జనజీవన స్రవంతిలో కలవండి | Sakshi
Sakshi News home page

జనజీవన స్రవంతిలో కలవండి

Published Sat, Apr 20 2024 1:55 AM

నగదు రివార్డు అందిస్తున్న ఎస్పీ శబరీష్‌    - Sakshi

ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్‌ జగత్‌, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్‌సీ ఏ సెక్షన్‌ కమాండర్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్‌ సంజు, రెండో సీఆర్‌సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోనిలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ములుగు జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో డీడీ రూపంగా ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాంగ్మూలం ఇచ్చారన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని సూచించారు. ఎస్పీ వెంట 39వ బెటాలియన్‌ కమాండెంట్‌ రాజేష్‌ తివారి, ములుగు డీఎస్పీ రవీందర్‌ ఉన్నారు.

ధైర్యంగా ఓటుహక్కును

వినియోగించుకోవాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ములుగు ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ప్రజల్లో ఎన్నికలపై అవగాహాన కల్పిస్తూ సీఆర్పీఎఫ్‌ బలగాలతో జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవస రం లేదన్నారు. ఓటు హక్కు అనేది ఎన్నికల ప్రక్రియపై సానుకూల సందేశం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్‌, సీఐలు మేకల రంజిత్‌కుమార్‌, శంకర్‌, ఆర్‌ఐ ఆపరేషన్స్‌ సంతోష్‌, ఎస్సైలు రాజు, కమలాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్న ఎస్పీ శబరీష్‌, పోలీసులు
1/1

ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్న ఎస్పీ శబరీష్‌, పోలీసులు

Advertisement
Advertisement