అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్

Published Fri, May 3 2024 7:53 PM

Delhi Police Arrest Congress Member Arun Reddy in Amit Shah Fake Video Case

గత కొన్ని రోజులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ‘డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో’ కేసులో అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

అరుణ్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్' అనే ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాండిల్ చేసేవారు. ఇటీవల విడుదలైన డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో దేశంలోని రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా బీజేపీ నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ వైరల్ వీడియో క్లిప్ ఫేక్ అని బీజేపీ స్పష్టం చేసింది.

డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నలుగురు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సభ్యులకు (శివ కుమార్ అంబాల, అస్మా తస్లీమ్, సతీష్ మన్నె, నవీన్) పోలీసులు గతంలో సమన్లు ​​జారీ చేశారు.

అయితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియో పోస్ట్‌ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ ఈ రోజు (శుక్రవారం) కండిషనల్‌ బెయిల్‌​ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement