Top Stories
ప్రధాన వార్తలు
అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ కేసు: కవితకు మరో షాక్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
పిన్నెల్లిపై పచ్చ కుట్రలు.. విర్రవీగితే నష్టం తప్పదు..
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖలో ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ కొద్దిమంది పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమిటి? ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఆ పోలీసులపై పెత్తనం చెలాయించడం ఏమిటి? గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎవరిపైన అయినా నిర్దిష్ట ఆరోపణలు వస్తే ఆ పోలీసు అధికారులను బదిలీ చేయడం సహజమే. ఇదేమి కొత్త విషయం కాదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వేరే అధికారులను నియమిస్తుంది. ఇక్కడే ఈసీ పెద్ద తప్పు చేసింది. ఏపీలో తెలుగుదేశం కూటమికి సాయం చేయడానికి నడుం కట్టినట్లు ఉంది. వెంటనే కూటమి నేతలు కొరుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను, కింది స్థాయి పోలీసు అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చేసింది. దాని ఫలితమే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి మొదలైన చోట్ల హింసాయుత ఘటనలకు అవకాశం ఏర్పడింది. చివరికి ఈసీ తాను నియమించిన కొందరు అధికారులనే సస్పెండ్ చేయవలసి వచ్చింది.దాంతో ఈసీకి అప్రతిష్ట వచ్చింది. అయినా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు మారినట్లు లేదు. ఇప్పటికీ టీడీపీ ట్రాప్‌లోనే కొనసాగుతూ వైఎస్సార్సీపీని ఇబ్బందిపెట్టాలని ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైకోర్టులో వెల్లడైన అంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను కిందపడేశారనో లేక ద్వంసం చేశారన్న కేసులో బెయిల్ పొందగానే, అంతకు ముందు జరిగిన ఘటనలలో పనికట్టుకుని ఈయనపై కేసులు పెట్టారట. అందులో సీఐపై దాడి వంటి కేసులు కూడా ఉన్నాయి. ఘటనలు జరిగి పది రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఏపీలో ఆ పోలీసు అధికారులకు మాత్రం ఆ ప్రశ్న రాలేదు.ఎలాగైనా పిన్నెల్లిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి ఆయనను కౌంటింగ్ వద్దకు రాకుండా చేయాలన్నది వారి కుట్ర అట. లేకుంటే డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పిన్నెల్లిపై ఈ నెల 22 న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లి న్యాయవాదులు కింది కోర్టులో ఉన్న సంబంధిత డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఈ నెల 23న అంటే ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ రాగానే కొత్త కేసులు పెట్టారని హైకోర్టుకు చూపించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి కేసులో బెయిల్ పొందారు. ఇక్కడ అందుకు బిన్నంగా పోలీసులే తప్పుడు సమాచారం ఇచ్చి ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేయాలని తలపెట్టారు. ఇది సిగ్గు చేటైన విషయం. ఇదంతా పిన్నెల్లిపై కక్షతో ఉద్దేశపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.ఒక సీఐ స్థాయి అధికారి ప్రైవేటు లాయర్‌ను పెట్టుకోవడం ఏమిటో తెలియదు. నిజానికి ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడుల కేసులలో ప్రభుత్వమే లాయర్లను పెడుతుంది. లేదా నిర్దిష్ట అనుమతి తీసుకుని వ్యక్తిగత లాయర్లను నియమించుకోవచ్చు. అలాకాకుండా నేరుగా ఇలా చేశారంటే ఆ సీఐని ఏమనుకోవాలి. ఆయన వెనుక మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చిత్రమేమిటంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఈసీ, అధికార వైఎస్సార్సీపీ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. చివరికి ఒక సీఐ స్థాయి అధికారి తప్పుడు కేసులు పెడుతుంటే వైఎస్సార్సీపీ నిస్సహాయంగా మిగిలిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రిఫరీ మాదిరిగా కాకుండా, కూటమిలో బాగస్వామిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి.పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో అత్యంత నిష్పక్షపాతంగా ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎస్.ఎస్.పి యాదవ్ అనే అధికారి డీజీపీగా ఉన్నారు. ఆయనపై విపక్షం ఆరోపణలు చేస్తే ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత ఎ.కె మహంతి అనే సీనియర్ అధికారిని డీజీపీగా నియమించింది. ఆయన నిజాయితీగా తన సేవలు అందించారు. దాంతో ఏ పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈసీ తీరే అభ్యంతరకరంగా ఉంటే, ఈసీ నియమించిన తాత్కాలిక అధికారులు మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా కొద్ది మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారి తెంపరితనాన్ని సూచిస్తుంది.డీజీపీగా వచ్చిన హరీష్ గుప్తపై తొలుత ఆరోపణలు రాలేదు. కానీ ఎవరి ఒత్తిడికి లొంగారో కానీ పిన్నెల్లిని అరెస్టు చేయడం కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇలా చేసిన పోలీసులకు ఇక్కట్లు తప్పవు. 2009 లో ఏ అధికారిని మార్చినా వైస్ రాజశేఖరరెడ్డి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మాదిరి వ్యవహరిస్తూ ఏ అధికారిని మార్చి, ఎవరిని పెట్టుకున్నా ప్రత్యేకించి స్పందించకపోవడం విశేషం.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత రచ్చ చేసింది అందరికి తెలుసు. కేవలం టీడీపీ కూటమికి సాయపడడం కోసం ఈ అధికారులు తమ కెరీర్ ను దెబ్బతీసుకుంటున్నారనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను కింద పడేసిన ఘటనకు సంబంధించి ఈసీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఎడిట్ అయి టీడీపీ నేత లోకేష్ వద్దకు చేరడం, దానిని ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టడం, కేవలం దానిపై ఆధారపడి ఈసీ పిన్నెల్లిపై కేసు పెట్టాలని నిర్ణయించడం వివాదాస్పదం అయింది. అదే టైమ్ లో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి టీడీపీ వారు బయటకు తోసేసి దౌర్జన్యం చేసిన వీడియోలను వైఎస్సార్‌సీపీవారు ఈసీకి పంపినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది.మరో సంగతి చెప్పాలి. టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి, ప్రభాకరరెడ్డిలు వేర్వేరు కేసుల్లో చిక్కి పోలీసులకు దొరకకుండా పారిపోతే కనీసం ఒక్క ముక్క రాయని ఎల్లో మీడియా, పిన్నెల్లిపై మాత్రం కక్ష కట్టి పరార్ అంటూ పెద్ద, పెద్ద కథనాలు వండి వార్చింది. అంతేకాదు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఈసీ వారిని బదిలీ చేయడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడు వంటి పత్రికలు మరీ అథమ స్థాయికి దిగజారి డీజీపీని బదిలీ చేసినా, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదంటూ పెద్ద, పెద్ద స్టోరీలు అల్లింది. అంటే ఈయనను కూడా తొలగిస్తే కౌంటింగ్ సమయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్నది టీడీపీ, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి భావన కావచ్చు.రాధాకృష్ణ తీరు మరీ విడ్డూరం. ఆయనేమో రాజకీయ రొచ్చులో, అవినీతి బురదలో నిండా మునిగి ఉంటారు. జవహర్ రెడ్డి వంటి అధికారులపై మరకలు పూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారట. జగన్ దగ్గరకు వచ్చాకే పాడయ్యారట. ఇంత చెత్తగా వార్తలు రాసే ఆంద్రజ్యోతిని ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ సమయంలో జవహర్‌ను తప్పించి తమకు కావల్సిన అధికారిని ఎవరినైనా పెట్టించుకుని అవకతవకలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఉన్నారేమో తెలియదు కానీ, చెత్త వార్తలు రాయడానికి పోటీపడుతున్నారు. జవహర్ రెడ్డి బదిలీ ఒక్క విషయాన్ని మాత్రం ఈసీ ఇంకా అంగీకరించలేదు. దాంతో ఈనాడు, ఇతర ఎల్లో మీడియా జవహర్ రెడ్డి పై కక్ష కట్టి చోటా, మోటా నేతలతో ఆయన మీద ఆరోపణలు చేయించి, వాటిని తమ మీడియాలో పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. బహుశా గతంలో ఇంత నీచమైన రాజకీయం, జర్నలిజం చూడలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. ఆ సంగతి మరిచి విర్రవీగితే వారికే నష్టం.మరో సంగతి చెప్పాలి. పోస్టల్ బాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశం అంతటికి ఇచ్చిన గైడ్ లైన్స్ ను కాదని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా కొత్త ఆదేశం ఇవ్వడం వివాదం అయింది. మీనా తప్పును సరిచేసుకోకపోతే ఆయనపై కూడా సందేహాలు వస్తాయి. గతంలో 2009లో ఎన్నికలు ఫలితాలు వచ్చి మరోసారి ప్రభుత్వం రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి ఎస్.ఎస్.పీ యాదవ్ ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు కూడా తనపై ద్వేషంతో టీడీపీ కూటమి బదిలీ చేయించిన అధికారులందరిని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ పదవులలోకి తీసుకుంటారన్నది కూడా నిజం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా ఫోన్లు ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ పోలీస్ అధికారి ప్రణీతరావు వాంగ్మూలం ఇచ్చాడు. మొత్తం 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించాడు. వాంగ్మూలం నివేదిక దర్యాప్తు అధికారులు బయటకు విడుదల చేయగా.. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు.. ఇలా మొత్తం 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు చెప్పాడు. వీళ్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం టాప్ చేసినట్లు పేర్కొన్నాడు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టం ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడ్డాం. రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ కొనసాగించాం. ఎనిమిది ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నా. అధికారికంగా మూడు ఫోన్లు వినియోగించా. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు ట్యాపింగ్‌ను మానిటరింగ్ చేశాం. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నాం.పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించాం.ఇక.. ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నాం. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ లో సహాయంతో టాపింగ్ ని విస్తృతంగా చేసాం. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాపింగ్‌ని ఆఫ్ చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పాడు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ కోసం ఏ ఒక్కరినీ వదల్లేదు!ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకొచ్చాం. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేశాం. అందులో 17 హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. ఆ 17 హార్డ్ డిస్క్ లను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేశాం. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్ తో ఐడీపీఆర్(Inter-Domain Policy Routing) డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసాం. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌ట్యాప్స్.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు అన్నింటిని కూడా నాగోల్, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశాం. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్‌లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేశాం. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇచ్చాడు.స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును మార్చి రెండో వారంలో ప్రత్యేక బృందం సిరిసిల్లలో అరెస్ట్ చేసింది.
సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వై ఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ పేర్కొంది.అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని.. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది.
T20 WC: ఓపెనర్‌గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొదటి బ్యాచ్‌లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు.మిగిలిన వాళ్లలో బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బెటర్‌ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. వరల్డ్‌కప్ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కాగా మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ శర్మ వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఓపెనర్‌గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!‘‘వరల్డ్‌కప్ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్ యాదవ్) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి. నిజానికి రోహిత్ స్పిన్ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే వాళ్లు మిడిల్ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.అయితే, ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లకు మాత్రమే ఈ ఓపెనింగ్ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024
హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!
హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్‌గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్ ఏంటి అనేది ఎపుడూ హాట్ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటి అవి నీళ్లా? లేక బంగారమా? ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఎంతయినా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ ముఖేష్ భార్య కదా. తనకు తక్కువేంటీ? అనుకునే వాళ్లున్నారు. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే అని కూడా ప్రచారం చేఉశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం చేశారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఈ వాటర్‌కు అంత క్రేజ్ ఉందని ప్రచారం చేశారు. దీనిపై ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారు. మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ.. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చేశారట. రూ. 49 లక్షల వాటర్ బాటిల్ కథకాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమె ఓ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. ఈ బాటిల్ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఖరీదైన నీళ్లలాగే.. ఖరీదైన బాటిల్ గురించి కూడా నీతా ఏదో ఒక స్పష్టత ఇస్తారేమో.
బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
లక్నో: లోక్‌సభ ఎన్నికల వేళ యూపీ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఓ కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.వివరాల ప్రకారం.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రిజ్‌భూషణ్ కుమారుడు, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఫార్చ్యూనర్ కారు(UP 32 HW 1800) బుధవారం అతి వేగంతో వెళ్తూ ఓ బైక్‌ను ఢీకొట్టింది. హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బైక్‌పై ప్రయాణిస్తున్న రెహాన్, షెహజాద్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పాదచారులు గాయపడ్డారు. కాగా, కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉంది. BREAKING: Two killed as a car in Brijbhushan Singh’s son Karan Bhushan’s convoy runs over a motorcycle in Gonda. Two deaths confirmed, one grievously injured and hospitalised. pic.twitter.com/50K3CWcdi6— Prashant Kumar (@scribe_prashant) May 29, 2024 ఇక, ఈ ప్రమాదంలో ఫార్చ్యూనర్ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోకి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుకుకోవడంలో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం కారు వదిలేసి వారు పారిపోయారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న సీహెచ్‌సీకి తరలించి వైద్య చికిత్స అందించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రమాదం సందర్భంగా కరణ్ భూషణ్ కాన్వాయ్ ఉన్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.మరోవైపు.. ప్రమాదం అనంతరం ప్రజలు ఆగ్రహంతో సీహెచ్‌సీని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతుడు రెహాన్ ఖాన్ తల్లి చందాబేగం కల్నల్‌గంజ్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో కూడా కరణ్ భూషణ్ ఇదే తీరుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. యూపీలో అతి వేగంగా కారు నడిపి రైతుల మీదకు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా పలువురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన అప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
జూన్ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.ఎన్నికల పోలింగ్ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా.. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో! పార్టీల తీరు ఇలా..ఏపీలో వైఎస్సార్సీపీలో జోష్ కనిపిస్తోంది. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ అధికారికంగా లండన్‌పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు.
తప్పక చదవండి
- 16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
- నీటి వృథాపై ఢిల్లీ జల్‌బోర్డు కీలక నిర్ణయం
- పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
- అమీర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ సినిమా.. నేరుగా ఓటీటీలోనే విడుదల
- T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
- సుధీర్ బాబు సినిమా.. మిస్డ్ కాల్‌తో ఐఫోన్, జీప్ గెలుచుకోండి
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా పేరెంట్స్!
- కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
- నీటి వృథాపై ఢిల్లీ జల్‌బోర్డు కీలక నిర్ణయం
- పార్టీనా?.. కోడలు పిల్లనా?.. సంకటంలో శిబు సోరెన్?
సినిమా
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేటు పెంచేశాడు. తాను ఇప్పటివరకు తీసుకుంటున్న పారితోషికం ఒకెత్తయితే తర్వాత చేయబోయే మూవీ కోసం మాత్రం ఊహించని మొత్తం అందుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ చరణ్ రెమ్యునరేషన్ ఎంత పెంచాడు? ఏంటి సంగతి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: బాలకృష్ణ చీప్ బిహేవియర్.. హీరోయిన్ ని తోసేసి, మద్యం తాాగుతూ)'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అస్సలు అర్థం కాలేదు. అయితే ఈ ఏడాది అక్టోబరులోనే ఉండొచ్చని దిల్ రాజు కూతురు తాజాగా రివీల్ చేసింది. ఇకపోతే ఈ మూవీలో చేస్తున్నందుకు గానూ రూ.90 కోట్ల పారితోషికం చరణ్ అందుకుంటున్నాడట.దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. 'RC16' వర్కింగ్ టైటిల్. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం చరణ్‌కి ఏకంగా రూ.125 కోట్ల మేర పారితోషికం ఇవ్వబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో చరణ్ ఒకడు అవుతాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్.. ఇండియాకు రావాలంటూ ట్వీట్
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన వాడిన కారు పేరు బుజ్జి. ఇప్పుడు అందరి ఆసక్తి బుజ్జి మీదే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బుజ్జి గురించి ఆరా తీసున్నారు.ఇప్పటికే బుజ్జి వాహనాన్ని నాగచైతన్య డ్రైవ్ చేసి తన అనుభవాన్ని పంచుకున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన ఎక్స్ పేజీలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది.' అని నాగ్ అశ్విన్ తెలిపారు.కల్కి సినిమా గురించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్‌కు ఎలాన్ మస్క్ నుంచి ఏదైనా సమాచారం వస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి తప్పకుండా చర్చ జరుగుతుంది. నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ చాలామంది ఇండియన్స్ కూడా ఎలాన్ మస్క్‌ను అభ్యర్థిస్తున్నారు. తక్కువ కాలంలో ఇండియన్ ఇంజనీర్స్ తయారు చేసిన రోబోటిక్ వాహనాన్ని ఎలాన్ మస్క్ డ్రైవ్ చేయాలని ఎక్స్ వేదికగా వారు కోరుతున్నారు.Mr @elonmusk you must try this craziest #Bujji pic.twitter.com/vouOMS7DX7— Prabhas Fan (@ivdsai) May 29, 2024
హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!
హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్‌గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Sooseki Song: అదిరిపోయిన ‘కపుల్ సాంగ్’
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప..’ సాంగ్ విడుదలై సూపర్ డూపర్ హిట్టయింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాగే ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయ ఘోషాల్ అద్భుతంగా ఆలపించింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది.
ఫొటోలు
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్పే లక్ష్యంగా..(ఫొటోలు)
Geetha Madhuri: సింగర్ గీతామాధురి కూతురు... ఎంత పెద్దదైంది, దిష్టితగిలేను! (ఫోటోలు)
Shivani Rajashekar: శివాని రాజశేఖర్ క్యూట్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
క్రీడలు
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్‌కప్‌లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్‌లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్‌గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్‌లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్‌తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.
పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై ట్రోల్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను షేర్ చేయడమే ఇందుకు కారణం.వివరాల్లోకి వెళితే.. హమాస్ (పాలస్తీనాలో అధికారిక పార్టీ) నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు జరుపుతుంది. ఈ దాడుల్లో 37 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఈ దాడుల అనంతరం రఫా నగరం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. విశ్వవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు రఫా నగరాన్ని హైలైట్ చేస్తూ పాలస్తీనాపై సానుభూతి చూపిస్తున్నారు.Meet Ritika Sajdeh, wife of Rohit Sharma.“Did she ever talk about Kashmiri Pandits?”-No“Did she ever talk about the vιolence happening by a specific community in India?”-No“Did she ever raise her voice for Hindus being persecuted in Pakistan and Bangladesh?”-No“Did she… pic.twitter.com/SFNrMHOtAM— Mikku 🐼 (@effucktivehumor) May 28, 2024టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక కూడా పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.BIG NEWS 🚨 Rohit Sharma’s wife Ritika Sajdeh removes ‘All Eyes On Rafah’ Instagram story after facing backlash from Hindus 🔥🔥She had posted "All Eyes on Rafah" on social media in support of Palestine.Many Hindus started questioning her about her silence on the issue of… pic.twitter.com/ayfbgjtYV6— Times Algebra (@TimesAlgebraIND) May 29, 2024రితిక ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. భారత్‌లో ఎన్ని అరాచకాలు జరిగినా స్పందించని రితిక పరాయి దేశంలోని సమస్యపై స్పందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీ పండిట్లపై దాడులు, మణిపూర్‌లో హింస, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఈమె ప్రశ్నించలేదే అని నిలదీస్తున్నారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో, భారత్‌కు ఏమాత్రం సంబంధం లేని అంశంపై రితక స్పందించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇంటి సమస్యలు (భారత్‌లో జరిగేవి) పట్టవు కాని పరాయి దేశ సమస్యలపై గళం విప్పడం ఫ్యాషన్ అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. రఫా పోస్ట్‌పై నెట్టింట తీవ్ర వ్యతిరేత ఎదురవడంతో రితిక ఈ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేసి సైలెంట్ అయిపోయింది.ఇదిలా ఉంటే, రితిక కంటే ముందు చాలామంది భారతీయ సెలబ్రిటీలు పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ లిస్ట్‌లో కరీనా కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, త్రిప్తి దిమ్రీ, సమంత రూత్ ప్రభు, ఫాతిమా సనా షేక్, స్వరా భాస్కర్, దియా మీర్జా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.
T20 WC: ఓపెనర్‌గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొదటి బ్యాచ్‌లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు.మిగిలిన వాళ్లలో బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బెటర్‌ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. వరల్డ్‌కప్ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కాగా మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ శర్మ వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఓపెనర్‌గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!‘‘వరల్డ్‌కప్ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్ యాదవ్) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి. నిజానికి రోహిత్ స్పిన్ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే వాళ్లు మిడిల్ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.అయితే, ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లకు మాత్రమే ఈ ఓపెనింగ్ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024
T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
క్రికెట్ మహా సంగ్రామం టీ20 వరల్డ్‌కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున జట్లన్నీ నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ అనంతరం గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు తమ సొంత గ్రూప్‌లోని జట్టు మినహా మిగతా మూడు గ్రూప్‌ల్లోని ఒకటి లేదా రెండు స్థానాల్లో నిలిచే ఏదో ఒక జట్టుతో (ప్రత్యర్ధి ఎవరో గ్రూప్ దశలో స్థానంపై ఆధారపడి ఉంటుంది) పోటీపడుతుంది. సూపర్-8 దశ ముగిసిన అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీస్‌ల్లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ రకంగా ప్రపంచకప్ పోటీలు జరుగుతాయి.టీమిండియా సూపర్-8కి చేరితే..ఈ ప్రపంచకప్‌లో భారత్ పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా జట్లతో గ్రూప్-ఏలో పోటీపడుతుంది. ఈ గ్రూప్‌లో పాక్ మినహా మిగతా జట్లన్నీ పసికూనలే కావడంతో భారత్ సూపర్-8కు చేరడం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. టీమిండియాకు పాక్‌పై కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారత్ గ్రూప్ టాపర్‌గా నిలవడం ఖాయం.ఈ నేపథ్యంలో సూపర్-8లో భారత్ ప్రత్యర్దులు ఎవరయ్యే అవకాశం ఉందనే అంశంపై ఓ అంచనా వేద్దాం. సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్దులుగా గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు.. గ్రూప్-సిలో తొలి స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు ఉంటుంది.ఈ లెక్కన గ్రూప్-బి నుంచి సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్ది ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో ఈ రెండు జట్లు మినహా మిగతా జట్టన్నీ (నమీబియా, స్కాట్లాండ్, ఒమన్) ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్నాయి. కాబట్టి ఆ జట్లకు సూపర్-8 దశకు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ.గ్రూప్-సి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్ పటిష్టమైన జట్లుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ గ్రూప్ నుంచి టీమిండియా ప్రత్యర్దిగా న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో సంచలనాల జట్టైన ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. ఈ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. మరో రెండు జట్లైన ఉగాండ, పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా ఆశ్చర్యమే అని చెప్పాలి.గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ను గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ గ్రూప్‌లో అన్ని జట్లకు సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉంది. బలాబలాల ప్రకారం సౌతాఫ్రికా ఈ గ్రూప్ టాపర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా నాలుగు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఏ మ్యాచ్‌లో ఎలా ఆడతాయో అంచనా వేయలేని పరిస్థితి. కాబట్టి ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టు ఏదో అంచనా వేయడం చాలా కష్టం. ఒకవేళ టీమిండియా గ్రూప్‌లో టాపర్‌గా నిలిస్తే.. గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టునే ఢీకొట్టాల్సి ఉంటుంది.సూపర్-8లో టీమిండియా ప్రత్యర్దులు (అంచనా)..గ్రూప్-బి- ఆస్ట్రేలియా (జూన్ 24)గ్రూప్-సి- న్యూజిలాండ్ (జూన్ 20)గ్రూప్-డి- శ్రీలంక (జూన్ 22)
బిజినెస్
థాయ్‌లాండ్ వీసా నిబంధనల్లో మార్పులు
పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రభుత్వ ప్రతినిధి చాయ్ వాచరోంకే మాట్లాడుతూ..‘పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ వీసా గడువు పెంచాం. దాంతోపాటు ఇతర దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవీవిరమణ పొందిన వారికి సంబంధించి వీసాలో మార్పులు చేశాం. జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. గతంలో థాయ్‌లాంట్ వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 93కు పెంచాం. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలి. ఆన్-అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించాం. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను సడలించాం. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఒక సంవత్సరం అదనంగా ఉండవచ్చు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేకవీసాలు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 పూర్తి ఏడాదికిగాను రికార్డు స్థాయిలో 40 మిలియన్ల విదేశీ రాకపోకలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9లక్షల కోట్లు) దేశఖజానాకు చేరుతుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో థాయ్‌లాండ్‌కు 39.9 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు.
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఇందుకోసం ఇన్ఆర్గానిక్ అవకాశాలను (వేరే సంస్థను కొనుగోలు చేయడం వంటివి) పరిశీలిస్తామని సంస్థ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలి పారు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని వివరించారు.అగ్ని ప్రమాద బీమా వంటి జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఎల్ఐసీకి నైపుణ్యాలు లేవని, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మా త్రం చేయగలదని మొహంతి తెలిపారు. ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరించి ఒకే గొడుగు కింద లైఫ్, జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేసే విధంగా బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సులు జారీ చేయొచ్చనే అంచనాల నేపథ్యంలో మొహంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆర్బీఐ మొబైల్ యాప్
ముంబై: రిటైల్ మదుపుదార్లు ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడాన్ని సులభతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. దీనితో పాటు నియంత్రణపరమైన అనుమతులకు సంబంధించి ప్రవాహ్ పోర్టల్, ఫిన్‌టెక్ సంస్థల డేటా కోసం ఫిన్‌టెక్ రిపాజిటరీని ప్రారంభించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఈ మూడింటిని ఆవిష్కరించారు. ప్రస్తు తం చిన్న ఇన్వెస్టర్లు రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ–సెక్)లో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది. ఇందుకోసం రిటైల్ డైరెక్ట్ స్కీము కింద ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంటును తెరవాల్సి ఉంటోంది. దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి, ఐవోఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 60 ఫారంలతో ప్రవాహ్.. నియంత్రణ సంస్థపరమైన వివిధ రకాల అనుమతులకు సంస్థలు, వ్యక్తులు దర ఖాస్తు చేసుకునేందుకు ప్రవాహ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. వివిధ విభాగాలకు సంబంధించి ఇందులో 60 అప్లికేషన్ ఫారంలు ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అప్లై చేసుకున్న వారు నిర్దిష్ట దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు, అలాగే దానిపై తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణీత వ్యవదిలో దరఖాస్తుదారుకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఫిన్‌టెక్ రిపాజిటరీ.. ఫిన్‌టెక్ సంస్థలు, వాటి కార్యకలాపాలు, టెక్నాలజీపరంగా చేకూరే ప్రయోజనాలు మొదలైన డేటాకి ఈ రిపాజిటరీ కేంద్రంగా ఉంటుంది. ఫిన్‌టెక్ కంపెనీలను నియంత్రణ సంస్థ కోణంలో మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, వాటికి తగిన విధానాలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడగలదు. నియంత్రిత సంస్థలు, ఆర్బీఐ నియంత్రణలో లేని ఫిన్‌టెక్‌లు కూడా ఈ రిపాజిటరీకి సమాచారం సమరి్పంచవచ్చు.మరోవైపు, ఆర్బీఐ నియంత్రణలో మాత్రమే ఉన్న సంస్థలు (బ్యాంకు లు, బ్యాంకింగ్‌యే తర ఆర్థిక సంస్థలు) వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి సంబంధించిన వివరాల కోసం ఎంటెక్ (ఈఎంటెక్) రిపాజిటరీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఫిన్‌టెక్, ఎంటెక్ రిపాజిటరీలను ఆర్బీఐ అనుబంధ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) నిర్వహిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది.
వీడియోలు
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించిన సుప్రీం
1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు
మళ్లీ జగనే.. నో డౌట్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేసిన YSRCP నేతలు
పాపం పసివాళ్లు
చైల్డ్ ట్రాఫికింగ్ కేసు..అక్షర జ్యోతి ఫౌండేషన్ సాహసం..
ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
సూర్యాపేట జిల్లా అమీనాబాద్ లో క్షుద్రపూజల కలకలం
గాజులరామారంలో అడవి పిల్లి కలకలం
భయపెడుతున్న చెడ్డి గ్యాంగ్
ఫ్యామిలీ
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్‌కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్‌ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని UN మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!)
వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!
మనం తెలియని ప్రదేశాలలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనలో మనకే చిన్నగా భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం మరింత రెట్టింపవుతుంది. ప్రయాణించే దారిలో ఎలాంటి సంఘటనలు తారసపడుతాయో అనే సందేహం మనసులో ఏదో మూలన ఉండకమానదు. అదేవిధంగా ఈ వీడియోలో ఎదురైన ఈ సొరంగమార్గం కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి!వామ్మో ఇది పాతాళమేనా అన్నట్లుగా..ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా తనకు ఓ కొండ ఎదురైంది. ఆ కొండ దాటడానికి సొరంగ మార్గం ఒక్కటే దిక్కు. చేసేదేమిలేక కారుని ముందుకు నడిపాడు. కారు ఆ గుహ మార్గంలోకి ప్రయాణించింది. అంతా చీకటిమయం. ఎదురుగా ఏముందో కనిపించే వీలులేదు. కారుకు ఉన్న లైట్లే అతని ధైర్యం. ఆ మార్గం కైలాసం ఆడుతున్నట్లుగా అన్నీ వంక మలుపులే. అక్కడక్కడా మనసు కుదుటపడేలా.. లెఫ్ట్, రైట్ టర్నింగ్ సంకేతాలు. ఇవేగానీ లేకపోతే ముందుకు సాగకపోవడమో, ప్రమాదం జరగడమో ఖాయం.వెళ్తున్నా కొద్ది సొరంగ మార్గం తనకు తానే దారి పొడవు పెంచుతున్నట్లుగా సాగుతూనే ఉంది. ఆ గుహలోంచి బయట ఎప్పుడు పడాల్లా అనేవిధంగా భయంతో కూడిన ఆతృత. కారు పైభాగం గుహకు తాకుతున్నట్లుగా ఆలోచన. చిమ్మని చీకటి... మరోసారి మళ్లీ ఈ దారిలోకి వద్దామా? బయటికి మార్గం ఉందా? లేక ఎక్కడైనా ఇరుక్కుపోతానా? వెనక్కి వెళ్లలేం! ముందుకే తప్ప మరేదిక్కులేదు! ఇప్పుడెలా? వెళ్తున్నానుగా... అనే ఆలోచనలు లోలోనే దిగమింగుతూ తేరుకునేలోపు సొరంగమార్గం ముగిసిపోయి.., బయటిదారి ఎదురయ్యేసరికి ప్రాణం గుప్పిట్లో దాచుకుని హమ్మయ్య!! అనుకున్నాడు ఆ డ్రైవర్. View this post on Instagram A post shared by Usha Vardhan (@usha.vardhan.96) ఇవి చదవండి: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
వేసవిలో మామిడి పండ్ల జాతర అన్నట్లుగా రకరకాల వెరైటీలు వస్తుంటాయి. మామిడి పండ్ల అంటే ఇష్టపడని వారెవరూ ఉంటారు చెప్పండి. అయితే మనం మామిడి పండ్ల తొక్కును పడేసి తినేస్తుంటాం. కానీ మామిడి పండ్ల తొక్కలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవని అంటున్నారు. అవేంటో చూద్దామా..!మామిడి తొక్కలో ఏ, సీ, కే, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం, ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫైనాల్స్లు ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు 2008లో ప్రచురితమైన ఓక్లహోమ్ స్టేట యూనివర్శిటీ అధ్యయనంలో మామిడి తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే గాక బరువు కూడా అదుపలో ఉంటుందని తేలింది. ముఖ్యంగా నామ్ డాక్ మై, ఇర్వ్విన్ అనే రెండు మామిడి రకాల తొక్కలు శరీరంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. పండ్లును చక్కగా తినేశాక ఆ మామిడి తొక్కలను ఏం చేయాలనే కదా..! వాటిని పడేయకుండా చక్కగా రకరకాల రెసీపీలు చేసుకుని తినేయండి అని చెబుతున్నారు నిపుణులు. మామిడి తొక్కలతో చేసే రెసీపీలు ఏంటంటే..మామిడి తొక్క టీ: మామిడితొక్కలను చక్కగా నీటిలో ఉడికించి, కొంచెం తేనే, నిమ్మకాయ వేసుకుని టీ మాదిరిగా తాగితే ఆ టేస్టే వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. ఈ టీ వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.మామిడి తొక్క ఊరగాయ: తొక్కతోపాటు ముక్కలు చేసుకుని ఉప్పులో ఊరబెట్టి, రోజ ఎండలో ఆరనియాలి. ఇలా వాటిలో నీరు మొత్తం ఇంకిపోయేలా ఆరనిచ్చి చక్కగా పచ్చడి మాదిరిగా పట్టుకోవడం లేదా వాటిని భద్రపర్చుకుని పప్పులో వేసుకుని తిన్న బాగుంటాయి. మామిడి తొక్కపొడి: ఎండలో ఎండబెట్టిన మామిడి తొక్కను పొడి చేసుకోవాలి. దీన్ని మెరినేడ్లు, సూప్‌లు, కూరల్లో జోడిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మామిడి తొక్కను ఆహారంలో భాగం చేసుకున్నట్లువుతుంది కూడా. అంతేగాదు ఈ తొక్కల పొడిని బ్యూటీ టోనర్‌గా కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ వాష్‌గా కూడా ఉపయోగించొచ్చ. బ్యూటీ స్క్రబ్: మామిడి తొక్కల పొడిని తేనే లేదా పెరుగులో కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించొచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి తాజాగా ఉంటుంది. పైగా చర్మం కూడా రిఫ్రెష్‌గా ఉంటుంది. జుట్టు సంరక్షణ: ఈ మామిడి తొక్కలను కలిపిని నీటితో షాంపు వేసుకుని తలను శుభ్రం చేసుకుంటే..జుట్టు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు చర్మం కుచ్చులా ఉండి మెరుస్తూ ఉంటుంది. స్కిన్ టోనర్: మామిడి తొక్కలను నీటిలో వేసి మరిగించిన ద్రవాన్ని వడగట్టి చర్మానికి టోనర్‌గా ఉపయోగించొచ్చు. ఇది ముఖంపై ఉండే రంధ్రాను దగ్గర చేయడమే తాజాగా ఉండేలా చేస్తుంది.(చదవండి: మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు అన్ని మ్యాంగో మయం..!)
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
న్యూస్ పాడ్‌కాస్ట్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..
సాక్షి, హైదరాబాద్: పాలుతాగే పసికందులను అపహరించి, విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులు, క్లినిక్‌లలో పనిచేసే ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకొని, దంపతుల సమాచారం సేకరించి, మధ్యవర్తుల సహాయంతో ఐదేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఢిల్లీ, పుణే నగరాల్లో రోజుల శిశువులను ఎత్తుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్క పసికందును రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పీవీ.పద్మజ, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులతో కలిసి రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు.👉ఈనెల 22న పీర్జాదిగూడలో మూడు నెలల పాపను విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు స్థానిక ఆర్ఎంపీ శోభారాణితోపాటు స్వప్న, షేక్ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసును రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్నోజిగూడకు చెందిన బండారి హరిహర చేతన్– బండారి పద్మ, కుషాయిగూడకు చెందిన యాట మమత, ఉప్పుగూడకు చెందిన ముధావత్ రాజు, విజయవాడకు చెందిన బలగం సరోజ, ముధావత్ శారద, ముంతాజ్, జగన్నాథం అనురాధలను పట్టుకున్నారు. ఈ మధ్యవర్తుల సహాయంతో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో 60 మంది శిశువులను విక్రయించారు. తాజా కేసులో 16 మంది పిల్లలను విక్రయానికి పెట్టగా.. ఏడుగురిని ఏపీ, 9 మందిని తెలంగాణకు చెందిన దంపతులు కొనుగోలు చేశారు. మధ్యవర్తులను విచారించిన పోలీసులు 16 మంది చిన్నారులను కాపాడారు. శిశువిహార్‌కు తరలించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలున్నారు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందేవారు. పరారీలో ఉన్న నిందితులు కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం పోలీసులు గాలిస్తున్నారు.ముహూర్తం చెబితే పిల్లాడు డెలివరీవాట్సాప్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పిల్లల ఫొటోలు పంపిస్తారు. శిశువుల రంగు, ముఖ కవలికలను బట్టి ఎంపిక చేసుకుంటారు. ఫలానా ముహూర్తానికి పిల్లాడు కావాలని చెబితే చాలు ఆ సమయానికే పిల్లాడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. రోజుల వయస్సున శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా, పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులని భావిస్తారు.పిల్లలకు దూరం చేయకండి పిల్లలను రెస్క్యూ హోంకు తరలిస్తుండగా అప్పటివరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్ ముందు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. పెళ్లై 12 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదని, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి దిక్కుతోచని స్థితిలో రెండున్నర ఏళ్ల క్రితం ఆరు రోజుల పసికందును కొనుగోలు చేశామని రావులపాలెంకు చెందిన ఓ జంట తెలిపారు. రూ.3.5 లక్షలు ఖర్చు చేసి 21వ రోజును ఘనంగా చేశామన్నారు. రూ.కోట్లాది ఆస్తిపాస్తులను వారసుడి పేరు మీద రాసేందుకూ సిద్ధమయ్యామని చెప్పారు. ఇలాంటి సమయంలో పిల్లాడిని పోలీసులు తమ నుంచి దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు.
ట్యాపింగ్‌లో కదలిక!
నిజామాబాద్, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో జిల్లాలోనూ ప్రకంపనలు వస్తున్నాయి. ప్రతిపక్షాల కదలికలను పసిగట్టి, చెక్ పెట్టడానికి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్‌కు సహకరించిన జిల్లాకు చెందిన అధికారులు, నాయకుల్లో గుబులు మొదలైంది.అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడినుంచి బరిలో నిలిచారు. రేవంత్‌రెడ్డి తరఫున ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకున్నారు. మరోవైపు బీజేపీ అభ్యరి్థగా కె.వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి వైపు ఓటర్ల మొగ్గు ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకుని బీజేపీతోపాటు కాంగ్రెస్‌లపైనా అప్పటి ప్రభుత్వం నిఘా పెట్టింది.వెంకటరమణారెడ్డి, కొండల్‌రెడ్డిల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. కాగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఏఎస్పీ భుజంగరావు వాగ్మూలాన్ని సిట్ ఇటీవల రికార్డు చేసింది. బీఆర్ఎస్ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ పనిచేసినట్లు ఆయన అంగీకరించడం గమనార్హం. ఆయన కామారెడ్డి నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాలనూ వెల్లడించినట్లు తెలిసింది.హోటల్లో వార్ రూం.. ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్‌ను కామారెడ్డికి పంపారని, ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేశారని ప్రాథమిక విచారణలో సిట్ గుర్తించింది. వార్ రూంను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరి పాత్ర ఏమిటనే పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించి రెండు నెలల క్రితమే నివేదికను ‘సిట్’కు అందించినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహారాలపై నిఘా పెట్టడం కోసం కామారెడ్డికి వచ్చిన ట్యాపింగ్ గ్యాంగ్ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.అక్కడే వార్ రూంను ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలను నడిపించారు. అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఆర్థిక మూలాలు, ఇతర విలువైన సమాచారాన్ని తెలుసుకుని అధికార పక్ష నేతలకు అందించడం లాంటివి చేశారని తెలుస్తోంది. వార్ రూం ఇన్‌చార్జీగా వ్వవహరిస్తూ, ఇక్కడకు వచ్చిన గ్యాంగ్‌కు అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పంచిన ముఖ్య నేతలు ఎవరు, ఇక్కడి అధికారులు ఎవరైనా సహకారం అందించారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని బీఆర్ఎస్ నేతలు, వారికి సహకరించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.ఆరోపణలకు బలం..ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు బలం చేకూరేలా ఎన్నికల సమయంలో పలు సంఘటనలు చో టు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల ముందు జిల్లా కాంగ్రెస్‌లో ముఖ్య నాయుకుడైన గూడెం శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. ఇందులో రూ.58 లక్షలు ప ట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రే వంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి నివాసం ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి.ఆయనను గృహ నిర్భంధం కూడా చేశారు. అంతే కాకుండా విద్యానగర్‌కాలనీలో నివసించే ప్ర స్తుత మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వా గ్వాదం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌తోనే వివరాలు తెలుసుకుని దాడులు చేశారని సిట్ విచారణలో తేలినట్లు సమాచారం.
ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ – పంగిడి రోడ్డులో హరియాతండా సమీపాన చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు కన్నుమూశారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న భర్త తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. తమ అల్లుడే ముగ్గురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బావోజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరగగా, నాలుగు, మూడేళ్ల కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయితే, ప్రవీణ్ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పది రోజుల పాటు సెలవు పెట్టిన ప్రవీణ్ భార్యాపిల్లలతో సహా బావోజీ తండాకు వచ్చాడు. ఆధార్ కార్డులో మార్పుల కోసం..ప్రవీణ్ – కుమారి దంపతుల చిన్నకుమార్తె ఆధార్ కార్డులో మార్పులు చేయించేందుకు మంగళవారం నలుగురు కలిసి కారులో మంచుకొండ వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా హరియాతండా సమీపాన మూల మలుపు వద్ద చెట్టును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమారి, ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే, కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొనగా.. ఆ మార్గంలో ఎవరూ రాకపోవడంతో గంటకు పైగా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అటువైపుగా వెళ్తున్న వారు రోడ్డు పక్కగా దూసుకెళ్లిన కారులో లైట్లు వెలుగుతుండడంతో చూసి బయటకు తీసేసరికే కుమారి, ఆమె పిల్లలు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు సమాచారం అందుకున్న ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, రఘునాథపాలెం సీఐ శ్రీహరి ఘటనాస్థలికి వెళ్లి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదం కాదు.. అల్లుడే చంపేశాడురోడ్డు ప్రమాదంలో కుమారి, ఆమె కుమార్తెలు కన్నుమూశారనే సమాచారంతో కుమారి తల్లిదండ్రులు, బంధువులు ఏన్కూరు మండలం రంగాపురం తండా నుంచి పెద్దసంఖ్యలో పెద్దాస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుమార్తె, మనవరాళ్ల మృతదేహాలను చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఇది రోడ్డు ప్రమాదం కాదని తమ అల్లుడే ముగ్గురిని హత్య చేశారని కుమారి తల్లిదండ్రులు హరిసింగ్ – పద్మ ఆరోపించారు. ముగ్గురి మృతదేహాలపై ఎక్కడా రక్తం వచ్చిన దాఖలు లేవని వారు పేర్కొన్నారు. అంతేకాక డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ మాత్రమే గాయాలతో బయటపడడం ఏమిటని ప్రశ్నించారు. ప్రవీణ్ డాక్టర్ కావడంతో ఐదేళ్ల క్రితం రూ.24 లక్షల కట్నంగా ఇచ్చి వివాహం జరిపించామని, కానీ ఇద్దరు అమ్మాయిలే జన్మించడంతో మగపిల్లాడు లేడని తరచుగా తమ కుమార్తెను వేధించేవాడని ఆరోపించారు. అంతేకాక వివాహేతర సంబంధాలతో నిత్యం వేధించేవాడని వాపోయారు. గత 20 రోజుల క్రితం కూడా ఓ యువతితో కేరళ వెళ్లొచ్చాడని, ఈనెల 25న వివాహ వార్షికోత్సవానికి కేక్ తీసుకురావాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈమేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కుమారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. అలాగే, ప్రమాదంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. మృతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.