అలర్ట్‌: ఆధార్‌-పాన్‌ లింక్‌ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్‌ | Sakshi
Sakshi News home page

అలర్ట్‌: ఆధార్‌-పాన్‌ లింక్‌ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్‌

Published Thu, Apr 25 2024 2:46 PM

Link PAN Aadhaar by May 31 to Avoid double tds

ఆధార్‌-పాన్‌ లింక్‌ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.

ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ ఆధార్‌తో పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్‌) లింక్‌ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్‌ కోతలుంటాయి.  లావాదేవీ సమయంలో పాన్‌ ఇన్‌ఆపరేటివ్‌లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్‌/టీసీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌/కలెక్షన్‌ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.

ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్‌/టీసీఎస్‌ వసూలుంటుందని స్పష్టం చేసింది.

కాగా 2022 జూన్‌ 30 వరకు ఆధార్‌తో పాన్‌ అనుసంధానం ఉచితంగానే జరిగింది.  
జూలై 1 నుంచి 2023 జూన్‌ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్‌ అవ్వని పాన్‌ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్‌ కావాలంటే రూ.1,000 ఫైన్‌ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్‌, పాన్‌ లింక్‌ కాకపోతే ఐటీ రిఫండ్‌ ఉండదు. లింక్‌ చేసుకున్న తర్వాత రిఫండ్‌ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు  ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు.

Advertisement
Advertisement