Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Perni Nani Serious Comments On Election Commission
టీడీపీ వీడియో ట్వీట్‌ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్‌ చేశారు.కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.13వ తేదీన కేసు ఎందుకు పెట్టలేదు?..వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ ఆగినట్టు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ లాగ్‌ బుక్‌లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్‌ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?’ అని ప్రశ్నలు సంధించారు.పోలింగ్‌ ఆగిందా?..టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలింగ్ స్టేషన్ 202లో ఒక గంటసేపయినా పోలింగ్ ఆగిందా?. నిజంగానే ఎమ్మెల్యేనే ధ్వంసం చేస్తే అధికారులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. సిట్ అధికారులకైనా ఎమ్మెల్యేపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. కానీ లోకేష్ మాత్రం ఎమ్మెల్యే ఒక వీడియోను రిలీజ్‌ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది.ఈసీపై సెటైర్లు..కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు. వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారు. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి?. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రెంటచింతల మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారు. ఆ సీఐ అత్యంత వివాదాస్పదుడు. గతంలో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని సీఐగా ఎలా పంపించారు?. పదకొండు రోజుల తర్వాత పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. సిట్ బృందానికి కూడా ఈ కేసుల గురించి చెప్పలేదు. పిన్నెల్లి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతీ పోలీసు అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

AP Elections 2024: May 26th Political Updates In Telugu
May 26th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates..1:45 PM, May 26th, 2024పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలుపోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ అధికారి స్టాంప్‌ వేయలేదనే కారణంతో పోస్టల్‌ బ్యాలెట్‌ను చెల్లని ఓటుగా పరిగణించవద్దు. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లుతాయి. ఫాం 13పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్వో సంతకం, బ్యాలెట్‌ను ధృవీకరించే రిజిస్టర్‌తో చూసుకోవాలి. ఆర్వో సంతకం, సీరియల్‌ నెంబర్‌లేని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరణ. నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకుంటే తిరస్కరిస్తాం. 12:50 PM, May 26th, 2024టీడీపీ వీడియో ట్వీట్‌ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నానిఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పోలింగ్‌ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ ఆగినట్టు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ లాగ్‌ బుక్‌లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్‌ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. 12:15 PM, May 26th, 2024ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది: మంత్రి కాకాణినెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్..ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించింది..పోలీస్ అధికారులను ఉద్దేశ్యపూరీతంగా బదిలీ చేసింది..కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు.. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న చోట కేడర్‌ను భయబ్రాంతులకు గురి చేశారు..మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది..ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయం..నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదు..ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైంది..ఎన్నికల నిధులు దుర్వినియోగం, వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచితే.. దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు..మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదం..ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తాను..జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పని చేశారు..జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదు..కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్‌ను నియమించాలని కోరుతున్నాం.. 11:40 AM, May 26th, 2024దెందులూరులో సంక్షేమానికే ప్రజల మద్దతు..దౌర్జాన్యాలతో, అరాచకాలతో చెలరేగిపోయిన చింతమనేని ప్రభాకర్‌2019 ఎన్నికల్లోనే చింతమనేనికి బుద్ధి చెప్పిన దెందులూరు నియోజకవర్గ ప్రజలు.దళితులను, అధికారులను తిట్టడం, కొట్టడంతో పేరుపొందిన చింతమనేని. ఈసారి కూడా చింతమనేనికి తమ పవరేంట్‌ చూపామంటున్న ప్రజలు. ప్రజలతో మమేకమై పనులు చేయించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి 11:00 AM, May 26th, 2024విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏయూలో ఏర్పాట్లుఓట్ల లెక్కింపునకు 14 గంటలు పట్టే అవకాశం.ఉదయం 8 గంటల నుంచి లెక్కింపుతొలి రౌండ్ ఫలితాలు 9 గంటల నుంచి వెల్లడించే అవకాశంవిశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం కలిపి 98 లోక్ సభ పరిధిలోని ఏది నియోజకవర్గాలు కలిపి 98 చొప్పున టేబుల్స్ ఏర్పాటుభీమిలి అసెంబ్లీకి 26 రౌండ్లతో రాత్రి 7:30 కు ఫలితం వచ్చే అవకాశంవిశాఖ తూర్పు 21 రౌండ్లలో సాయంత్రం ఐదు గంటలకువిశాఖ సౌత్ లో 17 రౌండ్లకు మధ్యాహ్నం మూడున్నరకువిశాఖ నార్త్ లో 22లకు సాయంత్రం ఐదు గంటలకువిశాఖ వెస్ట్ 16 రౌండ్లకు మధ్యాహ్నం 3:15 కుగాజువాకలో 22 రౌండ్లకు సాయంత్రం 5:45 గంటలకుపెందుర్తిలో 21 రౌండ్లకు సాయంత్రం 5:30 గంటలకుఎస్ కోట లో 19 రౌండ్లకు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫలితాలు వెల్లడివిశాఖ జిల్లాలో మొత్తం ఓటర్లు 2012373ఓట్లు వినియోగించుకున్న ఓటర్లు 1409316పోస్టల్ బ్యాలెట్ 23,981విశాఖ లోక్‌సభ పరిధిలో 1962 పోలింగ్ కేంద్రాలు 14 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ 10:30 AM, May 26th, 2024విజయం వైఎస్సార్‌సీపీదే..పోలింగ్‌ ఫలితాలపై లెక్కలువేసుకుంటున్న ప్రధాన పార్టీలుతమ స్థానాలు ‘పది’లమంటున్న వైఎస్సార్‌సీపీపరువు నిలుపుకుంటామంటున్న టీడీపీజనసేన, బీజేపీ స్థానాల్లో గెలుపు అసాధ్యమేఓటు బదిలీ కాలేదంటున్న రాజకీయ పరిశీలకులువైఎస్సార్‌సీపీ ఖాతాలోకే కడప,రాజంపేట పార్లమెంటు స్థానాలు 9:50 AM, May 26th, 2024బరితెగించిన టీడీపీ నాయకులు..పచ్చ బ్యాచ్‌ను వెంటాడుతున్న ఓటమి భయం..ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలుఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 8:40 AM, May 26th, 2024పచ్చముఠా పైశాచికత్వం..కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులుతిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరికప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమైందిరాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా టీడీపీ చంద్రబాబు కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైయస్‌ఆర్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులు తిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమై.. రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా…— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:50 AM, May 26th, 2024దాడుల సంస్కృతి నాది కాదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్‌..దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదుపులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదు పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు… pic.twitter.com/YMmEAgkK8s— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:10 AM, May 26th, 2024ఓట్ల లెక్కింపు ఇలాజూన్‌ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభంతొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి 7:00 AM, May 26th, 2024కౌంటింగ్‌ ఏజెంట్లే కీలకంఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకంఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యంనిబంధనలు తెలియకుంటే అయోమయమే 6:50 AM, May 26th, 2024పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!పోలింగ్‌ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలుఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు దుకాణాలపై రాళ్లు, బైక్‌ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు.. పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం చిన్న చిన్న సాకులతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలుఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం 6:40 AM, May 26th, 2024క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావాజనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తికి సీఎస్‌ జవహర్‌రెడ్డి హెచ్చరికవిశాఖలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయలేదుచట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక 6:30 AM, May 26th, 202421 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలేఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం మహిళల ఓట్లు వైఎస్సార్‌సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు

తాజాగా బయట పడిన వీడియో ఆధారంగా.. పోలింగ్‌ మరుసటి రోజు పల్నాడు జిల్లా కారంపూడి వీధుల్లో మారణాయుధాలతో దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ గూండాలు
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!

రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్‌ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్‌ ట్యాంక్‌ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్‌ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్‌ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్‌ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్‌ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరు­లపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు­తున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీ­సుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయా­యి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తు­న్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్‌ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్‌ బాబు తదితరులు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్‌ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు.

EX Minister KTR Sensational Comments Over Congress Govt
కాంగ్రెస్‌కు రుణమాఫీ చేసే తెలివిలేదు: కేటీఆర్‌

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్‌ ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటేనే స్కాములు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్. ధాన్యం కుంభకోణంలో సుమారు రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులుగా వెళ్ళాయి.అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్‌తో జరిగింది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందులో వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయా లేదా ఎంక్వైరీ వేయాలి. పాడిలో మొదటి స్కాం, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్‌. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కాం జరిగింది.నాలుగు సంస్థలకే టెండర్లు..బహిరంగ మార్కెట్లలో సన్నబియ్యం ధర 42 నుండి 45 వరకు ఉంది. దానిని పక్కకు పెట్టీ 56.90 పైసలతో కొంటున్నారు. కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే టెండర్లు ఎందుకు?. సివిల్‌ సప్లై, ఎఫ్‌సీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పట్టించుకోరు?. కాంట్రాక్టు సంస్థలతో కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యారు. బహిరంగ మార్కెట్లలో తక్కువ ధరకు సన్నబియ్యం వస్తుంటే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్‌ నడుస్తోంది. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి రూ.2లక్షలు రుణమాఫీ చేసే తెలివి లేదు. బీజేపీపై అనుమానాలు..ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, ఎంఎస్‌పీ అంత నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో FCI వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలి. మీ బీజేపీ ఎంఎల్ఏ చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈడీ విచారణ చేయాలి. FCI స్పందించకపోతే బీజేపీపైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలు అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి స్పందించటం లేదు. దమ్ముంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపించాలి. లేదంటే మేమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. విచారణ సంస్థలను కూడా కలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు.

Maldives minister reacts India seeking Free Trade Agreement
Maldives: ‘భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోంది’

మాలె: మాల్దీవులుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చేసుకోవడానికి భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ మంత్రి మహ్మద్‌ సయీద్ అన్నారు. అయితే దానికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మాలెలో ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్‌ సయీద్ మీడియాతో మాట్లాడారు.‘‘దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(SAFTA)తో పాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్‌ కోరుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకోవడానికి అన్ని దేశాలకు అవకాశం కల్పించారు. వాణిజ్య కార్యకలాపాలను మరింత సులభతరం చేయటంలో భాగంగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని మహ్మద్‌ సయీద్ అన్నారు.ఇక.. గతేడాది భారత ప్రధాని మోదీ లక్ష్యదీప్‌ పర్యటన సందర్భంగా దీగిన ఫొటోలు, వీడియోలపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బ తిన్నాయి. అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జుకు చైనా అనుకూలుడనే పేరు ఉండటం. అదే విధంగా మాల్దీవుల్లో ఉన్న భారత్‌ బలగాలను వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించటం వంటి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.అయినప్పటికీ భారత్ మాల్దీవుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్‌లో 50 మిలియన్‌ డాలర్ల అర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. 1981లో ఇండియా-మాల్దీవుల మధ్య అత్యవసర సరుకుల ఎగుమతుల కోసం వాణిజ్య ఒప్పందం కుదిరింది. 2021లో మొదటిసారి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 300 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత సంవత్సరాల్లో అదికాస్త ఇంకా పెరుగుతూ 500 మిలియన్‌ డాలర్లు చేరుకుంది.

Central Election Commission Arrangements for Election Votes Counting
ఓట్ల లెక్కింపు ఇలా

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్య­ర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్‌ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటన­లు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజే­షన్‌ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పు­న మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్‌ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్‌ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్‌ నంబర్‌ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్‌ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్‌ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్‌ హాల్‌లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్‌ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్‌ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత క్లోజ్‌ బటన్‌ నొక్కకుండా ఉన్న (క్లోజ్‌ రిజల్ట్‌ క్లియర్‌–సీఆర్‌సీ) ఓటింగ్‌ యంత్రాలతో పాటు మాక్‌ పోలింగ్‌ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్‌ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్‌ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్‌ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

Sister Death Movie Review And Rating In Telugu
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!

టైటిల్‌: సిస్టర్‌ డెత్‌నటీనటులు: అరియా బెడ్మర్‌, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్‌, చెలో వివరెస్‌, సారా రోచ్‌, అల్ముడెనా ఆమొర్‌ తదితరులుదర్శకుడు: పాసో ప్లాజాజానర్‌: హారర్‌ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్‌నిడివి: 1 గంట 30 నిమిషాలుహారర్‌ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్‌ మూవీస్‌ అంటారు కానీ అందులో భయపడేంత సీన్‌ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్‌ డెత్‌ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్‌ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..కథసిస్టర్‌ నార్సిసా.. కాన్వెంట్‌ స్కూల్‌లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్‌కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్‌లో బోర్డ్‌ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్‌ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్‌ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్‌ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్‌ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!విశ్లేషణనన్‌ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్‌ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్‌ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్‌గా కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్‌. నార్సిసా పాత్రలో స్పానిష్‌ హీరోయిన్‌ అరియా బెడ్మర్‌ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్‌, ప్రొడక్షన్‌ వాల్యూస్‌ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్‌ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే సాగుతుంది.సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్‌లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్‌ అని అర్థమవుతుంది. మీరు హారర్‌ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్‌ సినిమాకు తెలుగు డబ్‌ వర్షన్‌ లేదు. హిందీ, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది.

33 People Died In Rajkot Game Zone's Horrific Fire Accident
రాజ్‌కోట్‌ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తాజాగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీకెండ్‌ కావడంతో​ భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వచ్చారు. వారంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వారని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో గేమ్‌ జోన్‌ పైకప్పు కూలిపోవడంతో లోపల ఉన్న వారంతా బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతో మంటల్లో సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ కొందరు బాధితులు మృతిచెందారు. దీంతో, మృతిచెందిన వారి సంఖ్య 33కి చేరుకుంది. #WATCH | Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi took stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/ks1YhRszH2— ANI (@ANI) May 26, 2024మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో గేమ్‌ జోన్‌ వద్దకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ వచ్చి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ యజమాని యువ్‌రాజ్‌ సింగ్‌ సోలంకితోపాటు దాని మేనేజర్‌ నితిన్‌ జైన్‌ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.🚨 SHOCKING! At least 26 people, including at least 12 children, were killed in a massive fire that broke out at a game zone in Rajkot, Gujarat. pic.twitter.com/nN21BAP1WF— Indian Tech & Infra (@IndianTechGuide) May 26, 2024

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, road to IPL 2024 final
IPL 2024: రైజర్స్‌ VS రైడర్స్‌

గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్‌ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్‌లు ఫైనల్‌ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్‌ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్‌ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్‌కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా తమ మూడో టైటిల్‌పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్‌ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్‌–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్‌ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతాయి. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్‌కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్‌తో పాటు అంతకు ముందు లీగ్‌ దశలో కూడా కేకేఆర్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ను ఓడించడంతో రైజర్స్‌ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్‌ కోసం హైదరాబాద్‌ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్‌–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్‌లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్‌ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్‌ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో దూకుడైన బ్యాటింగ్‌తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్‌ మిడిలార్డర్‌లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్‌ రెడ్డి, సమద్‌లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్‌రమ్‌ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఫిలిప్స్‌ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్‌ను బట్టి క్వాలిఫయర్‌లో షహబాజ్‌ను అనూహ్యంగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా చేసుకొచ్చి టీమ్‌ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్‌ను స్పిన్‌కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్‌లో నలుగురు లెఫ్టార్మ్‌ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ పేస్‌ బౌలింగ్‌లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్‌కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్‌–1 ఆడిన టీమ్‌నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్‌ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్‌ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్‌ బౌలింగ్‌ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్‌ ఫామ్‌లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్‌ వరుణ్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్‌రైజర్స్‌: కమిన్స్‌ (కెపె్టన్‌), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్‌రమ్, క్లాసెన్, నితీశ్‌ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్‌/ మర్కండే. నైట్‌రైడర్స్‌: శ్రేయస్‌ (కెపె్టన్‌), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్‌. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్‌పై జరిగి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్‌ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్‌కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్‌ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్‌ డే ఉంది.

India Builds World's First Portable Hospital To Keep 200 Survivors Alive For 48 Hrs
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్‌ విపత్తు‌ ఆస్పత్రి!ఎక్కడంటే..

ఆస్పత్రిని అప్పటికప్పుడూ సెట్‌ వేసినట్లుగా సెటప్‌ చేసే పోర్టబుల్‌ ఆస్పత్రి గురించి విన్నారా. పైగా ఈ ఆస్పత్రి సాయంతో దాదాపు 200 మంది రోగులకి ఒకేసారి వైద్యం అందించొచ్చట కూడా. ఇంతకీ ఏ దేశం ఈ ఆస్పత్రి మోడల్‌ని తీసుకొచ్చిందంటే..భారతదేశం ప్రపంచంలోనే తొలి విపత్తు ఆస్పత్రిని ప్రవేశపెట్టింది. దీనిని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి సుమారు 72 క్యూబ్‌లు ప్యాక్‌ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను 'ఆరోగ్య మైఔత్రి క్యూబ్‌' అని పిలుస్తారు. భీష్మ(భారత హెల్త్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ సహయోగ్‌ హితా అండ్‌ మైత్రి ప్రాజెక్ట్‌)లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. ఈ క్యూబ్‌లలో ఆపరేషన్‌ థియేటర్‌, మినీ ఐసీయలు, వెంటిలేటర్లు, రక్త పరీక్షపరికరాలు, ఎక్స్‌రే యంత్రం, వంట స్టేషన్‌, ఆహారం, నీరు, షెల్టర్‌ పవర్‌ జనరేటర్‌ వంటి అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేక కేజ్‌లో దాదాపు వందమంది రెండు రోజుల పాటు జీవించేందుకు అవసరమైన సామాగ్రితో నింపిన 36 మినీ క్యూబ్‌లను చూడవచ్చు. వీటిలో రెండు మెయిన్‌ కేజ్‌లు ఉంటాయి.వాటిని మాస్టర్‌ క్యూబ్స్‌ అని పిలుస్తారు. వీటిల్లో దాదాపు 200 మంది ప్రాణాలను రక్షిచవచ్చు. ఈ మినీ ఫోర్టబుల్‌ ఆస్పత్రి 40 బుల్లెట్ గాయాలు, 25 పెద్ద రక్తస్రావం, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 హెడ్‌ ఇంజూరీస్‌, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నుముకకి అయ్యే పగళ్లు గాయాలు వంటి వివిధ రకాల తీవ్రమైన గాయాలను నిర్వహించగల సామర్థ్యం గలది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్‌ బీష్మలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్‌ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్‌ని గత జనవరిలో జరిగిన గ్లోబల్‌ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు.ఆగస్టులో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మెడ్‌టెక్ ఎక్స్‌పోలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారిక ప్రారంభం జరిగింది. అంతేగాదు ఈ ప్రాజెక్టును మొదటగా మయన్మార్ అధికారులకు చూపించారు. ఇక ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు ఈ ఆలోచనను అందించారు. ఆయన సూచనల కారణంగా ఆయుర్వేద ఉత్పత్తులకు క్యూబ్స్‌లోని వస్తువులు జాబితాలో జోడించామని అధికారులు తెలిపారు. భారతదేశం మయన్మార్‌కు రెండు ఆరోగ్య మైత్రి క్యూబ్‌లను విరాళంగా అందించింది ఒక శ్రీలంకకు కూడా ఒకటి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.(చదవండి: మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్‌‌!..కరెంట్‌తో పనిలేదు..!)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement