-
ఉచితంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్ ఇంగ్లీష్
సాక్షి, హైదరాబాద్: ఉపాధికి తప్పనిసరి అర్హతగా మారుతున్న ఇంగ్లీషులో మరింత మంది నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ వ్యవస్థాపకుడు, చీఫ్ కోచ్ డాక్టర్ ఏ. చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం చాలా ప్రశంసనీయమన్నారు. రేపటి తరం పిల్లలంతా ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు కనక.. వారితో మ్యాచ్ కావాల్సిన నిన్నటితరం పెద్దలు, ఇంగ్లీషు భాషా నైపుణ్య లోపాల కారణంగా మెరుగైన అవకాశాలు అందుకోలేని యువత.. వీరందరి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘ అని చిరంజీవి తెలియజేశారు. ఈజీ ఇంగ్లీష్ ద్వారా రాష్ట్రంలోని యువతకు కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఉచితంగా.. అందరికీ ‘‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్‌ను 1994లో ప్రారంభించాం. విశాఖపట్నంలో ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో 18 శాఖలుగా విస్తరించాం. ప్రస్తుతం ఆన్లైన్ మాడ్యూల్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. మా సంస్థకు 30 ఏళ్లయిన సందర్భంగా అందిస్తున్న ఉచిత ఇంగ్లిష్ నైపుణ్య కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే చాలు. వారి మొబైల్‌కు రిజిస్ట్రేషన్ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్ ఫోన్‌కు లింకును పంపిస్తాం". అదే విధంగా పది అంశాల్లో శిక్షణ.. "ఈజీ ఇంగ్లీష్ ద్వారా స్పొకెన్ ఇంగ్లీష్ తరగతులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్, పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్‌పై శిక్షణ ఇస్తాం. ప్రతి రోజు శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష పెట్టడంతో పాటు స్టడీ మెటీరియల్‌నూ ఇస్తాం. ఈ కార్యక్రమాలను ఆన్లైన్ పద్దతిలో లైవ్‌లో అందిస్తాం. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్స్టిట్యూట్ తరపున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్‌లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలుంటే చాట్ ద్వారా జవాబులిస్తాం’’ అని చిరంజీవి తెలిపారు. ఇవి చదవండి: వారెవ్వా.. నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు! -
18 నుంచి సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ఆధ్వర్యం లోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’వినూత్నమైన శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. కాలపరిమితి: జూలై 18వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు కోర్సు ఫీజు: రూ.4,600 రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్ నం.1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)లో లేదా sakshiedge@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
45 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న నటుడు! వచ్చే వారమే ముహూర్తం!
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
వంశీకృష్ణ పై కోలా గురువులు ఫైర్
ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
బుక్కయిన బాలయ్య.. అంతా గ్రాఫిక్స్ అంటున్న ప్రొడ్యూసర్...
శృంగార తార కేసు..ట్రంప్ కు జైలు శిక్ష
KSR Live Show: మరో నిమ్మగడ్డలా ముకేశ్ కుమార్ మీనా
గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం.. నేటి ధరలు ఇవే..!
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్ చేసిన ఐటీ శాఖ
Delhi water crisis: చేతులు జోడించి కోరుతున్నా.. సీఎం కేజ్రీవాల్
Advertisement