం వ్యాపిస్తోంది.⇒ ఇది మోదీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇలాంటి కారణాల వల్లే ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందా? రాదా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్‌డీఏకి 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు పలువురు చెబుతున్నా, అదంతా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ మోదీ వంటి పెద్ద నేత తన ప్రసంగాలలో సంయమనంగా ఉంటేనే మంచిది. దానివల్ల దేశ రాజకీయాలు కొంత ఆరోగ్యకరంగా సాగడానికి అవకాశం ఉంటుంది. విశేషమేమిటంటే శ్రీరాముడిని సొంతం చేసుకుని రాజకీయాలు సాగించాలన్న వ్యూహంలో ఉన్న బీజేపీ రామాలయం ఉన్న అయోధ్యలోనే తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోందట.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయలు

ap elections 2024 may-20th political updates telugu
May 20th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 20th AP Elections 2024 News Political Updates12:51 PM, May 20th, 2024మంగళగిరిపల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలుమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలుటీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలుపోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదుతమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలుసాక్షితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మిపల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మిబాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మిఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మిప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మిమహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మివారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..? : గజ్జల వెంకటలక్ష్మిచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మిఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మిఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మిత్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి 12:11 PM, May 20th, 2024విజయనగరండిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలుఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.12:00 PM, May 20th, 2024పోలీసుల అదుపులో బళ్ల బాబీఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యంపశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడికారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులుమీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్‌ కోమీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్‌నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులుఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు11:32 AM, May 20th, 2024విజయవాడఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదికపోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్‌ఛార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలుతాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణకేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్11:01 AM, May 20th, 2024గుంటూరుసాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందంపోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదుపల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశంఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం10:38 AM, May 20th, 2024ప్రకాశంఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహంతప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తాఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయంరాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందిజూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్‌!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్‌ బ్యూరో) అలర్ట్‌కౌంటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్‌ రిపోర్ట్‌ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్‌ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్‌ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్‌ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్‌ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్‌ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్‌ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్‌కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్‌ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్‌సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్‌ కిషోర్‌చంద్రబాబు డైరెక్షన్‌లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్‌ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్‌ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్‌పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్‌ టీం కష్టం ఉందన్న సీఎం జగన్‌జగన్‌ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం‌ జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్‌ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్‌లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పం‌పనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొ‌న్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్‌’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్‌ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్‌నెట్‌ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్‌ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్‌

Allu Arjun Exit From Mega Family Whatsapp Group
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!

మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్‌ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇ‍క్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్‌తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్‌ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌)

Godfather Of AI Warns About Massive Job Losses
‘AI’తో ప్రమాదమే.. గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ వార్నింగ్‌

ఆటోమేటిక్‌గా నడిచే కార్లు, బైక్‌లు.. ఇలా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతోంది. అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న భయం నెలకొంది. తాజాగా, గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ జెఫ్రీ హింటన్ సైతం ఇదే ఆందోళనను వెలిబుచ్చారు. ఓ ఇంటర్వ్యూలో అన్నీ రంగాల్లో పెరిగిపోతున్న ఏఐ వినియోగం గురించి చర్చించారు. రానున్న రోజుల్లో దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో హెచ్చరించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై జెఫ్రీ హింటన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏఐ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ప్రపంచానికి ఆదాయం అవసరమని, అలాంటి అవకాశాల్ని ప్రభుత్వాలే సృష్టించాలని తెలిపారు. ఇక లేఆఫ్స్‌ గురైన ఉద్యోగులకు ప్రభుత్వాలు బేసిక్‌ పే శాలరీ చెల్లిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Pat Cummins reveals the name of Indian batter he doesnt want to bowl against
అత‌డొక క్లాస్ ప్లేయ‌ర్‌.. ఎంత‌ చెప్పుకున్న త‌క్కువే: ప్యాట్ క‌మ్మిన్స్‌

ఐపీఎల్‌-2024లో త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌ర‌గొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. 215 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ సునాయ‌సంగా చేధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో స‌న్‌రైజ‌ర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక పంజాబ్‌పై విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స్పందించాడు."మా హోం గ్రౌండ్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది. మా జ‌ట్టును స‌పోర్ట్ చేసేందుకు మైదానంకు వ‌చ్చిన అభిమానులంద‌రికి ధ‌న్య‌వాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్‌ను ఎక్క‌డ నేను చూడ‌లేదు. మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజ‌యాలు సాధించాము. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివర‌కు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్ర‌తీ ఒక్క‌రూ జ‌ట్టు విజ‌యాల్లో త‌మ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న త‌క్కువే. అత‌డికి అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియ‌ర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అత‌డి బ్యాటింగ్ విధ్వంసానికి ప్ర‌తీ ఒక్క బౌల‌ర్ భ‌య‌ప‌డాల్సిందే. నేను కూడా అభిషేక్‌కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అత‌డు స్వేచ్ఛగా ఆడుతాడు. ఇక నితీష్ ఒక యువ సంచ‌ల‌నం. అత‌డొక ఒక క్లాస్ ప్లేయర్. అత‌డి త‌న అనుభ‌వానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్‌లో కీల‌క ఆట‌గాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథ‌మ్‌ను కొన‌సాగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో క‌మ్మిన్స్ పేర్కొన్నాడు.

AP Elections 2024 Incidents: SIT Report Submission To DGP Updates
ఇవాళే డీజీపీకి నివేదిక.. సిట్‌ పొడిగింపు?

విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు సిట్‌ ఇన్‌చార్జి.. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నివేదికను సమర్పించనున్నారు. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్‌ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘హింసాత్మక ఘటనలపై ఈసీకి ఇవాళ నివేదిక ఇస్తాం. నాలుగు జిల్లాల్లో టీమ్‌లు దర్యాప్తులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లకు చెప్పి.. కొన్ని కేసుల్లో అదనపు సెక్షన్లు చేరుస్తాం. అలాగే కొంతమంది నిందితులను గుర్తించాం. నేటి నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తాం’’ అని సిట్‌ ఇన్‌చార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఓ మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిట్‌ ఇలా.. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ సభ్యులు.. అలర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పల్నాడులో అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో రెండు బృందాలు, తిరుపతి చంద్రగిరిలో ఒక టీం, అనంతపురం తాడిపత్రిలో మరో టీం పర్యటించింది. డీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణ చేపట్టింది. అదే సమయంలో.. వినీత్‌ బ్రిజ్‌లాల్‌, ఐజీ (సిట్‌ ఇన్‌ఛార్జి)రమాదేవి, ఏసీబీ ఎస్పీసౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీరమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీపి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీవి.భూషణం, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (గుంటూరు రేంజ్‌) కె.వెంకటరావు, ఇన్‌స్పెక్టర్‌(ఇంటెలిజెన్స్‌), విశాఖపట్నంరామకృష్ణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌మోయిన్, ఇన్‌స్పెక్టర్, ఒంగోలు పీటీసీఎన్‌.ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్, అనంతపురం ఏసీబీశివప్రసాద్, ఇన్‌స్పెక్టర్, ఏసీబీసిట్‌ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ ఎప్పటికపుడు నాలుగు బృందాల నుంచి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిని మరో అదనపు ఎస్పీకి అప్పగించారు. మొత్తంగా.. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్‌ఐఆర్‌లను సిట్‌ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్‌ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్‌ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్‌ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక​ క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లుసమాచారం. ఇక సిట్‌ బృందాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి, సిట్ బృందాలకి కూడా YSRCP ఫిర్యాదు చేసింది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్‌ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్‌ ఇన్‌చార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్‌ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

India Stands With Iran: PM Modi Condoles President Ebrahim Raisi Death
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఇరాన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్‌ ఇరాన్‌కు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో సంతాపం ప్రకటించారు.‘ఇరాన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సయ్యద్‌ ఇబ్రహీం రైసీ మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత్‌-ఇరాన్‌ దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అతని కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు.Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…— Narendra Modi (@narendramodi) May 20, 2024 ‘ఈ మరణవార్త షాక్‌కు గురిచేసింది. ఇరాన్‌ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో పలుమార్లు సమావేశమయ్యాను. ఈ జనవరిలో మా మధ్య భేటీ జరిగింది. ఈ విషాద సమయంలో ఇరాన్‌ ప్రజలకు అండగా ఉంటాం.-భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌Deeply shocked to hear of the passing away of Iran’s President Dr Ebrahim Raisi and Foreign Minister H. Amir-Abdollahian in the helicopter crash. Recall my many meetings with them, most recently in January 2024. Our condolences to their families. We stand with the people of…— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 20, 2024 కాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను బెల్‌-212 ఆదివారం సాయంత్రం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ ధ్రువీకరించింది.రైసీతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియాన్ (60), తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్ మలేక్‌ రహ్‌మతీ తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్- అజర్‌బైజా ప్రావిన్స్‌ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. విమానం బయలుదేరిన దాదాపు 30 నిమిషాలకే అడవుల్లో కుప్పకూలింది.మరోవైపు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడి మరణవార్త పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడి నేపథ్యంలో ఇరాన్‌ హమాస్‌కు మద్దతుగా ఉంది. గత నెలలో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుపడిన విషయం తెలిసిందే.

funeral cost jump to Rs 30 lakh in canada Families owes
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?

అంత్యక్రియలు అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్టు అంత్యక్రియలు నిర్వహించడం పరిపాటి. కానీ కెనడాలోదారుణ పరిస్థితులునెలకొన్నాయి. ఒక్కో మృత దేహానికి నిర్వహించే అంత్యక్రియలు ఖర్చు రూ. 27 నుంచి 30లక్షల దాటి పోతుండటంతో ఏం ఏయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు జనం,ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న కునం, దుఃఖం మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా వదిలివేస్తున్న వైనం ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి, అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలుకుపైమాటేన. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకు పోతోందిట.దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో, స్థానాన్ని బట్టి శ్మశానవాటిక ప్లాట్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 30 వేల డాలర్లకు పైనే అవుతోంది. మిడ్‌టౌన్ టొరంటోలో భారీగా ధర (రూ. 27 లక్షలు.) చెల్లించాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం రూ. 30 లక్షలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. క్యూబెక్‌లో, 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో, 2016లో 80 ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రతి పక్షాలు విచారం వ్యక్తం చేశాయి.

BRS MLC K Kavitha delhi liquor case Judicial Remand Update
కల్వకుంట్ల కవితకు ముగిసిన కస్టడీ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగిసింది. ఇవాళ( సోమవారం) మధ్యాహ్నం రౌస్‌ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్‌ జైలు అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కవితపై ఈడీ చార్జి షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రౌస్‌ అవెన్యు కోర్టు న్యాయమూర్తి కవిత చార్జి షీటును నేడు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement