-
కొడుకును ఎలా కాపాడుకున్నాడంటే..?
-
హాలీవుడ్ రేంజ్లో ఆ తండ్రి సాహసం
జార్జియా: ఒక మనిషి ఎంతెత్తుకు ఎదిగినా.. ఎన్ని ప్రభావాలకు లోనవుతున్నా పేగు బంధం ముందుమాత్రం బానిసవ్వాల్సిందే. ఆ సమయంలో భావోద్వేగాలే పనిచేస్తాయి తప్ప బతుకు గుర్తుకురాదు. అందుకే మానవ సంబంధాలు గొప్పవని అంటుంటారు. ఈ మాటలు నిజమేనని మరోసారి రుజువు చేశాడో కన్నతండ్రి. తన కుమారుడిని రక్షించుకునేందుకు తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వేగంగా దూసుకెళుతున్న కారుమీదకు దూకాడు. అతడు కిందపడేసేందుకు కారును అటుఇటూ తిప్పిన పట్టు విడవకుండా కారునే వేలాడుతూ చివరికి రన్నింగ్‌లోనే అద్దం పగులగొట్టి కారును ఆపేసి ఆ కారు దొంగ అంతు చూశాడు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించే రేంజీలో ఉన్న వీడియో ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వివరాల్లోకి వెళితే జార్జియాలో మాల్కోమ్ మిల్లోన్స్ అనే వ్యక్తి కారులో గ్యాస్ కొట్టించేందుకు దిగగా అతడి భార్య బిల్లు చెల్లించేందుకు స్టోర్ లోకి వెళ్లింది. ఆ కారు బ్యాక్ సీటులో తన కుమారుడు ఉన్నాడు. ఇంతలో అతడి కళ్లుగప్పిన ఓ కారు దొంగ కారులోకి వెళ్లి ఏకంగా కారునెత్తికెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో మాల్కోమ్ అమాంతం కారుపై దూకి ఓ 250 మీటర్లపాటు పోరాడుతూ వెళ్లాడు. ఎట్టకేలకు ఆ దొంగను నిలువరించి అతడి చేయి విరగ్గొట్టి పోలీసులకు అప్పగించాడు. తన తండ్రి చేసిన సాహసానికి ఆ ఎనిమిదేళ్ల బాలుడు, భార్య అక్కడి చుట్టుపక్కలవారు ముగ్దులై పోయారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
Advertisement