నాణ్యమైన ధాన్యం కొనాలి | Sakshi
Sakshi News home page

నాణ్యమైన ధాన్యం కొనాలి

Published Tue, Apr 23 2024 8:25 AM

పార్టీల నాయకులతో సమావేశమైన ఆర్డీవో 
 - Sakshi

బుగ్గారం/సారంగాపూర్‌: నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు అన్నారు. బుగ్గారం మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్‌ మండలంలోని బట్టపల్లి పోతారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ మహేశ్వర్‌, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

నంచర్లలో శ్రీరాముడి రథోత్సవం

పెగడపల్లి: మండలంలోని నంచర్లలోగల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిశాయి. సోమవారం స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జై శ్రీరాం జైజై శ్రీరాం..అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మండలం చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంపీపీ శోభ, ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి వెంకన్న, మంత్రి హరిగోపాల్‌, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బీడీ టేకేదారుల కమీషన్‌ పెంచాలి

కోరుట్ల: బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న టేకేదారులకు కమీషన్‌ పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ టేకేదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు కోరారు. పట్టణంలో సోమవారం టేకేదారులు సమావేశమయ్యారు. నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి బీడీ ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు పెరిగాయని, రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం గడువు కూడా ముగిసిందని, ఈ క్రమంలో వెయ్యి బీడీల కమీషన్‌ రూ.18 నుంచి రూ.30కి పెంచాలని కోరారు. కార్యక్రమంలో టేకేదారులు సాంబయ్య, శంకర్‌, రవి, నర్సయ్య, సత్తయ్య, బాబురావు, బలరాం, భూమన్న, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశం

కోరుట్ల: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌ సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఓటరు సమాచార స్లిప్పులు, పోలింగ్‌ స్టేషన్ల లొకేషన్‌ మార్పుపై వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కిషన్‌, బీజేపీ నాయకుడు ఆర్‌.సాయికృష్ణ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఎండీ.రషీద్‌ఖాన్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు జిందం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు

సారంగాపూర్‌: మండలంలోని కమ్మునూర్‌ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్ట్‌ను అదనపు ఎస్పీ (ఏఆర్‌) భీంరావు సోమవారం తనిఖీ చేశారు. అనుమతిపత్రాలు లేకుండా వస్తువులు, నగదు తీసుకెళ్తే సీజ్‌ చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై గౌతంపవార్‌ ఉన్నారు.

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
1/3

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

బుగ్గారం:యశ్వంతరావుపేటలో ఐకేపీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు
2/3

బుగ్గారం:యశ్వంతరావుపేటలో ఐకేపీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు

మాట్లాడుతున్న సుతారి రాములు
3/3

మాట్లాడుతున్న సుతారి రాములు

Advertisement
Advertisement