-
కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్..
అది బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఓ కుగ్రామం. ఏలూరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గూడేనికి చేరుకోవడమే ఓ ప్రహసనం. ఎలాంటి రహదారి సౌకర్యం లేని అక్కడి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే కొయిదా గ్రామం నుంచి గోదావరి‡ నదిగుండా బోట్లో ప్రయాణించి, ఆవలి ఒడ్డు నుంచి సుమారు మూడు కిలోమీటర్లు గుట్టల నడుమ కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మొత్తం 472మంది కొండరెడ్ల ఓటర్లున్నారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో 440 ఓట్లు పోల్ కాగా 93.22శాతం ఓటింగ్ నమోదు చేసుకుని ఎలక్షన్ కమిషన్ దృష్టిని ఆకర్షించింది. అంతేనా... అధికారుల ప్రశంసలను కూడా అందుకుని దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే పోలవరం నియోజకవర్గం పరిధిలోని కాకిస్‌నూరు.వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంత గ్రామమైన కాకిస్‌నూరు గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93.22 ఓటింగ్ శాతం నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి వెళ్లిన అధికారులకు గ్రామ కొండరెడ్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అధికారులను పూలమాలలతో సన్మానించారు. వారి సహృదయతకు ముచ్చటపడిన భారత ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా అధికారులకు స్వాగతం పలికిన ఫొటోను అప్లోడ్ చేసి, వివరాలతో ట్విట్ చేశారు. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. బోటుపై వచ్చి ఓటు హక్కు వినియోగందట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్‌నూరు పోలింగ్ కేంద్రం పరిధిలోని పేరంటపల్లి, టేకుపల్లి, చినమకోలు, పెదమంకోలు గ్రామాల ఓటర్లు 440 మంది గోదావరిలో బోటుపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16,37,430 ఓటర్లున్న ఏలూరు జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సకల ఏర్పాట్లు చేశారు. కాకిస్‌నూరు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేని ఆ గ్రామంలో జనరేటర్ సమకూర్చి, తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేయించారు.ఫోన్ కవరేజ్ లేకపోవడంతో ఈ గ్రామంలో శాటిలైట్ ఫోన్ ఏర్పాటు చేశారు. ఓటర్లు వచ్చేందుకు బోటు సౌకర్యం కల్పించడమే కాకుండా ఓటింగ్‌కు ఒక రోజు ముందు వారికి ఓటింగ్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులు 12న కాకిస్‌నూరు గ్రామానికి చేరుకొని, ఇంటింటికీ తిరిగి ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను వివరించారు. ఫలితంగా ఓటింగ్ శాతం పెరిగింది. తమ గ్రామానికి దే«శస్థాయిలో గుర్తింపు రావడంపై భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు గ్రామ కొండరెడ్లు కృతజ్జతలు తెలిపారు.మా ఓటు వల్లనే ఊరికి మంచి పేరుమేమంతా ఓటు వేయడం వల్లనే మా ఊరికి మంచి పేరొచ్చింది. మా ఊరు దేశ ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. మాకు చాలా సంతోషంగా ఉంది. –సిద్ది శ్రీనివాసరెడ్డిసానా సంతోషంగా ఉందయ్యామేమంతా ఓటెయ్యడం వల్ల ఊరికే పేరు రావడం నాకు సానా సంతోషంగా ఉందయ్యా.. పెద్ద సార్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. – కోళ్ల కన్నమ్మ -
రాష్ట్రంలో 81.3% పోలింగ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3% పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ 1.2 శాతాన్ని కలుపుకొంటే ఇది 82.5 శాతమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈవో) కార్యాలయం వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించాయి. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ధృవీకరించాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ 0.6 శాతంతో కలుపుకొని 79.8 శాతం నమోదైంది. ఈసారి ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 79.40 శాతం నమోదైనట్లు మంగళవారం మధ్యాహ్నం సీఈవో ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరిగినందున ఎక్కడ ఎంత ఓటింగ్ జరిగిందో పూర్తి వివరాలు రావడానికి ఆలస్యమవుతోందని వివరించారు. మంగళవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం జిల్లాలవారీగా పోలింగ్ (శాతాల్లో)డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ : 83.19అల్లూరి సీతారామరాజు : 63.19ఏలూరు : 83.04సత్యసాయి : 82.77చిత్తూరు : 82.65ప్రకాశం : 82.40బాపట్ల : 82.33కృష్ణా : 82.20అనకాపల్లి : 81.63పశ్చిమ గోదావరి : 81.12నంద్యాల : 80.92విజయనగరం : 79.41తూర్పు గోదావరి : 79.31అనంతపురం : 79.25ఎన్టీఆర్ : 78.76కడప : 78.72పల్నాడు : 78.70నెల్లూరు : 78.10తిరుపతి : 76.83కాకినాడ : 76.37అన్నమయ్య : 76.12కర్నూలు : 75.83గుంటూరు : 75.74శ్రీకాకుళం : 75.41మన్యం : 75.24విశాఖ : 65.50 -
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ శాతం 65.67గా ఎన్నికల కమిషన్ మంగళవారం(మే14) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల మంది ఓటర్లుండగా పోలింగ్‌లో 2 కోట్ల 20 లక్షల 24 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక కోటి 11 లక్షల 91 వేల మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కోటిమంది పోలింగ్‌కు దూరంగా ఉన్నా గతంతో పోల్చితే 3 శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. అతి తక్కువగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 48.8 శాతం ఓటింగ్ జరిగింది. భువనగిరిలో అత్యధికంగా 76.78శాతం పోలింగ్ జరిగింది.నియోజకవర్గాల వారిగా పోలింగ్ ఇలా.. ఆదిలాబాద్- 74.03 పెద్దపల్లి 67.87 కరీంనగర్- 72.54 నిజామాబాద్- 71.92 జహీరాబాద్- 74.63 మెదక్- 75.09 మల్కాజ్గిరి- 50.78 సికింద్రాబాద్- 49.04 హైదరాబాద్- 48.48 చేవెళ్ల- 56.50 మహబూబ్‌నగర్- 72.43 నాగర్ కర్నూల్- 69.46 నల్గొండ- 74.02 భువనగిరి- 76.78 వరంగల్- 68.86 మహబూబాద్-71.85 ఖమ్మం - 76.09 -
శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. 38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం. నాడు జమ్మూకశ్మీర్‌లోని ఈ స్థానంలో దాదాపు 41 శాతం ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు శ్రీనగర్ నియోజకవర్గంలో జరిగాయి.సోమవారం రాత్రి 11 గంటల వరకు శ్రీనగర్‌లో 38 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి యువతకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు.ఓటింగ్‌లో పాల్గొన్న శ్రీనగర్ నియోజకవర్గ ప్రజలకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలు రాజకీయ పార్టీలు అభినందనలు తెలిపాయి. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, గండేర్బల్, పుల్వామా జిల్లాలు, బుద్గామ్, షోపియాన్ జిల్లాల్లోని 2,135 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఓటింగ్ జరిగింది.ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత 34 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 1996లో పోలింగ్ నమోదైంది. నాడు దాదాపు 41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 14.43 శాతం ఓట్లు పోలయ్యాయని, అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లో అంటే 2014లో 25.86 శాతం 2009లో 25.55 శాతం, 2004లో 18.57 శాతం, 1999లో 11.93 శాతం, 1986లో 30.086 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. Would especially like to applaud the people of Srinagar Parliamentary constituency for the encouraging turnout, significantly better than before. The abrogation of Article 370 has enabled the potential and aspirations of the people to find full expression. Happening at the… https://t.co/2DvSCnXFKR— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
లోక్‌సభ ఎన్నికలు: నాలుగు దశల ఓటింగ్ ఖాతాలో విశేషాలివే..
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొదటి, రెండవ, మూడవ, నాల్గవ దశలకు సంబంధించిన ఓటింగ్ పూర్తయ్యింది. నాలుగో దశతో దేశంలోని సగానికి పైగా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 26న రెండో దశలో 12 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 7న మూడో దశలో 11 రాష్ట్రాల్లోని మొత్తం 93 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 13న 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తంమీద ఇప్పటి వరకు దేశంలోని 379 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇంకా ఐదో దశలో 49, ఆరో దశలో 58, ఏడో దశ(చివరి)లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, గోవా, అసోం, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌లో నాలుగో దశతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.దేశంలో అతి తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన మొదటి ఈశాన్య రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది అన్రిజర్వ్డ్. ఏప్రిల్ 19న మొదటి దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. దీని తరువాత తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన రెండవ రాష్ట్రం నాగాలాండ్. ఇక్కడ కూడా ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్. తొలి దశలోనే నాగాలాండ్‌లో కూడా ఓటింగ్ జరిగింది. మిజోరంలో ఒక లోక్‌సభ స్థానం కూడా ఉంది. ఇది ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యింది. ఇక్కడ కూడా ఏప్రిల్ 19న ఓటింగ్ ప్రక్రియ జరిగింది.మొదటి దశలో అత్యధికంగా త్రిపురలో 80 శాతం ఓటింగ్ జరిగింది. బీహార్‌లో అత్యల్పంగా 48 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో త్రిపురలో గరిష్టంగా 78.63 శాతం ఓటింగ్ జరిగింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో అత్యల్పంగా 54శాతం పోలింగ్ నమోదైంది. మూడో దశలో అసోంలో అత్యధికంగా 81.71 శాతం ఓటింగ్ జరిగింది. యూపీలో అత్యల్పంగా 57.34 శాతం ఓటింగ్ నమోదైంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏప్రిల్ 19న సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. ఒడిశాలోని 147 స్థానాలకు నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి. -
టీడీపీలో భయాందోళనలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, ఆయన ప్రభుత్వం పైన ఎంతగా విష ప్రచారం చేసినా ఉపయోగంలేకపోయిందని, ప్రజలంతా వారికి మేలు చేసే జగన్ వైపే ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసొచ్చింది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే అవకాశాల్లేవని, ఈసారీ పరా జయం తప్పదని, మళ్లీ తమది ప్రతిపక్ష పాత్రేనని టీడీపీ నేతలు అంచనాకు వచ్చేశారు.టీడీపీ నేతలు పైకి గెలుస్తున్నామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గత లెక్కలు మాత్రం అనుకూలంగా లేవని పార్టీ సీనియర్ నేతల ద్వారా తెలుస్తోంది. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వారు చర్చించుకుంటున్నారు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి రెండు, మూడు గంటలు పో లింగ్ సరళి టీడీపీకి అనుకూలంగా ఉందని ఊదరగొట్టినా, ఆ తర్వాత పరిస్థితి మరింత తేటతెల్లం కావడంతో ఆ గాలి ప్రచారాన్ని తగ్గించేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, కొందరు ఎన్ఆర్ఐలు, టీడీపీ శ్రేణులతో కలిసి స్థానికంగా ఎక్కడికక్కడ ఓటర్లను మభ్యపెట్టేందుకు, తికమకపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. మహిళలు బారులు తీరడంతో కలవరం మహిళలు, వృద్ధులు గతంలోకంటె ఎక్కువగా పోలింగ్ బూత్‌లలో బారులు తీరి గంటల తరబడి నిలుచున్న దృశ్యాలు టీడీపీ శ్రేణుల్ని నివ్వెరపరిచాయి. తాము ఆశించిన దానికి భిన్నంగా సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లేస్తుండటంతో తప్పుడు ప్రచారాలను నమ్ముకుని విర్రవీగిన టీడీపీ శిబిరమంతా నీరసించిపోయింది. ప్రతి నెలా ఇంటి వద్దే పింఛన్లు అందుకున్న వృద్ధులు వైఎస్ జగన్‌కు ఓటేయడం తమ బాధ్యతగా భావించినట్లు ఓటింగ్ సరళి తెలియజెప్పింది.గ్రామీణ ప్రాంతాల్లో ఈ సెంటిమెంటు మరింత ఎక్కువగా కనిపించడంతో చంద్రబాబును నమ్ముకున్న పచ్చ మూకలన్నీ అంతర్మథనంలో మునిగిపోయాయి. పట్టణాల్లోకంటే గ్రామాల్లో ఓ టింగ్ పూర్తిగా తమకు వ్యతిరేకంగా జరిగిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. యువత ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పటికీ, అది కూడా నెరవేరలేదని చెబుతున్నారు. గత ప్ర భుత్వాలకంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎక్కువగానే ఉద్యోగాలు రావడంతో యువత మద్దతును టీడీపీ పూర్తిగా పొందలేకపోయినట్లు అంచనా .ఎన్ని దుష్ప్రచారాలు చేసినా పనిచేయలేదే? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, టీడీపీకి అనుకూలంగా ఎంత హడా వుడి చేసినా ఉపయోగం కనిపించలేదని రాజకీయ వర్గాలు అంచనకు వచ్చాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని భావిస్తున్నారు. ఎంత తప్పుడు ప్రచారం చేసినా, చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలు నమ్మలేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన ఏడాది క్రితమే సూపర్ సిక్స్ పేరుతో జగన్ పథకాలను కాపీ కొట్టి ప్రకటించుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పినా చంద్రబాబును జనం పట్టించుకోలేదని తేలినట్లు చెబుతున్నారు. చివరికి పింఛన్లను రూ.4 వేలకు పెంచి ఇస్తానని, ఏప్రిల్ నుంచే ఇస్తానని చెప్పినా వృద్ధులు లెక్క చేయలేదని స్పష్టమైంది. తాము అనుకున్నవేమీ జరగకపోవడం, ఓటింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉండడంతో టీడీపీ శ్రేణులన్నీ నైరాశ్యంలో మునిగిపోయాయి. మరోవైపు పోలింగ్ జరుగుతున్నప్పుడే చంద్రబాబు కూడా చేతులెత్తేసినట్లు మాట్లాడటంతో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ శ్రేణులకు అర్థమైపోయింది. -
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
-
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
-
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
-
మహారాష్ట్రలో ఓటింగ్ సరళి ఉందిలా..
నేడు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 11 గంటలకు 17.5 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న లోక్‌సభ స్థానాల్లో జాల్నా సీటుపై అందరి దృష్టి నిలిచింది. ఈ స్థానం నుంచి మొత్తం 26 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు.మహారాష్ట్రలోని జాల్నా లోక్‌సభ నియోజకవర్గాన్ని 1999 నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ స్థానంలో ప్రస్తుతం రావ్‌సాహెబ్ దాన్వే ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఆయనే బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి కల్యాణ్ కాలే ఎన్నికల బరిలో దిగారు. వంచిత్ బహుజన్ అఘాడీ తన అభ్యర్థిగా ప్రభాకర్ దేవ్‌గన్‌ను రంగంలోకి దించింది.మహారాష్ట్రలో ఈరోజు (సోమవారం) 11 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుండగా, వాటిలో ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, పశ్చమ మహారాష్ట్ర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నాల్గవ దశ పోలింగ్‌లో 2 కోట్ల 28 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 298 మంది అభ్యర్థులు నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. -
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటింగ్
-
శ్రీనగర్‌లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
శ్రీనగర్ లోక్‌సభ సీటుకు ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమయ్యింది. శ్రీనగర్, పుల్వామా, బడ్గామ్, గందర్బల్, షోపియాతో పాటు 18 అసెంబ్లీ స్థానాల్లో 17.47 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శ్రీనగర్ లోక్‌సభకు 24 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.శ్రీనగర్ లోక్‌సభ సీటు ఉదయం 9 గంటల వరకూ 5.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎటువంటి హింసాయుత ఘటనలు గానీ, ఎన్నికల బహిష్కరణ పిలుపులు గానీ చోటుచేసుకోలేదు. ఈ నేపధ్యంలో శ్రీనగర్‌లో ఓటింగ్ గత రికార్డులను అధిగమించవచ్చనే అంచనాలున్నాయి. #WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in GanderbalNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/lIKrAFPfSe— ANI (@ANI) May 13, 2024 -
ఓటు వేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ నాల్గవ దశ పోలింగ్ ఈరోజు(సోమవారం) జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 74 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఉజ్జయిలోని ఒక పోలింగ్ బూత్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఓటు వేశారు. #WATCH | After casting his vote fro #LokSabhaElections2024 , Madhya Pradesh CM Mohan Yadav says "I am very happy that I could cast my vote. I want to appeal to the people of the state to come out and cast their votes. BJP is going to win with a huge majority and we are going to… pic.twitter.com/EqbNEgwkRu— ANI (@ANI) May 13, 2024 అనంతరం ఆయన మాట్లాడుతూ తాను తన ఓటు హక్కు వినియోగించుకున్నంటుకు చాలా సంతోషిస్తున్నానని, రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో బీజేపీ 29 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం ఏడు గంటలకే ఓటర్లు తరలివచ్చారు. #WATCH | Indore, Madhya Pradesh: Free breakfast and ice cream are being distributed to early voters at the city's famous 56 Dukan restaurant. pic.twitter.com/KTos1zpi79— ANI (@ANI) May 13, 2024 -
Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
-
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ అర్హులు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికలు ఫేజ్ 4మొత్తం లోక్‌సభ సీట్లు: 96రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు: 10పోటీలోని మొత్తం: 1,717మొత్తం పోలింగ్ స్టేషన్లు: 1,81,196పోటీలో ఉన్న మహిళలు: 170గ్రాడ్యుయేట్లు: 1,010కోటీశ్వరులు: 476అభ్యర్థులపై ఉన్న కేసుల సంఖ్య: 360 -
ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సీతాపూర్‌లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌కు చేరుకోవడం ప్రారంభించారు. నగరంలోని మెథడిస్ట్ చర్చి స్కూల్లో జిల్లా యంత్రాంగం గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. బహ్రైచ్ లోక్‌సభ స్థానంలో మొత్తం 880 పోలింగ్ కేంద్రాలు, 1885 బూత్‌లను ఏర్పాటు చేశారు. నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ మూడు స్థానాల్లో మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీనితో పాటు దాద్రాల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఓటింగ్ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్‌కు ముందు అన్ని బూత్‌లలో మాక్‌పోల్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రారంభమైంది.యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎయిర్ అంబులెన్స్, హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంచామని సీఈవో రిన్వా తెలిపారు. ఈ హెలికాప్టర్ లొకేషన్ కాన్పూర్‌లో, ఎయిర్ అంబులెన్స్ లొకేషన్ లక్నోలో ఉంటుందన్నారు. -
క్యూలో నిలబడిన విజయ సాయి రెడ్డి
-
పోటెత్తాలి మన ఓటు!
మాన్యవరుల కంటే సామాన్య ప్రజలే చైతన్యవంతులని పలు ఎన్నికల్లో ఇప్పటికే రుజువైంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే ఓటింగ్ కోసం ముందువరసల్లో నిలబడబోయేది కూడా సామాన్యులే. అభిప్రాయాలను బహిరంగంగా దండోరా వేసే అలవాటు సామాన్యుల్లో బాగా తక్కువ. సోషల్ మీడియా రావిచెట్టు అరుగు మీద కూర్చొని విశ్లేషణలు చేసే వెసులుబాటు కూడా సామాన్యులకు ఉండదు. ఫేస్బుక్కుల్లో ముఖం చూసుకుని తల దువ్వుకోవడం వారికి చేతకాదు. ఇన్‌స్టాగ్రాముల్లో తమ భావాలను తూకం వేయడం కూడా వారికి రాదు. వాట్సప్ చాట్స్ల్లో డిబేట్ చేసే సామర్థ్యం అసలే ఉండదు. జీవితానుభవాల వల్ల రాయేదో రత్నమేదో గుర్తించగలిగిన నేర్పరితనం మాత్రం సామాన్యులకు ఏర్పడుతుంది. తమకు మంచి చేసే వారెవరో, తమను మాయ చేసే వారెవరో గుర్తించగలిగిన తెలివిడి ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఏర్పాటవుతున్న రాజకీయ తిరునాళ్లను వారు గమనిస్తూనే ఉన్నారు. పులివేషగాళ్ల వీరంగాలను పరికిస్తూనే ఉన్నారు. బూతు కూతలనే బాణాలుగా మార్చుకున్న నాయకమ్మన్యుల నోటికంపును కూడా సామాన్యులు భరించారు. అల్పాచమానాన్ని అమృతంగా, అశుద్ధాన్ని దద్దోజనంగా ప్రచారం చేస్తున్న ఈనాటి రోత పత్రికల రంకు బాగోతాన్ని కూడా వారు మౌనంగా గమనిస్తున్నారు. నూరు గొడ్లనుతిన్న రాబందులు ఒక్కొక్కటిగా వచ్చి వేదికలపై వాలుతుంటే... హరికథలు చెబుతుంటే సామాన్యుడు విని భరించాడు. సామాన్య ప్రజల స్వభావం సాదాసీదాగా ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా ఉండే సందేశాలనే వారు అందుకుంటారు. సందేశం లేని హంగూ ఆర్భాటాలు వారిని కదిలించలేవు. సినిమా వేషగాళ్లు, టీవీ హాస్యగాళ్లు వేసే పిల్లిమొగ్గల వినోదం వారిని ప్రభావితం చేయలేదు. ఈ ప్రచార పర్వంలో ఒకే ఒక సూటి సందేశం జనం మెదళ్లలో బలంగా నాటుకున్నట్లు కనిపించింది. మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయండని ఇచ్చిన పిలుపు ప్రభంజనమై వ్యాపించింది. మన ఓటు వల్ల మన కుటుంబాలకు మంచి జరుగుతున్నప్పుడు మన ఓటు మరింత చైతన్యవంతం కావాలి. ఆ మంచిని కొనసాగించుకోవాలి. జనసముద్రం పోటెత్తినట్లుగా ఓటేయాలి. మన ఇల్లూ మన పిల్లలూ బాగుండాలి. మన పాడిపంట వృద్ధి కావాలి. అమ్మల ఆత్మగౌరవం ఇనుమడించాలి. మధ్య దళారీలు, పెత్తందార్లు మన పురోగతికి అడ్డుపడని వ్యవస్థ కొనసాగాలి. మన బతుకులు ఒక్కో మెట్టును అధిరోహించాలి. మన తలరాతలు శుభం పలకాలి. ఈ పరిణామాలకు మనం వేసే ఓటు దోహద పడుతుంటే మనం ఎందుకు బద్ధకించాలి? రండి ఓటేద్దాం, పోలింగ్ సెంటర్‌ను పోటెత్తిద్దాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. మంచిని గెలిపిద్దాం....వంచనను తరిమేద్దాం! -
కేజ్రీవాల్‌కు బెయిల్.. ఇండియా కూటమికి ఎంత లాభం?
2024 లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల ఓటింగ్ పూర్తియ్యింది. ఇంతలో ఇండియా అలయన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి శుభవార్త వినిపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో స్కామ్ ఆరోపణలపై 40 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ బెయిల్ సమయంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపిరి అందినట్లయ్యింది. భారత కూటమిలోనూ ఉత్సాహం నెలకొంది. అయితే ఇది ఇండియా కూటమికి ఎంతవరకూ లాభం చేకూరుస్తుందనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది.కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కేజ్రీవాల్ ప్రచారంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేజ్రీవాల్ విడుదల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని 18 లోక్‌సభ స్థానాలపై ప్రభావం చూపనుంది. మే 25న ఢిల్లీ, హర్యానాలలో ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. కాగా పంజాబ్‌లో జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఆ రోజుతో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ముగియనుంది.బెయిల్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని నాలుగు ఆప్ స్థానాలలో ప్రచారం చేయడమే కాకుండా, పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడిన మూడు స్థానాలలో కూడా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. ఇక్కడ ఆప్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. అటువంటి పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంతో ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ కూడా లాభపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. -
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
సార్వత్రిక సమరంలో ఎన్నికల ‘వేడి’ పరాకాష్టకు చేరుతోంది. ఇప్పటికే 3 విడతల్లో పోలింగ్ పూర్తికాగా, మరో నాలుగు విడతలు మిగిలి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గడం అటు పారీ్టలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా కలవరపెడుతోంది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. అయితే ఓట్ల శాతం తగ్గినా, పోలైన మొత్తం ఓట్ల సంఖ్య మాత్రం 2019తో పోలిస్తే ఎక్కువగానే ఉందని ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషకులు వెల్లడించారు. అంతేగాక రానున్న విడతల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. 2019లో తొలి దశలో 69.4 శాతం, రెండో దశలో 69.3 శాతం, మూడో దశలో 67.3 శాతం చొప్పన ఓటింగ్ నమోదైంది. ఈసారి మొదటి విడతలో 66.1 శాతం, రెండో దశలో 66.7 శాతం, మూడో విడత 65.7 శాతం ఓటింగ్ జరిగింది. శాతాల్లో చూస్తే 2019 కంటే తగ్గినట్టు కన్పిస్తున్నా వాస్తావానికి తొలి రెండు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యలో 8.7 లక్షలు పెరుగుదల నమోదైంది. 2019లో తొలి రెండు విడతల్లో 20.61 కోట్ల మంది ఓటేయగా, 2024లో 20.7 కోట్లకు పెరిగింది. పెరిగిన ఓట్లలో మహిళ సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఓట్లు పెరగడం మరో కీలకాంశం. రాష్ట్రాల్లో ఇలా... రాష్ట్రాల విషయానికొస్తే ఈసారి తొలి రెండు దశల్లో కర్నాటకలో 12.9 లక్షల ఓట్లు అధికంగా పడ్డాయి. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్ ఏడు విడతల్లో జరిగింది. తొలి మూడు విడతల్లో ఓటింగ్ అధికంగా నమోదై ఆ తర్వాత విడతల్లో తగ్గింది. ఈసారి అందుకు భిన్నంగా తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గింది. కనుక మిగతా నాలుగు విడతల్లో పోలింగ్ భారీగా పుంజుకుంటేనే కనీసం గత ఎన్నికల స్థాయిని అందుకోగలుగుతుంది. అయితే 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.2 కోట్లు కాగా 2024లో 96.9 కోట్లకు పెరిగింది. అందుకే ఈసారి ఓటింగ్ తొలి మూడు విడతల్లో శాతాల్లో తగ్గినా సంఖ్యపరంగా పెరిగిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మూడో దశకే అఖిలేష్ ఓటమి మ్యానిఫెస్టో!
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉంది. అయితే ఇంతలోనే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఓటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఇది వారి పార్టీకి సంబంధించినది కాదు.. బీజేపీ ఓటమికి సంబంధించినది.అఖిలేష్ ఈ మేనిఫెస్టోను కాలక్రమం ఆధారంగా వివరిస్తూ ట్వీట్ చేశారు. మీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే అక్కడి మీ సహచరులపై ఎందుకు ఆరోపణలు వచ్చాయని అఖిలేష్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తలు జీఎస్టీ, ఆదాయపు పన్ను, ఇతర రకాల పన్నులను ఎగవేసి ఉంటారు. అందుకే నల్లధనం పుట్టుకొచ్చింది. ప్రభుత్వం దీనిని అనుమతించిందో లేక ఆపలేకపోయిందో గానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పక తప్పదు.గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలైన నోట్ల రద్దు, జీఎస్టీ తప్పని రుజువైంది. దేశంలో అవినీతి వల్ల తలెత్తుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలకు బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బీజేపీ దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుంచి మన దేశం వైదొలగడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం నల్లధనం ఆధారంగా భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటున్నదా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’ల విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో పేదల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. దేశ ఆదాయానికి ఏర్పడిన వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎన్నికల విరాళాలతో భర్తీ చేస్తుందా? కరోనా వ్యాక్సిన్ కోసం విరాళాలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం ప్రకటించిన ఎన్నికల విరాళాలను నల్లధనంగా ప్రకటిస్తుందా? అని అఖిలేష్ ప్రశ్నించారు.పార్టీలో ఎవరిపైన అయినా ఆరోపణలు వస్తే, వారికి గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు, లీజులన్నింటినీ బీజేపీ రద్దు చేస్తుందా? ప్రజల సొమ్ముతో రూపొందించిన ‘పీఎం కేర్ ఫండ్’ ఖాతాలను ప్రజల ముందు బహిరంగపరుస్తుందా? బీజేపీ తదుపరి దశ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేక మూడో దశనే చివరి దశగా భావించి ఓటమిని అంగీకరిస్తుందా? అని అఖిలేష్ తన ట్వీట్లో బీజేపీని ప్రశ్నించారు. -
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
-
అందరూ పోలింగ్‌లో పాల్గొనాలి: అదానీ
ఆసియా కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు కలిగి ఉన్న పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలని ఆయన తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.3.5లక్షల కోట్లుగా ఉంది. గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు. -
ఆ బూత్‌లో 9 గంటలకే 100 శాతం పోలింగ్!
ఈరోజు (మంగళవారం) దేశంలో లోకసభ ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే ఒక పోలింగ్ బూత్‌లో ఉదయం 9 గంటలకే వందశాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పోలింగ్ కేంద్రం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని షెర్దాండ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 143లో మొత్తం ఐదుగురు ఓటర్లు తమ ఓటు వేశారు. దీంతో ఇక్కడ 100 శాతం పోలింగ్ పూర్తయ్యింది. ఎంపీని ఎన్నుకునేందుకు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.షెర్దాండ్ పోలింగ్ కేంద్రం కొరియా జిల్లాలోని సోన్హట్ జన్‌పాడ్ పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. ఐదుగురు ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, ఉదయం 9కే 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే, సీఈవో డాక్టర్ అశుతోష్ చతుర్వేది, అదనపు కలెక్టర్ అరుణ్ మార్కం, ఎస్డీఎం రాకేష్ సాహు తదితర జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటర్లకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే కృతజ్ఞతలు తెలిపారు.వనాంచల్ ప్రాంతంలోని షెర్దాండ్‌లో మొత్తం ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు. ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడికి చేరుకోవడానికి పక్కా రోడ్లు లేవు. గ్రామపంచాయతీ చందా నుంచి పోలింగ్ పార్టీలు ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాయి. -
పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి నెట్వర్క్: ఓటమి భయం వెంటాడుతుండటంతో టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు హాజరయ్యే ఉద్యోగులను ప్రలోభపెట్టేలా.. ఎన్నికల నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అకృత్యాలకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది.వివిధ ప్రాంతాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాగా.. వారిని సామ, దాన, దండోపాయాలతో లోబర్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే నగదు పంపిణీ చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పచ్చదండు దాడులకు యత్నించింది. టీడీపీ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన వారితో ఉద్యోగులకు ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు. కొన్నిచోట్ల పోలింగ్ అధికారులను, పోలీసులను సైతం బెదిరించారు.విశాఖలో ఇలా..సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఏయూ తెలుగు, ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చేపట్టారు. పోలింగ్ కేంద్రం ఎదురుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు అనుచరులు హల్చల్ చేశారు. వెలగపూడి అనుచరుడు కాళ్ల శంకర్, టీడీపీ నాయకుడు పోతన్న రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొట్ట వెంకట రమణ అక్కడే ఉండి ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేశారు. వెలగపూడికి చెందిన రెండు ప్రచార వాహనాలు ఏయూ ఇన్‌గేట్, అవుట్ గేట్ మధ్యలో భారీ శబ్ధంతో కూడిన మైక్‌లను పెట్టుకుని అటూఇటూ తిరుగుతూ ప్రచారం చేశారు. కొంతమంది ఓటర్లకు డబ్బులు పంపిణీ, మరికొందరికి గూగుల్‌పే, ఫోన్ పే చేస్తూ ప్రలోభాలకు గురి చేశారు.చిత్తూరులోనూ ఇదే పద్ధతితిరుపతిలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం పేరుతో టీడీపీ నేతలు హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు అత్యంత సమీపంలోనే కొందరు ఓటర్లకు బలవంతంగా నగదు పంపిణీకి యత్నించారు. ఎన్నికల అధికారులను, పోలీసుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయలేదు. ఉద్యోగ సంఘ మాజీ నేతలు కొందరు ప్రలోభాల పర్వానికి సహకరించారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ప్రచార వాహనాలు యథేచ్ఛగా తిరిగినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు.చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేశారు. పుంగనూరులో ఓటర్లను బెదిరించారు. పూతలపట్టులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. పలమనేరులోని ఓ హోటల్లో ఉద్యోగులకు విందు ఏర్పాటు చేశారు. నగరిలో ఉపాధ్యాయులకు యూనియన్ మాజీ నేతల ద్వారా ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు.పులివెందులలో అధికారికి బెదిరింపువైఎస్సార్ జిల్లా పులివెందులలో పోలింగ్ ట్రైనింగ్ అధికారి సంగం మహేశ్వరరెడ్డిపై టీడీపీ నాయకులు అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి, దర్బార్‌బాషా, అంజుగట్టు రవితేజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఆయనను దుర్భాషలాడుతూ బయటకు నెట్టివేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ నాయకులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగకుండా ఇలాంటి వివాదాలకు పాల్పడుతున్నట్టు అవగతమవుతోంది.బద్వేలులోని జెడ్పీ హైస్కూల్లోని ఫెసిలిటేషన్ సెంటర్‌కు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో తిష్టవేసిన టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీచేశారు. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు షేక్‌హుస్సేన్ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు.తిరుపతిలో తాయిలాల ఎరతిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద టీడీపీ, జనసేన అభ్యర్థులు హల్చల్ చేశారు. ముందురోజు రాత్రే కొందరు ఉద్యోగులకు తాయిలాల ఎర చూపారు. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సెంటర్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ హడావుడి చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఆయనను పోలీసు అధికారులు ప్రశ్నించడంతో సుధీర్ మీ అంతు చూస్తా అంటూ బూతు పురాణం అందుకున్నారు.గుంటూరులో తికమకపెట్టేలా..గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులను తికమకపెట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పోస్టింగ్‌లు పెట్టారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. అధికారుల మధ్య సమన్వయలోపం, అవగాహన రాహిత్యం బట్టబయలయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయం నుంచి బ్యాలెట్ ఓటింగ్ వద్ద గొడవ జరుగుతోందని, రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు పెట్టారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement