నామినేషన్‌ పత్రాలతో శ్రీవారిని దర్శించిన మంత్రి కారుమూరి | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ పత్రాలతో శ్రీవారిని దర్శించిన మంత్రి కారుమూరి

Published Sat, Apr 20 2024 10:30 AM

శ్రీవారి ఆలయ తూర్పు రాజగోపురం వద్ద కుటుంబ సభ్యులతో మంత్రి కారుమూరి - Sakshi

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తణుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. భార్య లక్ష్మీ కిరణ్‌, కుమారుడు, ఏలూరు వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్ధి కారుమూరి సునీల్‌తో కలసి ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా స్వామి, అమ్మవార్ల వద్ద నామినేషన్‌ పత్రాలను ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. తరువాత నామినేషన్‌ వేసేందుకు ఇక్కడి నుంచి తరలివెళ్లారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

ముసునూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టుకుని సీజ్‌ చేసినట్లు నూజివీడు సివిల్‌ సప్‌లై స్పెషల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ గుండుబోయిన వెంకటేశ్వరరావు చెప్పారు. ఎన్టీర్‌ జిల్లా గంపలగూడెం మండలం నుంచి వ్యాన్‌లో 3.50 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా, రమణక్కపేట వద్ద ఏలూరు డీఎస్‌ఓ, ఏఎస్‌ఓ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నామన్నారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్‌ చేసి స్థానిక రేషన్‌ డీలర్‌కు అప్పగించామన్నారు. యజమానులు కొడాలి వంశీకృష్ణ, మాదిరాజు కృష్ణశివదీప్‌, పెద్దిరెడ్డి రామచంద్రరావు, చారిలపై ముసునూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు విధించడంతోపాటు, కఠిన చర్యలు తీసుకుంటామని డీటీ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement