Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Record Temperatures In Delhi Mageshpuri On May 29th 2024
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత

సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్‌ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్‌ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్‌ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్‌ ఫీల్‌ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి.

Sajjala Ramakrishna Reddy Key Suggestion To YSRCP Polling Agents
అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్‌ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్‌ ఏజెంట్లకు వర్క్‌షాప్‌ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్‌ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.

Telangana: Congress BRS in war of words over state song
తెలంగాణ రాష్ట్ర గేయం.. ఇప్పుడే ఎందుకు వివాదమైంది?

తెలంగాణ రాష్ట్ర గేయంపై కొత్తగా వివాదం ఎందుకు వచ్చింది? గతంలో లేని వివాదం ఇప్పుడే ఎందుకు వివాదమైంది? రాష్ట్ర గేయం రూపకల్పనలో గులాబీ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇందులో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఎంతవరకు ఉంది? పాటకు సంగీతం సమకూరుస్తున్న వ్యక్తే వివాదానికి కేంద్ర బిందువుగా మారారా? దీనిపై బీఆర్ఎస్ ఏమంటోంది? ముఖ్యమంత్రి రేవంత్‌ సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాలు చేసుకుకోవాల్సిన సమయంలో కొత్త వివాదాలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గేయం రూపకల్పనపైన ప్రధాన విపక్షం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కారు, హస్తం పార్టీల మధ్య తెలంగాణ గేయం ఇరుక్కుంది. రాష్ట్ర గేయం అంశం పదేళ్లలో ఎన్నడూ చర్చనీయాంశం కాలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గేయం అంశాన్ని మళ్ళీ తెరమీదకు తీసుకుని వచ్చింది. అందులో మార్పులు చేసి గేయాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని నిర్ణయించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా.. పాట రచయిత అందే శ్రీ తో ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, పాటకు సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించటంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని తెలంగాణేతరులకు అప్పగించటం పట్ల గులాబీ పార్టీ నేతలు మండి పడుతున్నారు. సంగీత దర్శకులు, గాయకుల్లో తెలంగాణ బిడ్డలు చాలామంది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని బీ ఆర్ ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గేయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేందుకే గులాబీ పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంది.ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా చూస్తోంది. రాష్ట్ర కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దనిబీఆర్‌ఎస్‌ అనుకుంటోంది. ఇది చిలికి చిలికి గాలి వానలా మారుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనతో చల్లగా వివాదం నుంచి తప్పుకున్నారు. తెలంగాణ గేయ రచన, సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించే విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని ఇదంతా అందే శ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండానే అందెశ్రీ నిర్ణయాలు తీసుకుంటారా అని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్‌మినార్‌లను తొలగించాలన్ని నిర్ణయాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణ వారసత్వానికి, పోరాటాలకు చిహ్నాలుగా ఉన్నవాటిని ఎలా తొలగిస్తారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యతను తెలంగాణేతరులకు ఇవ్వడానికి వీల్లేదని గులాబీ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Delhi Court Key Decision On Kavitha Chargesheet In Liquor Case
లిక్కర్‌ కేసు: కవితకు మరో షాక్‌

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్‌3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్‌లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది.

Hardik Pandya Shares Post Amid Divorce Rumours With Wife Natasa Stankovic Viral
Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ వైరల్‌

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ కోసం సహచర ఆటగాళ్లతో కలిసి అమెరికాలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. కాగా ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఐపీఎల్‌-2024 సీజన్‌లో పగ్గాలు చేపట్టిన పాండ్యాకు ఏదీ కలిసి రాలేదు. రోహిత్‌ శర్మపై మేనేజ్‌మెంట్‌ వేటు వేసి అతడి స్థానంలో పాండ్యాను తీసుకువచ్చినందుకు సొంత జట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.అడుగడుగునా హార్దిక్‌ పాండ్యా, ముంబై యాజమాన్యాన్ని ట్రోల్‌ చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా చెత్త కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్‌.. పదో స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్‌ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతడి భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2024 ముగియగానే హార్దిక్‌ పాండ్యా ఒంటరిగానే లండన్‌కు వెళ్లి సెలవులను గడిపినట్లు సమాచారం. అనంతరం.. అమెరికాకు వచ్చిన టీమిండియాతో అతడు చేరినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌ షురూ చేసిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేసింది. ఇందులో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మెగా టోర్నీ కోసం న్యూయార్క్‌లో రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎండ కూడా బాగా కాస్తోంది’’ అని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘జాతీయ జట్టు తరఫున విధుల్లో ఇలా’’ అంటూ తన ఫొటోలను హార్దిక్‌ పాండ్యా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. నటాషాతో విడాకుల ప్రచారం ఊపందుకున్న తర్వాత ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ తొలిసారిగా ఇలా తన ఒక్కడి ఫొటోలు షేర్‌ చేయడం విశేషం.చదవండి: T20 WC: ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

Ksr Comments On The Behavior Of Tdp Chiefs Towards Pinnelli Ramakrishna Reddy
పిన్నెల్లిపై పచ్చ కుట్రలు.. విర్రవీగితే నష్టం తప్పదు..

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖలో ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ కొద్దిమంది పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమిటి? ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఆ పోలీసులపై పెత్తనం చెలాయించడం ఏమిటి? గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎవరిపైన అయినా నిర్దిష్ట ఆరోపణలు వస్తే ఆ పోలీసు అధికారులను బదిలీ చేయడం సహజమే. ఇదేమి కొత్త విషయం కాదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వేరే అధికారులను నియమిస్తుంది. ఇక్కడే ఈసీ పెద్ద తప్పు చేసింది. ఏపీలో తెలుగుదేశం కూటమికి సాయం చేయడానికి నడుం కట్టినట్లు ఉంది. వెంటనే కూటమి నేతలు కొరుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను, కింది స్థాయి పోలీసు అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చేసింది. దాని ఫలితమే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి మొదలైన చోట్ల హింసాయుత ఘటనలకు అవకాశం ఏర్పడింది. చివరికి ఈసీ తాను నియమించిన కొందరు అధికారులనే సస్పెండ్ చేయవలసి వచ్చింది.దాంతో ఈసీకి అప్రతిష్ట వచ్చింది. అయినా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు మారినట్లు లేదు. ఇప్పటికీ టీడీపీ ట్రాప్‌లోనే కొనసాగుతూ వైఎస్సార్‌సీపీని ఇబ్బందిపెట్టాలని ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైకోర్టులో వెల్లడైన అంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను కిందపడేశారనో లేక ద్వంసం చేశారన్న కేసులో బెయిల్ పొందగానే, అంతకు ముందు జరిగిన ఘటనలలో పనికట్టుకుని ఈయనపై కేసులు పెట్టారట. అందులో సీఐపై దాడి వంటి కేసులు కూడా ఉన్నాయి. ఘటనలు జరిగి పది రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఏపీలో ఆ పోలీసు అధికారులకు మాత్రం ఆ ప్రశ్న రాలేదు.ఎలాగైనా పిన్నెల్లిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి ఆయనను కౌంటింగ్ వద్దకు రాకుండా చేయాలన్నది వారి కుట్ర అట. లేకుంటే డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పిన్నెల్లిపై ఈ నెల 22 న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లి న్యాయవాదులు కింది కోర్టులో ఉన్న సంబంధిత డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఈ నెల 23న అంటే ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ రాగానే కొత్త కేసులు పెట్టారని హైకోర్టుకు చూపించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి కేసులో బెయిల్ పొందారు. ఇక్కడ అందుకు బిన్నంగా పోలీసులే తప్పుడు సమాచారం ఇచ్చి ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేయాలని తలపెట్టారు. ఇది సిగ్గు చేటైన విషయం. ఇదంతా పిన్నెల్లిపై కక్షతో ఉద్దేశపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.ఒక సీఐ స్థాయి అధికారి ప్రైవేటు లాయర్‌ను పెట్టుకోవడం ఏమిటో తెలియదు. నిజానికి ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడుల కేసులలో ప్రభుత్వమే లాయర్లను పెడుతుంది. లేదా నిర్దిష్ట అనుమతి తీసుకుని వ్యక్తిగత లాయర్లను నియమించుకోవచ్చు. అలాకాకుండా నేరుగా ఇలా చేశారంటే ఆ సీఐని ఏమనుకోవాలి. ఆయన వెనుక మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చిత్రమేమిటంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఈసీ, అధికార వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. చివరికి ఒక సీఐ స్థాయి అధికారి తప్పుడు కేసులు పెడుతుంటే వైఎస్సార్‌సీపీ నిస్సహాయంగా మిగిలిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రిఫరీ మాదిరిగా కాకుండా, కూటమిలో బాగస్వామిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి.పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో అత్యంత నిష్పక్షపాతంగా ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎస్.ఎస్.పి యాదవ్ అనే అధికారి డీజీపీగా ఉన్నారు. ఆయనపై విపక్షం ఆరోపణలు చేస్తే ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత ఎ.కె మహంతి అనే సీనియర్ అధికారిని డీజీపీగా నియమించింది. ఆయన నిజాయితీగా తన సేవలు అందించారు. దాంతో ఏ పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈసీ తీరే అభ్యంతరకరంగా ఉంటే, ఈసీ నియమించిన తాత్కాలిక అధికారులు మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా కొద్ది మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారి తెంపరితనాన్ని సూచిస్తుంది.డీజీపీగా వచ్చిన హరీష్ గుప్తపై తొలుత ఆరోపణలు రాలేదు. కానీ ఎవరి ఒత్తిడికి లొంగారో కానీ పిన్నెల్లిని అరెస్టు చేయడం కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇలా చేసిన పోలీసులకు ఇక్కట్లు తప్పవు. 2009 లో ఏ అధికారిని మార్చినా వైస్ రాజశేఖరరెడ్డి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అదే మాదిరి వ్యవహరిస్తూ ఏ అధికారిని మార్చి, ఎవరిని పెట్టుకున్నా ప్రత్యేకించి స్పందించకపోవడం విశేషం.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత రచ్చ చేసింది అందరికి తెలుసు. కేవలం టీడీపీ కూటమికి సాయపడడం కోసం ఈ అధికారులు తమ కెరీర్ ను దెబ్బతీసుకుంటున్నారనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను కింద పడేసిన ఘటనకు సంబంధించి ఈసీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఎడిట్ అయి టీడీపీ నేత లోకేష్ వద్దకు చేరడం, దానిని ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టడం, కేవలం దానిపై ఆధారపడి ఈసీ పిన్నెల్లిపై కేసు పెట్టాలని నిర్ణయించడం వివాదాస్పదం అయింది. అదే టైమ్ లో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్ నుంచి టీడీపీ వారు బయటకు తోసేసి దౌర్జన్యం చేసిన వీడియోలను వైఎస్సార్‌సీపీవారు ఈసీకి పంపినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది.మరో సంగతి చెప్పాలి. టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి, ప్రభాకరరెడ్డిలు వేర్వేరు కేసుల్లో చిక్కి పోలీసులకు దొరకకుండా పారిపోతే కనీసం ఒక్క ముక్క రాయని ఎల్లో మీడియా, పిన్నెల్లిపై మాత్రం కక్ష కట్టి పరార్ అంటూ పెద్ద, పెద్ద కథనాలు వండి వార్చింది. అంతేకాదు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఈసీ వారిని బదిలీ చేయడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడు వంటి పత్రికలు మరీ అథమ స్థాయికి దిగజారి డీజీపీని బదిలీ చేసినా, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదంటూ పెద్ద, పెద్ద స్టోరీలు అల్లింది. అంటే ఈయనను కూడా తొలగిస్తే కౌంటింగ్ సమయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్నది టీడీపీ, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి భావన కావచ్చు.రాధాకృష్ణ తీరు మరీ విడ్డూరం. ఆయనేమో రాజకీయ రొచ్చులో, అవినీతి బురదలో నిండా మునిగి ఉంటారు. జవహర్ రెడ్డి వంటి అధికారులపై మరకలు పూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారట. జగన్ దగ్గరకు వచ్చాకే పాడయ్యారట. ఇంత చెత్తగా వార్తలు రాసే ఆంద్రజ్యోతిని ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ సమయంలో జవహర్‌ను తప్పించి తమకు కావల్సిన అధికారిని ఎవరినైనా పెట్టించుకుని అవకతవకలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఉన్నారేమో తెలియదు కానీ, చెత్త వార్తలు రాయడానికి పోటీపడుతున్నారు. జవహర్ రెడ్డి బదిలీ ఒక్క విషయాన్ని మాత్రం ఈసీ ఇంకా అంగీకరించలేదు. దాంతో ఈనాడు, ఇతర ఎల్లో మీడియా జవహర్ రెడ్డి పై కక్ష కట్టి చోటా, మోటా నేతలతో ఆయన మీద ఆరోపణలు చేయించి, వాటిని తమ మీడియాలో పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. బహుశా గతంలో ఇంత నీచమైన రాజకీయం, జర్నలిజం చూడలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. ఆ సంగతి మరిచి విర్రవీగితే వారికే నష్టం.మరో సంగతి చెప్పాలి. పోస్టల్ బాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశం అంతటికి ఇచ్చిన గైడ్ లైన్స్ ను కాదని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా కొత్త ఆదేశం ఇవ్వడం వివాదం అయింది. మీనా తప్పును సరిచేసుకోకపోతే ఆయనపై కూడా సందేహాలు వస్తాయి. గతంలో 2009లో ఎన్నికలు ఫలితాలు వచ్చి మరోసారి ప్రభుత్వం రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి ఎస్.ఎస్.పీ యాదవ్ ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు కూడా తనపై ద్వేషంతో టీడీపీ కూటమి బదిలీ చేయించిన అధికారులందరిని తిరిగి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ పదవులలోకి తీసుకుంటారన్నది కూడా నిజం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Rajinikanth Went Himalayas Mountains
హిమాలయాలకు బయల్దేరిన రజనీకాంత్‌.. ఎన్నికలపై కామెంట్‌

సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి హిమాలయాల బాటపట్టారు. బుధవారం చెన్నై నుంచి విమానంలో ఆయన బయల్దేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయనున్నారు. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యం.. హిమాలయాలకు వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. అందుకే తాను ప్రతి ఏటా వెళ్తున్నట్లు అన్నారు.ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని రజనీకాంత్‌ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలు దేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళతానని.. ఇప్పుడు కూడా బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. గతేడాది జైలర్‌ సినిమా విడుదలకు ముందు కూడా హిమాలయాలకు రజనీకాంత్‌ వెళ్లిన విషయం తెలిసిందే.ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీ తప్పుకున్నారు. అలాగే, రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్‌నాథ్, బాబాజీ గుహతో సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు సమాచారం. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్‌’ సినిమాలో తన భాగం చిత్రీకరణని పూర్తి చేశారు రజనీ. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చిందని రజనీ తెలిపారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.

Ysrcp Complaint To Central Election Commission On Ceo Memo
సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

సాక్షి, ఢిల్లీ: సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వై ఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.అటెస్టేషన్‌ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని.. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది.

 Nita Ambani Drinks Water From A Water Bottle Worth Rs 49 Lakhs check how
నీతా అంబానీ తాగే వాటర్‌ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్‌ సంగతేంటి?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్‌లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్‌ ఏంటి అనేది ఎపుడూ హాట్‌ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారని సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటి అవి నీళ్లా? లేక బంగారమా? ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఎంతయినా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ భార్య కదా. తనకు తక్కువేంటీ? అనుకునే వాళ్లున్నారు. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే అని కూడా ప్రచారం చేఉశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం చేశారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్‌ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఈ వాటర్‌కు అంత క్రేజ్‌ ఉందని ప్రచారం చేశారు. దీనిపై ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారు. మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ.. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చేశారట. రూ. 49 లక్షల వాటర్‌ బాటిల్‌ కథకాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమె ఓ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. ఈ బాటిల్‌ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఖరీదైన నీళ్లలాగే.. ఖరీదైన బాటిల్‌ గురించి కూడా నీతా ఏదో ఒక స్పష్టత ఇస్తారేమో.

AP Elections 2024 Judgement Counting Six More Days
ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!

జూన్‌ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.ఎన్నికల పోలింగ్‌ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్‌ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా.. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్‌ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్‌ యాక్షన్‌ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో! పార్టీల తీరు ఇలా..ఏపీలో వైఎస్సార్‌సీపీలో జోష్‌ కనిపిస్తోంది. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్‌ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్‌ అధికారికంగా లండన్‌పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement