90 శాతం పూర్తయిన గాలికుంటు టీకాలు | Sakshi
Sakshi News home page

90 శాతం పూర్తయిన గాలికుంటు టీకాలు

Published Tue, Apr 23 2024 8:15 AM

-

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను 90 శాతం మేర వేసినట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి జగన్నాథచారి సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు కలిపి 2.60లక్షల పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2.40లక్షల టీకాలు వేశామన్నారు. మిగతా పశువులకు నెలాఖరు నాటికి టీకాలు వేస్తామన్నారు. రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఇకనుంచి గేదెలు, ఆవులకు ప్రతి ఆరు నెలలకోసారి గాలికుంటు నివారణ టీకాలు తప్పకుండా వేస్తామన్నారు.

కొనసాగుతున్న బీఈడీ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం నిర్వహించిన పరీక్షలకు 865 మంది విద్యార్థులకు గాను 826 మంది హాజరుకాగా, 39 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.

అకాల వర్షానికి లింగంపేట కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం

Advertisement
Advertisement