ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం | Sakshi
Sakshi News home page

Income Tax: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Published Mon, Apr 1 2024 12:11 PM

Central Govt Clarify On Income Tax Regime - Sakshi

ఏప్రిల్‌ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆ సమాచారంపై చాలామందికి సరైన అవగాహనలేక తప్పుదారి పట్టిస్తుంటారు. తాజాగా ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. అందరూ తప్పకుండా కొత్త పన్ను స్లాబ్‌లనే పాటించాలని పోస్టులు పెడుతున్నారు. ఈ అంశం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దాంతో కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలపై క్లారిటీ ఇస్తూ మంత్రిత్వశాఖ తన ‘ఎక్స్‌’ ఖాతాలో కొన్ని కీలకాంశాలను పేర్కొంది.

ఆర్థికశాఖ వివరాల ప్రకారం..పన్ను విధానంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా మారేదీ ఏదీ లేదు. పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్‌ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానాన్ని గతంలోనే ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్‌ (స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, ఫ్యామిలీ పెన్షన్‌ రూ.15,000 మినహా) కొత్త విధానంలో లేవు. 

ఇదీ చదవండి: పెరిగిన టోల్‌ ధర.. ఏమిటీ టోల్‌ ట్యాక్స్‌? ఎందుకు చెల్లించాలి?

కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్‌ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement