పెద్దపల్లిలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది | Sakshi
Sakshi News home page

పెద్దపల్లిలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది

Published Fri, Apr 19 2024 1:50 AM

ధర్మపురిలో ప్రసంగిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు - Sakshi

ధర్మపురి: అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్‌ వశమైందని, అదే ఊపుతో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ది శూన్యమన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం దొంగ దీక్షలు చేపడుతున్న ఈశ్వర్‌ తీరును ప్రజలు గమనించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణకు 50వేల మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కంకణం కట్టుకోవాలన్నారు. ఎమ్మెల్సీ, నిజా మాబాద్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తామని పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్‌, మంచిర్యాల ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాగూర్‌, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

కార్యకర్తకు ఫిట్స్‌..

మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్తకు ఫిట్స్‌ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే మంత్రి ప్రసంగాన్ని ఆపివేశారు. విప్‌ లక్ష్మణ్‌ అతడిని ఆస్పత్రికి తరలించారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం

ధర్మపురి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement
Advertisement