ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు | Weekly Horoscope Telugu: Check Astrological Prediction From 7th to 13th January, 2024 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope Telugu: ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు

Published Sun, Jan 7 2024 6:51 AM

weekly horoscope Telugu 07 01 24 To 13 01 24 - Sakshi

మేషం..
అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీయానం.వారం మద్యలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో వైరం. పసుపు, నేరేడు రంగులు, విష్ణుధ్యానం చేయండి. 

వృషభం..
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గుర్తింపు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.  కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో మానసిక అశాంతి. ఆప్తుల నుండి ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, అంగారకస్తోత్రం పఠించండి.

మిథునం..
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూసంబంధిత వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, తెలుపు రంగులు,  విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువుల నుండి సమస్యలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.

సింహం..
అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. తెలుపు, ఎరుపు రంగులు,  ఆంజనేయ దండకం పఠించండి.

కన్య..
కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. చర్చలు సఫలం. నేరేడు, లేత ఎరుపు రంగులు,  ఆదిత్య హృదయం పఠించండి.

తుల..
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.  కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారతారు.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో మనశ్శాంతి లోపం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.  లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు,  గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం..
విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. చర్చలు ముందుకు సాగక వాయిదా వేస్తారు. నీలం, లేత పసుపు రంగులు,  దుర్గాస్తోత్రాలు పఠించండి.

ధనస్సు..
చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటర్వ్యూలు అందుతాయి.  భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం.  ఉద్యోగులకు ఉన్నత స్థాయి పొందుతారు. రాజకీయవర్గాల యత్నాలు కలసివచ్చే సమయం. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు,  శివాష్టకం పఠించండి.

మకరం..
నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం చివరిలో పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. చాక్లెట్, ఎరుపు రంగులు,  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. 

కుంభం..
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఇంటిలో ఘర్షణ వాతావరణం. పసుపు, గులాబీరంగులు, వినాయకుని పూజించండి.

మీనం..
ఏ పని చేపట్టినా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ చొరవతో స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థికంగా వృద్ధి కనిపిస్తుంది.దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. తీర్థయాత్రలు చేస్తారు.  ఖరీదైన వస్తువులు కొంటారు. వ్యాపారులు తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగవర్గాలకు పెండింగ్‌ బాకీలు అందవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఎరుపు, గులాబీరంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


 

Advertisement
Advertisement